...
...
Next Story

Zee5 OTT: ఓటీటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాస్ట్.. 7 భాషల్లో జీ5 కొత్త ధమాకా.. తెలుగు ఫ్యాన్స్‌కి పండగే పండగ

Zee5 OTT: జీ5 ఓటీటీ తన ప్లాట్‌ఫామ్ లోకి రాబోయే సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ రిలీజ్ చేసింది. బాలయ్య బాబు ఎన్‌బీకే 111 మూవీతోపాటు వెంకీ, అనిల్ రావిపూడి ఐదో సినిమా, అబ్జెక్షన్ మై లార్డ్ అనే వెబ్ సిరీస్ లాంటివి ఎన్నో ఉన్నాయి.

Published on: Jul 29, 2026, 15:16:07 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Zee5 OTT: ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5 ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీలింగ్వల్ కంటెంట్ స్లేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అగ్ర నటీనటులు నటించిన భారీ వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, రియాలిటీ షోలు, కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జీ5 మైండ్ బ్లాకింగ్ లైనప్‌ను ఆవిష్కరించింది. ఓటీటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ భారతీయ సంస్కృతికి అద్దం పట్టే కథలతో ముందుకెళ్తున్నట్లు జీ5 స్పష్టం చేసింది.

నివేదా థామస్ 'శ్రీమతి'.. శ్రీకాంత్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’

Zee5 OTT: ఓటీటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాస్ట్.. 7 భాషల్లో జీ5 కొత్త ధమాకా.. తెలుగు ఫ్యాన్స్‌కి పండగే పండగ
Zee5 OTT: ఓటీటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాస్ట్.. 7 భాషల్లో జీ5 కొత్త ధమాకా.. తెలుగు ఫ్యాన్స్‌కి పండగే పండగ

ఈ కొత్త కంటెంట్ స్లేట్‌లో జీ5 తెలుగు ఓటీటీ చాలా పెద్ద ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టింది. రీసెంట్‌గా '35 చిన్న కథ కాదు' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా థామస్ మెయిన్ లీడ్‌గా 'శ్రీమతి' అనే ఒరిజినల్ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఉమెన్ సెంట్రిక్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సిరీస్ జీ5లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది.

మరోవైపు వర్సటైల్ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో 'అబ్జెక్షన్ మై లార్డ్' అనే హై-వోల్టేజ్ కోర్ట్‌రూమ్ డ్రామా రాబోతోంది. సీనియర్ హీరోలు ఓటీటీలో డిఫరెంట్ రోల్స్ చేస్తుండటంతో ఈ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌పై డిజిటల్ ఆడియన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.

టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా' సీజన్ 2 సిద్ధం

బుల్లి తెర, ఓటీటీ వర్గాల్లో సూపర్ సక్సెస్ అయిన ప్రాఫిటబుల్ టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా' కొత్త సీజన్‌ను త్వరలోనే గ్రాండ్‌గా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, ఇప్పటి వరకూ చూడని ఫన్ ఎలిమెంట్స్‌తో ఈ షోను సరికొత్తగా డిజైన్ చేసినట్లు మేకర్స్ తెలిపారు.

వెంకీ అనిల్ 5, ఎన్బీకే 111, వృషకర్మ డిజిటల్ హక్కులు సొంతం

నందమూరి నటసింహం బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మాస్ ప్రాజెక్ట్ NBK111తో పాటు.. నాగ చైతన్య - కార్తీక్ దండు కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ' (Vrushakarma) సినిమాలు కూడా థియేట్రికల్ రన్ తర్వాత జీ5లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి.

ఏఐ టెక్నాలజీ, పర్సనలైజ్డ్ ఎక్స్‌పీరియన్స్..

ఇండియాలో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపురేఖలను మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని జీ5 ఇండియా బిజినెస్ హెడ్ తేజ్‌కరన్ సింగ్ బజాజ్ వెల్లడించారు. కథాబలమున్న కంటెంట్‌తో పాటు ఏఐ-పవర్డ్ (AI-powered) స్టోరీటెల్లింగ్, స్మార్ట్ టెక్నాలజీ, పర్సనలైజ్డ్ ప్రొడక్ట్ ఎక్స్‌పీరియన్స్‌పై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రతి సినిమా, వెబ్ సిరీస్‌ను ఒక స్పష్టమైన విజన్‌తో ఎంచుకున్నామని జీ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ రాఘవేంద్ర హున్సూర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్‌కు అత్యుత్తమ డిజిటల్ అనుభూతిని ఇవ్వడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe