కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్- ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic) టీజర్ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. స్మశాన వాటికలో చిత్రీకరించిన ఒక సన్నివేశంపై క్రిస్టియన్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు కూడా చేశాయి. ఈ వివాదంపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించాడు.
స్మశానంలో ఆ సీన్ ఏంటి?

యశ్ హీరోగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ మూవీ 'టాక్సిక్'. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. మొదట మహిళా కమిషన్ అభ్యంతరం తెలపగా, తాజాగా క్రిస్టియన్ సంఘాలు (నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్) ఈ టీజర్‌పై మండిపడుతున్నాయి.
ఎన్‌సీఎఫ్ (NCF) ప్రతినిధులు సెన్సార్ బోర్డు, ఫిల్మ్ చాంబర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఫిర్యాదు చేశారు. టీజర్‌లో చూపించిన ఒక స్మశాన వాటిక సీన్ తమ మనోభావాలను దెబ్బతీసిందని వారు పేర్కొన్నారు.
స్మశానంలో పార్క్ చేసిన కారులో శృంగార సన్నివేశం, ఆ తర్వాత అక్కడే కాల్పులు జరగడం అభ్యంతరకరమని వారు వాదిస్తున్నారు. ఆ సన్నివేశంలో 'ఆర్చ్ ఏంజెల్ మైఖేల్' విగ్రహం కనిపిస్తుందని, పవిత్రమైన స్థలంలో ఇలాంటి అసభ్యకర దృశ్యాలు చిత్రీకరించడం తమ మతాన్ని అవమానించడమేనని ఆరోపించారు. వెంటనే యూట్యూబ్, సోషల్ మీడియా నుంచి ఆ టీజర్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
నటి సోషల్ మీడియా డిలీట్..
ఈ టాక్సిక్ టీజర్‌లో కనిపించిన నటి బీట్రిస్ టౌఫెన్‌బాచ్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ ఇంటిమేట్ సీన్ మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉందంటూ విమర్శలు రావడంతో, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసుకుంది.
అనురాగ్ కశ్యప్ మద్దతు..
ఈ వివాదాల నడుమ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ 'టాక్సిక్' టీమ్‌కు మద్దతుగా నిలిచాడు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ.. "టాక్సిక్ సినిమా ఒక సాహసోపేతమైన ప్రయత్నం. మగవాళ్ళు షర్ట్ లేకుండా కనిపిస్తే ఎవరూ ప్రశ్నించరు. కానీ ఒక స్త్రీ తన శృంగారాన్ని లేదా కోరికను వ్యక్తపరిస్తే మాత్రం అంగీకరించలేరు. ఇది మన సాంస్కృతిక కపటత్వానికి నిదర్శనం" అని అతడు కామెంట్ చేశాడు.
{{/usCountry}}ఈ వివాదాల నడుమ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ 'టాక్సిక్' టీమ్‌కు మద్దతుగా నిలిచాడు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ.. "టాక్సిక్ సినిమా ఒక సాహసోపేతమైన ప్రయత్నం. మగవాళ్ళు షర్ట్ లేకుండా కనిపిస్తే ఎవరూ ప్రశ్నించరు. కానీ ఒక స్త్రీ తన శృంగారాన్ని లేదా కోరికను వ్యక్తపరిస్తే మాత్రం అంగీకరించలేరు. ఇది మన సాంస్కృతిక కపటత్వానికి నిదర్శనం" అని అతడు కామెంట్ చేశాడు.
{{/usCountry}}