YouTuber Anurag Dobhal Accuses Wife Ritika: యూట్యూబ్ ప్రపంచంలో 'UK07 రైడర్'గా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ వ్లాగర్, యూట్యూబర్ అనురాగ్ దొభాల్ కుటుంబ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. తన సొంత కుటుంబం మానసికంగా వేధిస్తోందని గతంలో ఆవేదన వ్యక్తం చేసిన అనురాగ్, ఇప్పుడు నేరుగా తన భార్య రితికా చౌహాన్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు.
గర్భవతిగా ఉన్నప్పుడే నమ్మకద్రోహం!

తన గర్భధారణ సమయంలోనే భార్య రితిక తన బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి నమ్మకద్రోహం చేసిందని ఓ సుదీర్ఘమైన యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించారు అనురాగ్ దోభాల్. అనురాగ్ తన కొత్త వీడియోలో 'అన్నాథ్' (Annath) అనే పాటను విడుదల చేస్తూ, అది తన జీవిత నిజ కథ అని చెప్పారు. రితిక తన బెస్ట్ ఫ్రెండ్‌తో ఉన్న దృశ్యాలను, చాటింగ్ స్క్రీన్‌షాట్లను ఆయన బయటపెట్టారు.
ఆ అబ్బాయి ఇంట్లో 15 రోజులు
"ఆమె నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచింది. గర్భవతిగా ఉన్న సమయంలోనే తన సోదరులు ఎరిక్, రోహిత్‌లతో కలిసి ఆ అబ్బాయి ఇంట్లో 15 రోజులు ఉంది. వాళ్ల అమ్మ కూడా ఆమెను నా నుంచి విడదీయడానికే ప్రోత్సహించింది" అని అనురాగ్ దోభాల్ ఆరోపించారు. అయితే ఆ వ్యక్తి మాత్రం తామిద్దరం కేవలం మంచి స్నేహితులమని సమర్థించుకోవడం ఈ వీడియోలో కనిపించింది.
రూ. 37 లక్షలు ఇచ్చినా బాబును చూడనివ్వట్లేదు!
తన కుమారుడు 'అనూరిత్' కోసం అన్ని అవమానాలను భరించానని, వారి తప్పులను క్షమిస్తూ వచ్చానని అనురాగ్ తెలిపారు. "నా బాబును నన్ను కలవనివ్వకుండా రితిక, ఆమె తల్లి అడ్డుకుంటున్నారు. నా నుంచి భారీగా జీవనభృతి డిమాండ్ చేస్తున్నారు. నా కొడుకును చూసేందుకు ఇప్పటికే రూ. 37 లక్షలు ఇచ్చాను" అని అనురాగ్ కన్నీటిపర్యంతమయ్యారు.
బైక్‌లు, కార్లు అన్నింటినీ అమ్మేసి
తనకున్న బైక్‌లు, కార్లు అన్నింటినీ విక్రయించి నిలువునా ముంచేశారని, ఆర్థికంగా, చట్టపరంగా, మానసికంగా నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు కోసం సంపాదించిన ఆస్తినంతా నా అనుకున్నవాళ్లే అమ్మేశారని అనురాగ్ దోభాల్ పేర్కొన్నారు.
నాటకీయ పరిణామాలు.. ఆత్మహత్యాయత్నం నేపథ్యం
{{/usCountry}}తనకున్న బైక్‌లు, కార్లు అన్నింటినీ విక్రయించి నిలువునా ముంచేశారని, ఆర్థికంగా, చట్టపరంగా, మానసికంగా నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు కోసం సంపాదించిన ఆస్తినంతా నా అనుకున్నవాళ్లే అమ్మేశారని అనురాగ్ దోభాల్ పేర్కొన్నారు.
నాటకీయ పరిణామాలు.. ఆత్మహత్యాయత్నం నేపథ్యం
{{/usCountry}}గతంలో కూడా అనురాగ్ కుటుంబంలో తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. వేరే మతానికి చెందిన రితికను వివాహం చేసుకోవడం అనురాగ్ కుటుంబానికి నచ్చలేదని, దాంతో తన కుటుంబ సభ్యులే తనపై నకిలీ కేసులు పెట్టి వేధించారని ఆయన ఆరోపించారు.
ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో
ఆ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన అనురాగ్, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో 'ఫైనల్ రైడ్' అంటూ కారుతో ప్రమాదానికి గురైన ఘటనా కలకలం రేపింది. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అనురాగ్.
కుమారుడి కోసమే జీవితం
ఇంతటి మానసిక సంఘర్షణ అనుభవించినా, తన కుమారుడి కోసం మళ్లీ సున్నా నుంచి జీవితాన్ని ప్రారంభిస్తానని, కష్టపడి తిరిగి నిలబడతానని యూట్యూబర్ అనురాగ్ దోభాల్ స్పష్టం చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. UK07 రైడర్ ఎవరు?
యూట్యూబ్‌లో బైక్ రైడింగ్, డైలీ వ్లాగ్స్ ద్వారా విశేష ప్రాచుర్యం పొందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అనురాగ్ దొభాల్.
2. అనురాగ్ దొభాల్ తన భార్యపై ఎలాంటి ఆరోపణలు చేశారు?
తన భార్య రితికా చౌహాన్ గర్భవతిగా ఉన్న సమయంలో బెస్ట్ ఫ్రెండ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని, రూ. 37 లక్షలు తీసుకున్నా తన కుమారుడిని చూడనివ్వడం లేదని ఆరోపించారు.
3. అనురాగ్ దొభాల్ భార్య పేరేమిటి?
ఆయన భార్య పేరు రితికా చౌహాన్.
4. అనురాగ్ కొత్త వీడియో పేరేమిటి?
ఆయన తన జీవిత కథ ఆధారంగా 'అన్నాథ్' (Annath) అనే పాటతో కూడిన వ్లాగ్‌ను విడుదల చేశారు.