వేల కోట్ల సినిమాలు.. వరల్డ్ వైడ్ టాప్-5 అత్యధిక కలెక్షన్ల మూవీస్.. లిస్ట్ లో థ్రిల్లర్లూ.. ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే?
ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు కొల్లగొట్టిన సినిమాలున్నాయి. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-5 మూవీస్ ఇక్కడున్నాయి. ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేయండి.
ఓటీటీలో ఎన్నో సినిమాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-5 మూవీస్ ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ఇందులో ఎక్కువ వాటా యానిమేటెడ్ సినిమాలదే. ఇందులో 15 వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలున్నాయి.

నీ ఝా 2
2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ‘నీ ఝా 2’ మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది చైనా యానిమేటెడ్ మూవీ. ఇది ప్రపంచవ్యాప్తంగా 2.13 బిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుంది. ఇండియా కరెన్సీలో ఇది సుమారు రూ.17,700 కోట్లతో సమానం. నీ ఝా 2 మూవీ నెట్‌ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో అందుబాటులో ఉంది.
లైలో అండ్ స్టిచ్
మరో యానిమేటెడ్ మూవీ లైలో అండ్ స్టిచ్ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన వాటిల్లో ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ అమెరికన్ మూవీ 1 బిలియన్ డాలర్ల వసూళ్లు సొంతం చేసుకుంది. అంటే దాదాపు రూ.8595 కోట్లతో సమానం. ఈ సినిమా జియోహాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ
వార్నర్ బ్రదర్స్ క్రియేట్ చేసిన అడ్వెంచరస్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలో ఇది మూడో ప్లేస్ లో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 957.9 మిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుంది. ఇది రూ.7950 కోట్లు. ఈ థ్రిల్లర్ సినిమా మూడు ఓటీటీల్లో ఉంది. మ్యాక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్ స్టార్ లో ఈ సినిమాను చూడొచ్చు.
జురాసిక్ వరల్డ్ రీబర్త్
మరోసారి డైనోసర్ల ప్రపంచాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన సినిమా జురాసిక్ వరల్డ్ రీబర్త్. జురాసిక్ వరల్డ్ లో భాగంగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా 868 మిలియన్ల డాలర్లు సంపాదించింది. ఇండియా కరెన్సీలో ఇది రూ.7210 కోట్లు. ఈ చిత్రం ప్రైమ్ వీడియో, జియోహాట్ స్టార్ లో ఉంది.
డీమాన్ స్లేయర్ ది మూవీ ఇన్ఫినిటీ కాస్టిల్
జపనీస్ యానిమేటెడ్ మూవీ డీమాన్ స్లేయర్ ది మూవీ ఇన్ఫినిటీ కాస్టిల్. ఇది కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 740.4 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టింది. ఇది రూ.6145 కోట్లకు సమానం. ఇది త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో రిలీజయ్యే అవకాశముంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


