...
...
Next Story

Funeral: హిందూ సాంప్రదాయంలో నటి జరీన్ ఖాన్ అంత్యక్రియలు- కొడుకుపై విమర్శలు- అమ్మ స్వేచ్ఛ కోరుకుందంటూ జాయేద్ ఖాన్ వివరణ

Zayed Khan Clarity On Mother Zarine Khan Funeral: గతేడాది మరణించిన తన తల్లి జరీన్ ఖాన్ అంత్యక్రియలపై వస్తున్న విమర్శలకు నటుడు జాయెద్ ఖాన్ స్పందించారు. ముస్లిం కుటుంబంలో కోడలిగా ఉన్నప్పటికీ, ఆమె అస్థికలను నదిలో కలపాలని కోరుకున్నారని, ఆ చివరి కోరికను నెరవేర్చడమే తమకు ముఖ్యమని జాయేద్ ఖాన్ తెలిపారు.

Published on: Mar 30, 2026, 13:52:43 IST
Advertisement

సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చర్చలు జరగడం కొత్తేమీ కాదు. గతేడాది నటుడు జాయెద్ ఖాన్ తల్లి, మాజీ నటి జరీన్ ఖాన్ ముంబైలో కన్నుమూశారు. అయితే, ఆమె అంత్యక్రియలను జాయెద్ ఖాన్ హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.

హిందూ సాంప్రదాయంలో నటి జరీన్ ఖాన్ అంత్యక్రియలు- కొడుకుపై విమర్శలు- అమ్మ స్వేచ్ఛ కోరుకుందంటూ జాయేద్ ఖాన్ వివరణ
హిందూ సాంప్రదాయంలో నటి జరీన్ ఖాన్ అంత్యక్రియలు- కొడుకుపై విమర్శలు- అమ్మ స్వేచ్ఛ కోరుకుందంటూ జాయేద్ ఖాన్ వివరణ

పార్సీ మూలాలు ఉండి, ముస్లిం కుటుంబంలోకి కోడలిగా వచ్చిన ఆమెకు హిందూ పద్ధతిలో వీడ్కోలు పలకడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తాజాగా ఈ విమర్శలపై జాయెద్ ఖాన్ పెదవి విప్పారు.

అమ్మ స్వేచ్ఛను కోరుకుంది!

ఒక ఇంటర్వ్యూలో జాయేద్ ఖాన్ మాట్లాడుతూ తన తల్లి చివరి కోరిక గురించి గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. "ఒకసారి అమ్మ ఒక అందమైన నది ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు.. ఒక ఆలోచన ఆమె మెదడులోకి వచ్చింది. 'నేను ఒకవేళ చనిపోతే, నా అస్థికలు ఈ నదిలో కలిసిపోవాలి.. నేను స్వేచ్ఛగా ఉండాలి' అని జరీన్ ఖాన్ తన మనసులో మాటను బయటపెట్టారు. ఒక బిడ్డగా తల్లి చివరి కోరికను నెరవేర్చడం నా బాధ్యత. మిగతా ప్రపంచం ఏమనుకుంటుంది, ఎంత ద్వేషాన్ని చిమ్ముతుంది అనేది నాకు అనవసరం" అని జాయెద్ స్పష్టం చేశారు.

మా ఇంట్లో మతం కంటే 'మానవత్వానికే' ప్రాధాన్యం

తమ కుటుంబం గురించి ప్రస్తావిస్తూ.. మతం అనేది చాలా వ్యక్తిగతమైన విషయమని జాయెద్ పేర్కొన్నారు. "మా ఇంట్లో 'ఇన్సానియత్' (మానవత్వం) కన్నా గొప్ప మతం ఏదీ లేదు. మేమంతా లౌకికవాదాన్ని నమ్ముతాము. మా దగ్గర పనిచేసే సిబ్బంది కూడా భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చినవారే. మతం అనేది ఒకరు మరొకరి కంటే గొప్ప అని చెప్పుకోవడానికి కాదు. ప్రస్తుత పరిస్థితుల వల్ల కొందరు విమర్శలు చేస్తున్నారు, ఆ పరిస్థితులు మారడానికి సమయం పడుతుంది" అని జాయేద్ ఖాన్ వివరించారు.

జరీన్ ఖాన్ ప్రస్థానం

మరణానికి కొన్ని నెలల ముందే సంజయ్, జరీన్ దంపతులు తమ 59వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం గమనార్హం. మతం కంటే మనిషి కోరికకే విలువనిచ్చిన జాయెద్ ఖాన్ నిర్ణయాన్ని ఇప్పుడు చాలామంది అభినందిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe