OTT Horror: ఓటీటీ ప్రియులకు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) మైండ్ బ్లాకింగ్ ఆఫర్ అనౌన్స్ చేసింది. వెన్నులో వణుకు పుట్టేలా భయపెట్టే మూడు సాలిడ్ తెలుగు హారర్ థ్రిల్లర్స్ ను రూపాయి ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. సౌందర్య 'చంద్రముఖి', కార్తి 'కాష్మోరా'తో పాటు క్లాసిక్ హారర్ డ్రామా 'తులసీదళం' సినిమాలను ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తూ హర్రర్ లవర్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
ధైర్యం ఉంటే చూడండి

ధైర్యం ఉంటే ఈ మూడు సినిమాలు ఒంటరిగా చూడండి అనే క్యాప్షన్ తో జీ5 ఓటీటీ తన ఎక్స్ లో ట్వీట్ చేసింది. వీటిలో దివంగత నటి సౌందర్య ఐకానిక్ పర్ఫార్మెన్స్ తో వచ్చిన 'చంద్రముఖి' (ఆప్తమిత్ర) హారర్ జానర్ లోనే బిగ్గెస్ట్ క్లాసిక్. స్ప్లిట్ పర్సనాలిటీ, దెయ్యం పట్టిన మానసిక పరిస్థితిని సౌందర్య స్క్రీన్ పై పండించిన తీరు ఇప్పటికీ ఆడియన్స్ కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. రాత్రి పూట ఒంటరిగా ఈ సినిమా చూస్తే భయంతో ఒళ్లు గగుర్పాటుకు గురవడం ఖాయం.
ఇక తమిళ హీరో కార్తి నటనతో మెప్పించిన 'కాష్మోరా' ఒక విజువల్, హారర్ ఫీస్ట్. రాజ్ నాయక్ క్యారెక్టర్ లో కార్తి చూపించిన విలనిజం, బ్లాక్ మ్యాజిక్ బ్యాక్ డ్రాప్, ఆత్మల రివేంజ్ డ్రామా ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తాయి. ఇందులో నయనతార, శ్రీదివ్య పర్ఫార్మెన్స్ తో పాటు సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
క్షుద్రపూజలు, చేతబడి కాన్సెప్ట్..
లెజెండరీ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పాపులర్ హారర్ నవల్ ఆధారంగా తెరకెక్కిన 'తులసీదళం' మూవీ టాలీవుడ్ లో ఒక మైలురాయి. చేతబడి, క్షుద్రపూజలు, ఆత్మల ప్రపంచం చుట్టూ తిరిగే ఈ కథ ఆడియన్స్ గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. అప్పట్లోనే కల్ట్ స్టేటస్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పటికీ డిజిటల్ స్పేస్ లో మోస్ట్ డిమాండింగ్ కంటెంట్ గా ఉంది.
ఈ మూడు సినిమాలను చూడటానికి ఎలాంటి జీ5 సబ్స్క్రిప్షన్ ప్లాన్ అవసరం లేదు. 'ఫ్రీ5' (Free5) క్యాంపెయిన్ లో భాగంగా హారర్ ఫ్యాన్స్ కోసం వీటిని ఉచితంగా అందుబాటులోకి తెచ్చినట్లు జీ5 టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
వీకెండ్ హారర్ బింజ్ వాచ్ కోసం బెస్ట్ ఆప్షన్
{{/usCountry}}ఈ మూడు సినిమాలను చూడటానికి ఎలాంటి జీ5 సబ్స్క్రిప్షన్ ప్లాన్ అవసరం లేదు. 'ఫ్రీ5' (Free5) క్యాంపెయిన్ లో భాగంగా హారర్ ఫ్యాన్స్ కోసం వీటిని ఉచితంగా అందుబాటులోకి తెచ్చినట్లు జీ5 టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
వీకెండ్ హారర్ బింజ్ వాచ్ కోసం బెస్ట్ ఆప్షన్
{{/usCountry}}ఓటీటీలో రెగ్యులర్ గా లవ్, యాక్షన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వ్యూవర్స్ కి ఈ హారర్ వాచ్‌లిస్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ తో కలిసి లేదా అర్ధరాత్రి ఒంటరిగా చూస్తూ థ్రిల్ అవ్వడానికి ఈ మూవీస్ పర్ఫెక్ట్ ఛాయిస్.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జీ5 చేసిన పోస్ట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. "ధైర్యం ఉంటేనే ఈ 3 సినిమాలు ఒంటరిగా చూడండి" అంటూ జీ5 ఇచ్చిన ఛాలెంజ్ తో నెటిజన్లు కూడా ఈ సినిమాలను బింజ్ వాచ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఈ మూడు సినిమాలతోపాటు నాగబాబు నటించిన వెబ్ సిరీస్ మేము కాప్‌లం వెబ్ సిరీస్ ను కూడా ఫ్రీగా చూసే వీలు కల్పించిందీ ఓటీటీ ప్లాట్‌ఫామ్.