కన్నడ స్టార్ యశ్ ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అనే ప్రాజెక్ట్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం ఆయన షర్ట్ లేకుండా సిగరెట్ తాగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇది చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
టాక్సిక్ వీడియో లీక్

యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సెట్స్ నుంచి ఓ వీడియో లీక్ అయింది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో యశ్ ఒక బాల్కనీలో నిలబడి కనిపించారు. షర్ట్ లేకుండా కేవలం జీన్స్ ధరించి, సిగరెట్ తాగుతున్న దృశ్యం అందులో ఉంది. ఈ వీడియోను ఓ అభిమాని దూరం నుంచి చిత్రీకరించారు. టేక్ సమయంలో నటుడిపై జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేశారు. కింద భాగంలో పాక్షికంగా కనిపిస్తున్న ఓ సైన్‌బోర్డ్‌పై శామ్యూల్ అనే పేరు ఉంది. బాల్కనీ కింద షాట్‌లో లేనట్లుగా నిలబడి ఉన్న కొంతమంది సిబ్బంది నవ్వుతూ కనిపించారు.
స్వాగ్ చూడండి
అనధికారికంగా బయటకు వచ్చినప్పటికీ 'టాక్సిక్' సినిమాకు సంబంధించిన ఈ చిన్న గ్లింప్స్ చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. ఒక అభిమాని ఏమో “ఆ స్వాగ్ చూడండి” అని కామెంట్ చేశారు. మరొకరు “ఓ మై గాడ్. టాక్సిక్ లీక్ వీడియో. యశ్ చాలా బాగున్నాడు” అని రాశాడు. కొంతమంది సినిమా టీజర్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ.. “యాక్షన్ టీజర్ కోసం వేచి ఉండలేకపోతున్నాం”, “టాక్సిక్ టీజర్ డే & రిలీజ్ డే వైబ్స్‌ను ఊహించుకోండి” వంటి కామెంట్లు పెట్టారు. ఉత్సాహంతో ఓ అభిమాని “కేవలం లీకైన వీడియోనే సోషల్ మీడియా మొత్తాన్ని ఏలేస్తోంది” అని రాశారు.
టాక్సిక్ గురించి..
{{/usCountry}}అనధికారికంగా బయటకు వచ్చినప్పటికీ 'టాక్సిక్' సినిమాకు సంబంధించిన ఈ చిన్న గ్లింప్స్ చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. ఒక అభిమాని ఏమో “ఆ స్వాగ్ చూడండి” అని కామెంట్ చేశారు. మరొకరు “ఓ మై గాడ్. టాక్సిక్ లీక్ వీడియో. యశ్ చాలా బాగున్నాడు” అని రాశాడు. కొంతమంది సినిమా టీజర్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ.. “యాక్షన్ టీజర్ కోసం వేచి ఉండలేకపోతున్నాం”, “టాక్సిక్ టీజర్ డే & రిలీజ్ డే వైబ్స్‌ను ఊహించుకోండి” వంటి కామెంట్లు పెట్టారు. ఉత్సాహంతో ఓ అభిమాని “కేవలం లీకైన వీడియోనే సోషల్ మీడియా మొత్తాన్ని ఏలేస్తోంది” అని రాశారు.
టాక్సిక్ గురించి..
{{/usCountry}}సెప్టెంబర్ 19న 'టాక్సిక్' అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) పేజీలో ముంబై తర్వాత బెంగళూరులో షూటింగ్ జరుపుతామని చిత్ర బృందం పేర్కొంది. “ముంబై (టిక్ ఎమోజి) బెంగళూరు (త్వరలో ఎమోజి). టాక్సిక్ బృందం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ ఆధ్వర్యంలో ముంబైలో 45 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. చివరి షెడ్యూల్ సెప్టెంబర్ చివరిలో బెంగళూరులో ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 19, 2026న మూవీ విడుదల కానుంది” అని పోస్టు చేసింది.
'టాక్సిక్' ఒక గ్యాంగ్‌స్టర్ చిత్రం. ఇందులో యశ్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ తదితరులు నటిస్తున్నారు. దీనిని వెంకట్ కె నారాయణ, యశ్ తమ కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.