Toxic Postpone: బిగ్ బ్రేకింగ్.. అమెరికా-ఇరాన్ వార్ ఎఫెక్ట్.. టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే

Toxic Postpone: బిగ్ బ్రేకింగ్.. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'టాక్సిక్' సినిమా రిలీజ్ వాయిదా పడింది. అమెరికా-ఇరాన్ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మూవీ విడుదలను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. 

Published on: Mar 4, 2026, 10:29:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బ్రేకింగ్.. రిలీజ్ కు ఇంకా 16 రోజులు మాత్రమే ఉండగా టాక్సిక్ మూవీ మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడి కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణం. టాక్సిక్ రిలీజ్ ను వాయిదా వేసిన నిర్మాతలు కొత్త విడుదల డేట్ ను కూడా ప్రకటించారు.

హీరో యష్
హీరో యష్

టాక్సిక్ పోస్ట్ పోన్

"టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్".. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సినిమా. కేజీఎఫ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ నాలుగేళ్ల తర్వాత తిరిగి సిల్వర్ స్క్రీన్ మీదకు టాక్సిక్ మూవీతో రాబోతున్నాడు. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తాజాగా ఈ మూవీ రిలీజ్ ను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు.

అదే కారణం

ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కారణంగానే టాక్సిక్ మూవీ రిలీజ్ వాయిదా పడ్డట్లు బుధవారం (మార్చి 3) మేకర్స్ ప్రకటించారు. ఈ వార్ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ చేస్తే సినిమాకు ఆయా దేశాల్లో ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం ఉందని టాక్సిక్ నిర్మాతలు భావించారు.

గ్లోబల్ ఆడియన్స్ కోసం

"టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ సినిమా గ్లోబల్ ఆడియన్స్ కోసం తెరకెక్కింది. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కు ఈ మూవీ కనెక్ట్ కావాలన్నదే మా ఉద్దేశం. కొన్నేళ్లుగా మూవీ కోసం అంకితభావంతో పనిచేశాం. మార్చి 19న సినిమాను మీ అందరి ముందుకు తేవాలనే ఉత్సాహంతో ఉండేవాళ్లం’’ అని ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా అయిన యష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పంచుకున్నాడు.

కొత్త రిలీజ్ డేట్

‘‘యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు సినిమాను ప్రభావితం చేసేలా ఉన్నాయి. అందుకే మా భాగస్వాముల, ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మా సినిమా రిలీజ్ డేట్ ను రీషెడ్యూల్ చేయాలని అనుకున్నాం. కష్టమైనా కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. జూన్ 4, 2026న టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది’’ అని యష్ తన పోస్టులో కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశాడు.

టాక్సిక్ గురించి..

గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన 'టాక్సిక్' లో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితర హీరోయిన్లు నటించారు. ఈ మూవీ గ్లింప్స్, టీజర్ లో ఎక్కువగా వైలెన్స్, లైంగిక సన్నివేశాలు చూపించారనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ధురంధర్ 2 కు బెనిఫిట్

టాక్సిక్ మూవీ రిలీజ్ వాయిదా నేపథ్యంలో ధురంధర్ 2 సినిమాకు బెనిఫిట్ కలిగే అవకాశముంది. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. టాక్సిక్ తో పోటీ ఉంటుందని భావించినా ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. దీంతో సోలోగా బాక్సాఫీస్ ను షేక్ చేసే ఛాన్స్ ధురంధర్ 2 కు వచ్చింది. మరి ఈ సినిమా అదే రోజు వస్తుందా? లేదా యుద్దం కారణంగా దీని రిలీజ్ కూడా వాయిదా పడుతుందా? అన్నది చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More