...
...
Next Story

Yesha Nagula Song: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఏష నాగుల సాంగ్-నాని పిలిచి నేషనల్ అవార్డు వస్తుందన్నారు-ఆట సందీప్ కామెంట్!

Yesha Nagula Song: ది ప్యారడైజ్ సినిమా నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ ‘ఏష నాగుల’ సాంగ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. యూట్యూబ్ ను ఊపేస్తోంది. మాస్ బీట్ తో, తెలంగాణ పదాలతో వచ్చిన సాంగ్ ఆడియన్స్ కు కిక్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో సాంగ్ కు నేషనల్ అవార్డు వస్తుందని ఆట సందీప్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 29, 2026, 21:33:34 IST
Advertisement

Yesha Nagula Song: నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీ హైప్ మరోసారి పీక్స్ కు చేరింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజైంది. ‘ఏష నాగుల’ అంటూ సాగుతున్న ఫోక్ స్టైల్ సాంగ్ ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పాట ఇన్ స్టంట్ హిట్ గా మారింది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

ఏష నాగుల సాంగ్

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఏష నాగుల సాంగ్-నాని పిలిచి నేషనల్ అవార్డు వస్తుందన్నారు-ఆట సందీప్ కామెంట్!
యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఏష నాగుల సాంగ్-నాని పిలిచి నేషనల్ అవార్డు వస్తుందన్నారు-ఆట సందీప్ కామెంట్!

ది ప్యారడైజ్ నుంచి ఇవాళ (ఆగస్టు 29) రిలీజైన ఏష నాగుల సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. 5 గంటల్లోనే ఈ సాంగ్ వీడియోకు 43 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇంటర్నెట్ లో ఈ పాటకు మామూలు క్రేజ్ దక్కడం లేదు. ఎక్కడ విన్నా ఇదే పాట ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది.

నాని, కీర్తి డ్యాన్స్

ఏష నాగుల సాంగ్ కు లిరిక్స్ ఓ ప్లస్ పాయింట్ అయితే మాస్ బీట్, అందుకు తగ్గట్లుగా నాని, కీర్తి సురేష్ వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. మాస్ డ్యాన్స్ తో ఈ జంట అదరగొట్టింది. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కీర్తి, నాని తమ డ్యాన్స్ తో సాంగ్ కు మరింత వైబ్ తీసుకొచ్చింది. అందుకే పాట రిలీజైన వెంటనే వైరల్ గా మారింది.

ఆట సందీప్ కామెంట్లు

ఏష నాగుల పాటకు ఆట సందీప్ మాస్టర్ తన భార్య జ్యోతి రాజ్ తో కలిసి కొరియోగ్రఫీ అందించాడు. ‘సమ్మర్ హాలీడేస్’ సినిమాలోని ఓ సాంగ్ లాంఛ్ సందర్భంగా ఏష నాగుల పాటపై ఆట సందీప్ చేసిన కామెంట్లు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

సాంగ్స్ అదుర్స్

ది ప్యారడైజ్ మూవీ నుంచి వస్తున్న సాంగ్స్ అదరగొడుతున్నాయి. ఇప్పటికే ఆయా షేర్ సాంగ్ 200 మిలియన్ దాటి రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నాడు. ఇందులో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks