Toxic Collection: 4 రోజుల్లో రూ. 250 కోట్ల కలెక్షన్స్- నెగెటివ్ టాక్‌తోనూ యశ్ టాక్సిక్ విధ్వంసం- ఎక్కడెంత వచ్చిందంటే?
Yash Toxic Box Office Collection Day 4: రాకింగ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్‌తోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 254.75 కోట్ల గ్రాస్ సాధించి వసూళ్ల రికార్డులు తిరగరాస్తోంది.
Yash Toxic 4 Days Worldwide Collection: 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

రూ. 250 కోట్ల కలెక్షన్స్‌తో టాక్సిక్
భారీ అంచనాల మధ్య ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైన ఈ టాక్సిక్ చిత్రం నాలుగో రోజు (ఆగస్టు 29) నాటికి రూ. 250 కోట్ల క్లబ్‌లో చేరి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా యశ్‌కి ఉన్న విపరీతమైన ఫాలోయింగ్‌తో 'టాక్సిక్' చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.
పక్కా ప్లానింగ్‌తో రికార్డు స్థాయి ఓపెనింగ్స్!
మిక్స్‌డ్ రివ్యూలు, నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్ల వద్ద ప్రేక్షకుల హడావుడి తగ్గకపోవడమే ఈ భారీ వసూళ్లకు ప్రధాన కారణం. తొలి రోజే భారతదేశ వ్యాప్తంగా రూ. 101.10 కోట్ల నెట్ సాధించిన ఈ టాక్సిక్ సినిమా ఇటీవల వచ్చిన 'ధురంధర్ పార్ట్ 1' కలెక్షన్ల రికార్డులను దాటేసింది.
ఇండియాలో టాక్సిక్ మూవీకి తొలి రోజు గ్రాస్ రూ. 120.75 కోట్లు రాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 20 కోట్లు వచ్చాయి. దీంతో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 140.75 కోట్ల గ్రాస్ నమోదు చేసి యశ్ గ్లోబల్ రేంజ్‌ను చాటిచెప్పారు.
రెండో రోజున దేశీయంగా రూ. 37.65 కోట్ల నెట్, మూడో రోజు రూ. 27.20 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. మూడో రోజు నాటికే దేశీయంగా రూ. 165.95 కోట్ల నెట్ (గ్రాస్ రూ. 198.10 కోట్లు) సాధించి బాక్సాఫీస్ వద్ద బలమైన పట్టు సాధించింది టాక్సిక్ మూవీ.
నాలుగో రోజు భాషల వారీగా వసూళ్లు ఎంతంటే?
ట్రేడ్ వర్గాలు అందించిన గణాంకాల ప్రకారం, నాలుగో రోజు టాక్సిక్ చిత్రం భారతదేశంలో రూ. 24.50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో దేశీయంగా మొత్తం 4రోజుల నెట్ వసూళ్లు రూ. 190.45 కోట్లకు (గ్రాస్ రూ. 227.50 కోట్లు) చేరుకున్నాయి.
భాషల వారీగా చూస్తే, నాలుగో రోజు హిందీ బెల్ట్‌లో రూ. 15.50 కోట్లు, మాతృభాష కన్నడలో రూ. 6.60 కోట్లు వచ్చాయి. తెలుగులో రూ. 1.50 కోట్లు, తమిళంలో రూ. 75 లక్షలు, మలయాళంలో రూ. 15 లక్షలు నమోదు అయ్యాయి.
రూ. 250 కోట్ల మైలురాయి దాటిన 'టాక్సిక్'
ఓవర్సీస్ మార్కెట్‌లో నాలుగో రోజు మరో రూ. 4 కోట్లు రావడంతో, విదేశీ మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 27.25 కోట్లకు చేరాయి. ఫలితంగా 'టాక్సిక్' సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 254.75 కోట్ల భారి గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
టాక్ అటుఇటుగా ఉన్నా మాస్ ఆడియన్స్ ఆదరణతో మొదటి వీకెండ్ బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ జాతర సాగింది. రాబోయే వర్కింగ్ డేస్‌లో ఇదే ఊపు కొనసాగిస్తే లాంగ్ రన్‌లో ఈ యశ్ సినిమా టాక్సిక్ మరిన్ని రికార్డులను నెలకొల్పడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


