...
...
Next Story

జాన్వీని నేనేమన్నాను.. మీకు అసలు బ్రెయిన్ ఉందా.. బీజేపీ ఐటీ సెల్ వాళ్లు ఏం చెబితే అది నమ్మేస్తారా: ధృవ్ రాఠీ ఫైర్

జాన్వీ కపూర్‌ను తానేదో అన్నానని కామెంట్స్ చేస్తున్న నెటిజన్లపై మండిపడ్డాడు యూట్యూబర్ ధృవ్ రాఠీ. మీకు అసలు బ్రెయిన్ ఉందా.. బీజేపీ ఐటీ సెల్ వాళ్లు ఏం చెబితే అది వింటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Published on: Dec 28, 2025, 11:40:13 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

జాన్వీ కపూర్ బంగ్లాదేశ్ ఘటనపై స్పందించిన కొద్దిసేపటికే.. ఆమె అందం ఫేక్ అంటూ యూట్యూబర్ ధృవ్ రాఠీ (Dhruv Rathee) వీడియో రిలీజ్ చేశాడన్న వార్తలు నెట్టింట దుమారం రేపాయి. జాన్వీని టార్గెట్ చేశారన్న విమర్శలపై ధృవ్ రాఠీ తాజాగా స్పందిస్తూ.. ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. "నా వీడియోకి, ఆమె పోస్టుకి లింక్ పెడుతున్న వాళ్లు కాస్త బుర్ర వాడాలి" అంటూ లాజిక్‌తో సమాధానం చెప్పాడు.

ధృవ్ రాఠీ ఏమన్నాడంటే?

జాన్వీని నేనేమన్నాను.. మీకు అసలు బ్రెయిన్ ఉందా.. బీజేపీ ఐటీ సెల్ వాళ్లు ఏం చెబితే అది నమ్మేస్తారా: ధృవ్ రాఠీ ఫైర్
జాన్వీని నేనేమన్నాను.. మీకు అసలు బ్రెయిన్ ఉందా.. బీజేపీ ఐటీ సెల్ వాళ్లు ఏం చెబితే అది నమ్మేస్తారా: ధృవ్ రాఠీ ఫైర్

డిసెంబర్ 25న ధృవ్ రాఠీ "ది ఫేక్ బ్యూటీ ఆఫ్ బాలీవుడ్ సెలబ్రిటీస్" పేరుతో ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో జాన్వీ కపూర్, దీపికా పదుకోన్ వంటి తారలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారని చెప్పాడు. అయితే అదే రోజు జాన్వీ కపూర్ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి పోస్ట్ పెట్టడం, ఆ వెంటనే ధృవ్ వీడియో రావడం యాదృచ్ఛికంగా జరిగింది. దీంతో జాన్వీని అవమానించడానికే ధృవ్ ఇలా చేశాడని పుకార్లు వచ్చాయి.

ఈ వివాదంపై ధృవ్ ఒక వీడియో రిలీజ్ చేసి స్పష్టత ఇచ్చాడు. "దేవుడు మీకు బుర్ర ఇచ్చాడు కదా.. దాన్ని ఎందుకు వాడరు? బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ఏది పోస్ట్ చేస్తే అది గుడ్డిగా నమ్మేస్తారా? జాన్వీ కపూర్ పోస్ట్ పెట్టినప్పుడే నేను అరగంట నిడివి ఉన్న వీడియోను నేను అప్లోడ్ చేశా. ప్రాక్టికల్‌గా ఆలోచించండి.. కేవలం అరగంటలో రీసెర్చ్ చేసి, షూట్ చేసి, ఎడిట్ చేసి 30 నిమిషాల వీడియోని ఎవరైనా రిలీజ్ చేయగలరా? అది అసాధ్యం" అని ధృవ్ అన్నాడు.

"నేను భయపడను.."

ట్రోలింగ్ భయంతో థంబ్‌నెయిల్ మార్చారన్న వార్తలను కూడా అతడు కొట్టిపారేశాడు. తన వీడియోలకు మల్టిపుల్ థంబ్‌నెయిల్స్ వాడటం అలవాటని చెప్పాడు.

జాన్వీ కపూర్ పోస్ట్ ఏంటి?

బంగ్లాదేశ్‌లో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని మూకదాడిలో చంపేయడాన్ని జాన్వీ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. "బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది ఆటవిక చర్య. మన పక్కనే మన సోదరసోదరీమణులను సజీవ దహనం చేస్తుంటే.. మనం మాత్రం ప్రపంచం అవతలి వైపు జరిగే విషయాల గురించి ఏడుస్తున్నాం. ఈ హిపోక్రసీ మనల్ని నాశనం చేస్తుంది" అని జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe