డబుల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీని షేక్ చేస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఆడియన్స్ కు థ్రిల్ అందిస్తోంది. అదే నేరుగా ఓటీటీలోకి వచ్చిన ‘సాలి మొహబ్బత్’ చిత్రం. జీ5లో ఇది ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. మరి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో టాప్-5లో ఉన్నవాటిపై ఓ లుక్కేయండి.
సాలి మొహబ్బత్ ఓటీటీ

ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు జీ5 ఓటీటీలోని సాలి మొహబ్బత్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ అందుకు నిదర్శనం. ఈ డబుల్ మిస్టరీ థ్రిల్లర్ డైరెక్ట్ గా జీ5 ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఇండియాలోనే నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది ఈ హిందీ సినిమా. ఇందులో రాధికా ఆప్టే, దివ్యేందు, అనురాగ్ కశ్యప్, అన్షుమాన్ పుష్కర్ తదితరులు నటించారు.
ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో
జీ5 ఓటీటీలో తెలుగు కామెడీ మూవీ ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ కూడా వ్యూస్లో దూసుకెళ్తోంది. ఈ కామెడీ మూవీ ఆడియన్స్ ను నవ్విస్తోంది. ఈ సినిమాలో తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని తదితరులు నటించారు. పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట ప్రి వెడ్డింగ్ షూట్ చేసుకుంటుంది. కానీ ఆ ఫొటోగ్రాఫర్ దగ్గర పని చేసే కుర్రాడు ఆ ఫుటేజీ ఉన్న మెమొరీ కార్డు పోగడతాడు. మరి ఆ తర్వాత ఆ ఫొటోగ్రాఫర్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడన్నది ఫన్నీగా ఉంటుంది.
ది బెంగాల్ ఫైల్స్
ఓటీటీలో సత్తాచాటుతున్న మరో థ్రిల్లర్ బెంగాల్ ఫైల్స్. ఇది జీ5 ఓటీటీ ట్రెండింగ్ లో మూడో స్థానంలో ఉంది. ఈ సినిమాతో బెంగాల్ విభజన సమయంలో హిందువుల ఊచకోత, చెలరేగిన హింసను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి డైరెక్టర్. ఇందులో దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, సిమ్రత్ కౌర్, అనుప్ ఖేర్ తదితరులు నటించారు.
దశావతార్
{{/usCountry}}ఓటీటీలో సత్తాచాటుతున్న మరో థ్రిల్లర్ బెంగాల్ ఫైల్స్. ఇది జీ5 ఓటీటీ ట్రెండింగ్ లో మూడో స్థానంలో ఉంది. ఈ సినిమాతో బెంగాల్ విభజన సమయంలో హిందువుల ఊచకోత, చెలరేగిన హింసను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి డైరెక్టర్. ఇందులో దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, సిమ్రత్ కౌర్, అనుప్ ఖేర్ తదితరులు నటించారు.
దశావతార్
{{/usCountry}}జీ5 ఓటీటీలో ట్రెండింగ్ నాలుగో ప్లేస్ లో ఉన్న సినిమా దశావతార్. ఈ మూవీ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మరాఠీ సినిమా చూసే ఆడియన్స్ కు గొప్ప థ్రిల్ పంచుతుంది. విష్ణు దశావతారాల స్ఫూర్తితో ఓ నాటకరంగ నటుడి జీవితాన్ని తెరకెక్కించారు. దీనికి సుభోద్ డైరెక్టర్. ఈ మూవీలో దిలీప్, మహేష్ మంజ్రేకర్, ప్రియదర్శిని, భరత్ జాదవ్ తదితరులు నటించారు.
ది పెట్ డిటెక్టివ్
అనుపమ పరమేశ్వరన్, షరఫుద్దీన్ జంటగా నటించిన మలయాళ డిటెక్టివ్ థ్రిల్లర్ ది పెట్ డిటెక్టివ్. ఇది జీ5 ఓటీటీలో ట్రెండింగ్ లో 5వ స్థానంలో ఉంది. ఇందులో హీరో ఓ ప్రైవేట్ డిటెక్టివ్. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం తప్పిపోయిన కుక్క కేసును దర్యాప్తు చేస్తుంటాడు. అది కాస్త అండర్ వరల్డ్ మాఫియా గుట్టును బయటకు లాగుతుంది.