...
...
Next Story

Toxic Twitter Review: టాక్సిక్ ట్విటర్ రివ్యూ.. యశ్ మూవీకి షాక్.. మూడు గంటల నరకం.. నెటిజన్ల దారుణమైన రియాక్షన్!

Toxic Twitter Review: భారీ తారాగాణం.. అంతకంటే భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చేసింది టాక్సిక్ మూవీ. కానీ ఇవాళ రిలీజైన ఈ యశ్ సినిమాకు నెటిజన్ల నుంచి షాకింగ్ రియాక్షన్ వస్తోంది. మూవీకి నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. మూడు గంటల నరకమంటూ ట్విటర్ రివ్యూలు పోస్టు చేస్తున్నారు.

Published on: Aug 26, 2026, 08:47:27 IST
Advertisement

Toxic Twitter Review: 'కేజీఎఫ్' (KGF) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు రాకింగ్ స్టార్ యశ్. నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ (ఆగస్టు 25) థియేటర్లలోకి అడుగుపెట్టింది. అయితే ఈ మూవీకి షాకింగ్ ట్విటర్ రివ్యూలు వస్తున్నాయి.

టాక్సిక్ ట్విటర్ రివ్యూ

టాక్సిక్ ట్విట్టర్ రివ్యూ.. యష్ మూవీకి షాక్.. మూడు గంటల నరకం.. నెటిజన్ల దారుణమైన రియాక్షన్! (x/Toxic_themovie)
టాక్సిక్ ట్విట్టర్ రివ్యూ.. యష్ మూవీకి షాక్.. మూడు గంటల నరకం.. నెటిజన్ల దారుణమైన రియాక్షన్! (x/Toxic_themovie)

భారీ అంచనాలతో టాక్సిక్ మూవీ బుధవారం థియేటర్లలో రిలీజైంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బుక్‌మైషోలో గంటకు 50 వేల టికెట్లు అమ్ముడవడమే కాకుండా, తొలిరోజే 100 కోట్ల వరకు వసూళ్లు సాధించే దిశగా బాక్సాఫీస్ వద్ద ఘనమైన బోణీ కొట్టేలా యశ్ సినిమా ఉంది. అయితే, థియేటర్ల నుంచి వస్తున్న ప్రీమియర్ టాక్ మాత్రం అభిమానులకు, సినీ ప్రియులకు షాక్ కలిగిస్తోంది.

స్టైల్ ఎక్కువ.. స్కోప్ తక్కువ!

మూడు గంటలకు పైగా రన్ టైమ్ తో 'A' సర్టిఫికేట్‌తో వచ్చిన టాక్సిక్ సినిమాలో యశ్ తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి భారీ తారగణం నటించింది. అయితే ప్రచార చిత్రాలు పెంచిన అంచనాలను సినిమా అందుకోలేకపోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు, ప్రముఖ సినీ విమర్శకులు ట్రోల్స్ చేస్తున్నారు. కేవలం స్టైలిష్ ప్రెజెంటేషన్ పైనే దృష్టి పెట్టిన దర్శకురాలు గీతూ మోహన్‌దాస్, కథా కథనాలను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పీడకలలా మారిందంటూ

"సాంకేతికంగా సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ, గందరోగళంగా ఉన్న స్క్రీన్‌ప్లే, బలహీనమైన డైలాగులు, ఎడిటింగ్ లోపాల వల్ల ఇది ఒక పీడకలలా మారింది. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఇబ్బందికరంగా అనిపించింది. యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, క్లైమాక్స్ మాత్రమే కాస్త ఉపశమనం" అని ఓ నెటిజన్ తన ట్విటర్ రివ్యూ పంచుకున్నాడు.

బోరింగ్ సినిమా

హింసపైనే ఆధారపడి

"కేజీఎఫ్ శైలిని అనుకరించబోయి అసలుకే ఎసరు తెచ్చారు. కథ లేకుండా కేవలం ఎలివేషన్లు, అనవసరమైన హింసపైనే ఆధారపడ్డారు. గీతూ మోహన్‌దాస్ భారీ క్యాన్వాస్‌ను పూర్తిగా వృథా చేసుకున్నారు" అని మరో నెటిజన్ పోస్టు చేశారు.

అదే మైనస్

"భారీ బడ్జెట్, గ్రాండ్ స్కేల్ ఉన్నప్పటికీ కథలో స్పష్టత, అసలైన కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడం సినిమాను దెబ్బతీసింది. మహిళా పాత్రల ఓవర్‌లోడ్‌తో పాటు ఉద్దేశం లేని యాక్షన్ సీన్లు ప్రేక్షకులకు పరీక్ష పెట్టాయి. తెలుగు డబ్బింగ్ కూడా కొన్ని చోట్ల అసహజంగా అనిపిస్తుంది" అని ఒకరు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

మూడు గంటల నరకం

"మూడు గంటల సుదీర్ఘమైన టాక్సిక్ నరకాన్ని భరించిన తర్వాత యశ్ కోసమే కాకుండా, మన సమయం వృథా అయినందుకు బాధకలుగుతుంది. రిలీజ్‌కు ముందు చిత్రబృందం ఇచ్చిన భారీ స్పీచ్‌లను తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది" ఒకరు రాసుకొచ్చారు.

యశ్ ప్రెజెన్స్ ఒక్కటే

అత్యంత క్లిష్టమైన స్క్రీన్‌ప్లే, స్లోగా సాగే కథనం మధ్య రాకింగ్ స్టార్ యశ్ తన శక్తినంతా ధారపోసి నటించిన తీరును మాత్రం ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ లుక్స్, కొన్ని యాక్షన్ సీన్లు, క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రమే ఈ టాక్సిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కేజీఎఫ్ తర్వాత నాలుగేళ్లు వేచి చూసిన అభిమానులకు మాత్రం ఈ 'టాక్సిక్' సినిమా తీవ్ర నిరాశ కలిగించిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe