Toxic Runtime: టాక్సిక్ రన్‌టైమ్.. బోల్డ్‌నెస్, వైలెన్సే కాదు.. రన్‌టైమూ చాలా ఎక్కువే.. యశ్ అంతసేపు కూర్చోబెట్టగలడా?

Toxic Runtime: యశ్ నటిస్తున్న టాక్సిక్ మూవీ రన్ టైమ్ షాక్ కు గురి చేస్తోంది. సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చిన ఈ సినిమా ఏకంగా 194 నిమిషాల రన్ టైమ్ వస్తుండటం విశేషం. అంతసేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టాలంటే కంటెంట్ ఓ రేంజ్ లో ఉండాల్సిందే.

Published on: Aug 13, 2026, 20:25:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Toxic Runtime: కేజీఎఫ్ చాప్టర్ 2 క్రియేట్ చేసిన సునామీ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 26న థియేటర్లలోకి గ్రాండ్‌గా వస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ జారీ చేయడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Toxic Runtime: టాక్సిక్ రన్‌టైమ్.. బోల్డ్‌నెస్, వైలెన్సే కాదు.. రన్‌టైమూ చాలా ఎక్కువే.. యశ్ అంతసేపు కూర్చోబెట్టగలడా?
Toxic Runtime: టాక్సిక్ రన్‌టైమ్.. బోల్డ్‌నెస్, వైలెన్సే కాదు.. రన్‌టైమూ చాలా ఎక్కువే.. యశ్ అంతసేపు కూర్చోబెట్టగలడా?

194 నిమిషాల ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

ఈ మోస్ట్ వైలెంట్ గ్యాంగ్‌స్టర్ కథనంలో అడల్ట్ కంటెంట్, రఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉండటంతో సీబీఎఫ్‌సీ (CBFC) నుంచి 'A' సర్టిఫికెట్ లభించింది. అయితే ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత ఇది అందరూ ఊహించినదే అయినా, అసలు సర్‌ప్రైజ్ ఏంటంటే ఈ సినిమా రన్‌టైమ్. దాదాపు 3 గంటల 14 నిమిషాలు (194 నిమిషాలు) సుదీర్ఘ నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ మధ్య కాలంలో వస్తున్న బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఇంత నిడివి ఉన్న చిత్రాలు అరుదుగా కనిపిస్తున్నాయి. స్క్రీన్‌ప్లే ఏమాత్రం బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే తప్ప ఇంత భారీ రన్‌టైమ్ సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టడం చాలా కష్టం. అయితే డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ మాత్రం అలాంటి కంటెంట్ నే సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇండిపెండెన్స్ తర్వాత గోవా బ్యాక్‌డ్రాప్.. రాయగా యశ్ కంబ్యాక్

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి కాలంలో గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే డార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. క్రైమ్, పవర్, వైలెన్స్ చుట్టూ కథనం చాలా రా అండ్ రస్టిక్‌గా తిరుగుతుంది. ఇందులో యశ్ 'రాయ' (Raya) అనే పవర్‌ఫుల్, వింటేజ్ షేడ్స్ ఉన్న రోల్‌లో మెరవనున్నారు.

ఈ సినిమా కథను డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌తో కలిసి యశ్ స్వయంగా రాసుకోవడం విశేషం. కేజీఎఫ్ క్రియేట్ చేసిన ప్రభంజనం తర్వాత యశ్ చాలా టైమ్ తీసుకుని ఎంచుకున్న ప్రాజెక్ట్ కావడంతో బిజినెస్ వర్గాల్లో విపరీతమైన హైప్ నెలకొంది.

భారీ తారాగణం.. రికార్డు స్థాయి బడ్జెట్

కేవలం హీరో క్యారెక్టర్ మాత్రమే కాకుండా పాన్-ఇండియా రేంజ్‌లో చాలా పెద్ద తారాగణాన్నే ఈ సినిమా కోసం దింపారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. ప్రతీ క్యారెక్టర్‌కి కథలో బలమైన ఎమోషన్, ప్రాముఖ్యత ఉన్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్పష్టమైంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కే నారాయణతో కలిసి యశ్ స్వయంగా మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More