...
...
Next Story

Mahasakthi Trailer: అమ్మవారిలా నయనతార విశ్వరూపం.. మంత్రెగత్తెగా రెజీనా.. పూనకాలు తెప్పించేలా మహాశక్తి ట్రైలర్!

Mahasakthi Trailer: వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ నయనతార బ్లాక్ బస్టర్ సీక్వెల్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. మహాశక్తి పేరుతో ఆమె నటించిన మూవీ ట్రైలర్ ఇవాళ రిలీజైంది. ఇందులో నయనతార నట విశ్వరూపం చూపించిందని చెప్పొచ్చు.

Published on: Oct 21, 2026, 12:04:44 IST
Advertisement

Mahasakthi Trailer: లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ డివోషనల్ ఫాంటసీ మూవీ ‘మహాశక్తి’ (మూకుతి అమ్మన్ 2) ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. పాపులర్ దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2020లో వచ్చిన ‘మూకుతి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) చిత్రానికి సీక్వెల్. మహాశక్తి లేటెస్ట్ ట్రైలర్ లో మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు.

బ్లాక్ బస్టర్ సీక్వెల్

అమ్మవారిలా నయనతార విశ్వరూపం.. మంత్రెగత్తెగా రెజీనా.. పూనకాలు తెప్పించేలా మహాశక్తి ట్రైలర్!
అమ్మవారిలా నయనతార విశ్వరూపం.. మంత్రెగత్తెగా రెజీనా.. పూనకాలు తెప్పించేలా మహాశక్తి ట్రైలర్!

మూకుతి అమ్మన్ మూవీకి సీక్వెల్ గా ఈ మహాశక్తి మూవీ తెరకెక్కుతోంది. 2020లో వచ్చిన ఫస్ట్ మూవీ మూకుతి అమ్మన్ సోషల్ మెసేజ్, కామెడీ ప్రధానంగా సాగగా.. ఈ సెకండ్ పార్ట్ మాత్రం హాలీవుడ్ రేంజ్ విజువల్స్, మైథలాజికల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది.

నయనతార విశ్వరూపం

ట్రైలర్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార దైవిక అవతారంలో తన విశ్వరూపాన్ని చూపించింది. అమ్మవారిగా ఆమె పవర్‌ఫుల్ లుక్స్, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా దుష్టశిక్షణ చేసే సమయంలో ఆమె రౌద్ర రూపం, విజువల్ ఎఫెక్ట్స్ ఈ మహాశక్తి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసాయి. భక్తులను రక్షించే దైవంగా నయనతార నటన థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

మంత్రగత్తెగా రెజీనా

ఈ మహాశక్తి చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ నటి రెజీనా కాసాండ్రా. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో కనిపించిన రెజీనా.. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్‌ఫుల్ మంత్రగత్తె పాత్రలో అదరగొట్టింది. చేతబడులు, మంత్ర తంత్రాలతో ఒక యువరాజును, రాజ్యాన్ని నాశనం చేయాలని చూసే క్రూరమైన స్త్రీగా ఆమె లుక్, నటన సరికొత్తగా ఉన్నాయి. నయనతార దైవ శక్తికి, రెజీనా మంత్ర శక్తికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమాకు ప్రధాన బలమని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్

పురాతన కాలానికి, ప్రస్తుత కాలానికి ఉన్న సంబంధాన్ని చూపిస్తూ సాగే ఈ మైథలాజికల్ ఫాంటసీ కథలో భక్తితో పాటు సుందర్ సి మార్క్ కామెడీ, యాక్షన్ సమపాళ్లలో ఉండనున్నాయి.

గ్రాండ్ రిలీజ్ డేట్

భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ‘మహాశక్తి’ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks