తెలుగు ఓటీటీల్లో ఇప్పటివరకు ఎక్స్‌పీరియెన్స్ చేయని డిఫరెంట్ పాయింట్‌తో వస్తున్నాం: జీ5 సాయి తేజ దేశరాజ్ కామెంట్స్
డిఫరెంట్ కంటెంట్‌తో దూసుకుపోతున్న జీ5 ఓటీటీ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ముందుకు రానుంది. వరుణ్ సందేశ్ హీరోగా ప్రియాంక జైన్ హీరోయిన్‌గా చేసిన లేటెస్ట్ ఓటీటీ సైకో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నయనం. ఇటీవల జరిగిన నయనం ట్రైలర్ లాంచ్‌లో జీ5 ఓటీటీ వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ దేశరాజ్ కామెంట్స్ చేశారు.
ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో మెప్పిస్తూ ఇండియాలో అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఒకటిగా నిలుస్తోంది జీ5 సంస్థ. మరోసారి తనదైన శైలిలో డిఫరెంట్ తెలుగు ఒరిజినల్ ఓటీటీ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది జీ5.

నయనం ఓటీటీ స్ట్రీమింగ్
ఆ ఓటీటీ సిరీసే ‘నయనం’. వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌లో అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 19 నుంచి జీ5లో నయనం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
నయనం ట్రైలర్ లాంచ్
స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించిన సైకో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నయనం ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జీ5 ఓటీటీ తెలుగు కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ దేశరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మంచి కంటెంట్‌తోపాటు
సాయి తేజ దేశరాజ్ మాట్లాడుతూ.. "ఎప్పుడూ మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తూనే ఉన్నాం. ఈసారి మంచి కంటెంట్‌తో పాటు యూనిక్ కంటెంట్‌తోనూ వస్తున్నాం. తెలుగు ఓటీటీల్లో ఇప్పటి వరకు ఎక్స్‌పీరియెన్స్ చేయని డిఫరెంట్ పాయింట్‌తో వస్తున్నాం. 2025 ఎండింగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది" అని అన్నారు.
2026 కూడా మంచి లైనప్
"పది రోజుల గ్యాప్‌తో జీ5 ఓటీటీలో రెండు బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. ఒకటేమో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఇంకోటి నయనం. 2026 కూడా మంచి లైనప్ ఉంది. ఏడాది క్రితం స్వాతిగారు చెప్పిన కథ వినగానే కొత్తగా అనిపించింది. ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ లాస్ట్ ఇయర్ మాకు వికటకవి ఇచ్చారు. ఇప్పుడు నయనం ఇస్తున్నారు" అని సాయి తేజ దేశరాజ్ తెలిపారు.
అందరికీ కనెక్ట్ అవుతుంది
"ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ మంచి కంటెంట్‌ను అందించాడు. డైరెక్టర్ స్వాతి గారు చాలా స్ట్రిక్ట్ పర్సన్. సాధిక గారు ఫస్ట్ డే నుంచి ఎంతో కష్టపడ్డారు. ప్రతీ ఒక్కరూ బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వటానికి ప్రయత్నించారు. వరుణ్ సందేశ్‌తో కలిసి పని చేయటం ఎంతో ఆనందంగా ఉంది. పోలీస్ క్యారెక్టర్‌లో అలీ రెజా గారు సూపర్బ్‌గా నటించారు. తన పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది" అని జీ5 ఓటీటీ తెలుగు కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ దేశరాజ్ పేర్కొన్నారు.
బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది
జీ5, జీ తెలుగు ఓఏపీ కమీషనింగ్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ మాట్లాడుతూ.. "ఓటీటీ సక్సెస్‌ఫుల్ జర్నీలో జీ5 ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది. స్వాతి స్టోరీ నెరేట్ చేయగానే ఫస్ట్ టైమే అందరికీ నచ్చింది. క్వాలిటీ ప్రాజెక్ట్ వచ్చింది. డిసెంబర్ 19న స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ వచ్చే ఏడాది కూడా మంచి నెంబర్స్ క్రియేట్ చేస్తామని భావిస్తున్నాను" అని అన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


