PEDDI: మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల్లో ‘పెద్ది’ ఒకటి. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్, సినీ లవర్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం మరోసారి ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తూ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. ఈ వాయిదాకు కారణాన్ని మాత్రం ప్రకటించలేదు. బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నామని మాత్రమే పేర్కొన్నారు.
పెద్ది రిలీజ్ డేట్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ అనేది బేతాళ ప్రశ్నగా మారిందనే ట్రోల్స్ వస్తున్నాయి. నిజానికి ఈ మూవీ మార్చి 27న రిలీజ్ అవుతుందని ఫస్ట్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడేమో మళ్లీ జూన్ లో మూవీ వస్తుందని అనౌన్స్ చేశారు.
డేట్ ఎందుకు ఇవ్వలేదు?
పెద్ది మూవీ జూన్, 2026లో రిలీజ్ అవుతుందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వలేదు. ఇందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. జూన్ 4న కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ కూడా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు ఉన్నాయని టాక్. ఒకవేళ టాక్సిక్ పోస్ట్ పోన్ అయితే పెద్ది మూవీ ఆ డేట్ కు వచ్చే ఛాన్స్ ఉంది.
రీజన్ ఇదేనా?
ఏప్రిల్ 30న పెద్ది కచ్చితంగా రిలీజ్ అవుతుందనే అంచనాలు కలిగాయి. ఇటీవల రాకాస మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడింది. అయితే దీనికి ప్రధాన కారణం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆలస్యం కావడమే అని టాక్.
పెద్ది మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ ఫస్ట్ పార్ట్ బీజీఎం కంప్లీట్ అయింది. కానీ సెకండ్ పార్ట్ ఇంకా పెండింగ్ లో ఉందని అంటున్నారు. సినిమా ఫైనల్ ఎడిట్ చూసిన తర్వాతే సెకండ్ పార్ట్ కు బీజీఎం కంపోజ్ చేయాలని రెహమాన్ అనుకున్నాటా. అందుకే లేట్ అయిందని అంటున్నారు.
స్పెషల్ సాంగ్
{{/usCountry}}పెద్ది మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ ఫస్ట్ పార్ట్ బీజీఎం కంప్లీట్ అయింది. కానీ సెకండ్ పార్ట్ ఇంకా పెండింగ్ లో ఉందని అంటున్నారు. సినిమా ఫైనల్ ఎడిట్ చూసిన తర్వాతే సెకండ్ పార్ట్ కు బీజీఎం కంపోజ్ చేయాలని రెహమాన్ అనుకున్నాటా. అందుకే లేట్ అయిందని అంటున్నారు.
స్పెషల్ సాంగ్
{{/usCountry}}పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ సాంగ్ లో డ్యాన్స్ కోసం హీరోయిన్ సెర్చింగ్ కొనసాగుతూనే వచ్చింది. చివరకు మృణాల్ ఠాకూర్ ను మేకర్స్ ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ కూడా త్వరలోనే రెడీ కాబోతుందని తెలిసింది.
ఆలస్యం విషం
సినిమా విషయంలో ముఖ్యంగా పెద్ది లాంటి భారీ స్కేల్ మూవీ విషయంలో ఆలస్యం అనేది విషంతో సమానమనేది ఇండస్ట్రీ పండితుల మాట. ఇప్పటికే గ్లింప్స్, సాంగ్స్ తో పెద్దిపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లోనే మూవీ రిలీజ్ చేసి ఉంటే, సమ్మర్ కు పర్ఫెక్ట్ గా ఉండేది. కానీ అది కుదరలేదు. మరి జూన్ లోనైనా ఈ మూవీ వస్తుందో లేదో చూడాలి.