Dhurandhar 2 Trailer: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ వాయిదా.. ఈవెంట్ లేకుండానే!
Dhurandhar 2 Trailer: బ్లాక్ బస్టర్ సీక్వెల్ ధురంధర్ 2 పై హైప్ మామూలుగా లేదు. ఈ మూవీ ట్రైలర్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మార్చి 3 ట్రైలర్ రిలీజ్ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ చంద్ర గ్రహణం ఎఫెక్ట్ కారణంగా ట్రైలర్ రిలీజ్ వాయిదా పడిందని తెలిసింది.
ధురంధర్ 2 ట్రైలర్ ఎక్కడ?.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ప్రశ్న వైరల్ గా మారింది. నిజానికి మార్చి 3న ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్ అవుతుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ తీరా ఒక రోజు గడిచినా ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే మంగళవారం చంద్ర గ్రహణం కారణంగా ధురంధర్ 2 ట్రైలర్ ను రిలీజ్ చేయలేదని తెలిసింది.

ధురంధర్ 2 ట్రైలర్
బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా ధురంధర్ ది రివేంజ్ మూవీ రాబోతుంది. ఈ ధురంధర్ 2 మూవీ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మార్చి 3న ట్రైలర్ రిలీజ్ చేస్తారని తెలిసింది. కానీ చంద్ర గ్రహణం కారణంగా ట్రైలర్ రిలీజ్ వాయిదా పడిందని సమాచారం.
ఈ చంద్ర గ్రహణం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు ఉంది. జ్యోతిష్యపరంగా ఉదయం 9:39 గంటల నుంచే అశుభ కాలం మొదలైందని అంటున్నారు.
చంద్ర గ్రహణంతో
బాలీవుడ్ హంగామా రిపోర్ట్ ప్రకారం చంద్ర గ్రహణం కారణంగా ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ వాయిదా పడిందని తెలిసింది. ‘‘ధురంధర్ ది రివేంజ్ ట్రైలర్ ను మార్చి 3న రిలీజ్ చేయాల్సింది. కానీ ఆ రోజు చంద్ర గ్రహణం వచ్చింది. దీంతో ట్రైలర్ ను రిలీజ్ చేయలేదు. గ్రహణం సమయాన్ని అశుభకరంగా భావిస్తారు. దీన్ని కొత్త ప్రారంభాలకు అశుభప్రదంగా పరిగణిస్తారు’’ అని ఓ సోర్స్ చెప్పినట్లు బాలీవుడ్ హంగామా వెల్లడించింది.
ఈవెంట్ లేకుండానే
ధురంధర్ 2 ట్రైలర్ ను మార్చి 5 లేదా 6న రిలీజ్ చేయనున్నట్లు న్యూస్18 పేర్కొంది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లేకుండా డైరెక్ట్ గా యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారని సమాచారం. ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించాడు. దీనికి ఆదిత్య ధర్ డైరెక్టర్.
ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్
స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర కన్నడ స్టార్ యశ్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా టాక్సిక్ ను ఢీ కొడుతుంది. ఈ రెండు సినిమాలు మార్చి 19నే రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్ కోసం ఈ రెండు సినిమాల టికెట్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ లో టాక్సిక్ పై ధురంధర్ 2 డామినెన్స్ కొనసాగుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


