...
...
Next Story

Toxic Ladies Teaser: వైల్డ్ స్టోన్ యాడ్‌లాగా ఉంది.. అసలు ఓ లేడీ డైరెక్టరే ఈ సినిమా తీసిందా: టాక్సిక్‌ టీజర్‌పై ట్రోలింగ్

Toxic Ladies Teaser: యశ్ నటిస్తున్న టాక్సిక్ నుంచి తాజాగా వచ్చిన లేడీస్ అండ్ లేడీస్ టీజర్ పై దారుణమైన విమర్శలు వస్తున్నాయి. ఇది వైల్డ్ స్టోన్ యాడ్ లాగా ఉందని ఓ యూజర్ కామెంట్ చేయడం గమనార్హం. అసలు ఓ లేడీ డైరెక్టరే ఈ సినిమా తీసిందా అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Published on: Jul 1, 2026, 15:18:45 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Toxic Ladies Teaser: "లేడీస్ అండ్ లేడీస్".. పేరు చూసి యశ్ (Yash) నటిస్తున్న 'టాక్సిక్' (Toxic) సినిమాలో హీరోయిన్ల రోల్స్ ఎలా ఉండబోతున్నాయో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ తీరా టీజర్ రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. లేడీస్ టీజర్‌లో కూడా యశ్ డామినేషన్ ఏంటి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో టాక్సిక్ టీజర్‌పై ట్రోల్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

టాక్సిక్ లేడీస్ మరీ ఇంత దారుణంగానా?

Toxic Ladies Teaser: వైల్డ్ స్టోన్ యాడ్‌లాగా ఉంది.. అసలు ఓ లేడీ డైరెక్టరే ఈ సినిమా తీసిందా: టాక్సిక్‌ టీజర్‌పై ట్రోలింగ్
Toxic Ladies Teaser: వైల్డ్ స్టోన్ యాడ్‌లాగా ఉంది.. అసలు ఓ లేడీ డైరెక్టరే ఈ సినిమా తీసిందా: టాక్సిక్‌ టీజర్‌పై ట్రోలింగ్

కేజీఎఫ్ 2 (KGF 2) 2022లో రిలీజై ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీదకు వస్తుండటంతో ఈ కమ్‌బ్యాక్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) డైరెక్ట్ చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌ టాక్సిక్ లో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు.

మొదట రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం కేవలం యశ్‌నే ఫోకస్ చేయడంతో ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. లేడీస్ క్యారెక్టర్స్‌ను అస్సలు చూపించకపోవడంపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫీడ్‌బ్యాక్‌ను గట్టిగా తీసుకున్న మేకర్స్ రీసెంట్‌గా 'లేడీస్ & లేడీస్' పేరుతో ఓ స్పెషల్ టీజర్ రిలీజ్ చేశారు. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి దారుణమైన రెస్పాన్స్ వస్తోంది.

బూతు డైలాగ్స్‌.. సెన్సార్ కష్టాలు తప్పవా?

టీజర్ పేరు లేడీస్ అని పెట్టి, కనీసం హీరోయిన్లకు ఒక్క డైలాగ్ కూడా ఇవ్వకపోవడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్లను కేవలం 5-10 సెకన్ల పాటే చూపించి, మళ్ళీ మొత్తం యశ్‌తోనే నింపేశారని ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. యూట్యూబ్ థంబ్‌నెయిల్‌లో కూడా యశ్ ఫొటోనే ఉండటంతో "ఇదేం నార్సిసిజం బ్రో" అంటూ రెడిట్, ఎక్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

సినిమాకు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఉన్నప్పటికీ, కథలో ఫిమేల్ క్యారెక్టర్స్‌ను చూపించిన విధానం చూస్తుంటే అంతా మగవాళ్ల డామినేషన్ కోణంలోనే ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. "యశ్ ఈ సినిమాను షాడో డైరెక్ట్ చేస్తున్నాడని నాకు పక్కాగా అనిపిస్తోంది" అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.850–1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత ఫైనల్‌గా ఈ ఆగస్ట్ 26న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.

టాక్సిక్ సినిమా వివరాలు

✦ సినిమా పేరు: టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్

✦ హీరో: యశ్ (Yash)

✦ హీరోయిన్లు: నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా

✦ డైరెక్టర్: గీతూ మోహన్‌దాస్

✦ ప్రొడక్షన్: KVN ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్

✦ బడ్జెట్: రూ.850 – 1000 కోట్లు

✦ రిలీజ్ డేట్: ఆగస్ట్ 26, 2026

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe