వాయు కాలుష్యం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. దాదాపు ప్రతీ రాష్ట్రంలో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది మంచి ఎయిర్ ప్యూరిఫయర్ కోసం వెతుకుతున్నారు. వీరికి మార్కెట్లో చాలా ఆప్షన్లు లభిస్తుండటంతో ఏది కొనాలి? అనేది సమస్యగా మారింది. మరి మీరు కూడా మీ ఇంటి కోసం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం మంచి ఎయిర్ ప్యూరిఫయర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో ప్రస్తుతం లభిస్తున్న టాప్-5 ఎయిర్ ప్యూరిఫయర్ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
అధునాతన పర్యవేక్షణతో బూన్ ఎయిర్‌వానా-

భారత్‌లోనే రూపొందించి అభివృద్ధి చేసిన బూన్ ఎయిర్‌వానా (Boon Airvana), ఇంటికి ఎయిర్ ప్యూరిఫయర్‌గా, గాలి నాణ్యత మానిటరింగ్ స్టేషన్‌గా రెండు విధాలుగా పనిచేస్తుంది. బూన్ ల్యాబ్స్ రెండేళ్ల పాటు శ్రమించి తీర్చిదిద్దిన అట్మోస్కాన్ సెన్సింగ్ టెక్నాలజీ ఇందులో ప్రధాన ఆకర్షణ. పీఎం1.0, పీఎం2.5, పీఎం10, టీవీఓసీలు, నైట్రోజన్ డయాక్సైడ్, ఈసీఓ2, ఉష్ణోగ్రత, తేమ వంటి ఎనిమిది అంశాల్లో ప్రతి సెకనుకు ఎనిమిది రీడింగ్‌లు ఇది తీసుకుంటుంది. ఈ విభాగంలో అత్యధిక సెన్సర్లు, అత్యంత కచ్చితమైన రీడింగ్‌లు ఇందులోనే ఉన్నాయి. రీడింగ్‌లలో మార్పులకు అనుగుణంగా ఎయిర్‌వానా తన పనితీరును వాటంతట అదే సర్దుబాటు చేసుకుంటుంది.
మూసిన గదిలో గంటల తరబడి ఉన్నప్పుడు మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ క్రమంగా పెరుగుతుంది. దీనివల్ల మగత, తలనొప్పి, సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి. గాలిలోని కణాలను ప్యూరిఫయర్ వడకట్టగలిగినా, సీఓ2ను తొలగించలేదు. ఎయిర్‌వానా మాత్రం ఈసీఓ2 స్థాయిలను గమనించి, కిటికీ తెరిచి తాజా గాలి రానివ్వాల్సిన సమయం వచ్చిందని హెచ్చరిస్తుంది.
ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున రెండు హెచ్13 హెపా ఫిల్టర్లు ఉండటం వల్ల సాధారణ సింగిల్-ఫిల్టర్ డిజైన్ కంటే ఎక్కువ ఫిల్ట్రేషన్ వైశాల్యం లభిస్తుంది. దీనివల్ల 484 చదరపు అడుగుల వరకు ఉన్న గదులను త్వరగా శుభ్రం చేస్తుంది. సాధారణ ఫిల్టర్ల కంటే వీటి మన్నిక రెట్టింపు వరకు ఉంటుంది. బూన్ యాప్‌తో అనుసంధానమై ఇంటి గాలి నాణ్యతకు ఒకే బూన్ స్కోర్ ఇస్తుంది, కాలక్రమేణా మార్పులను ట్రాక్ చేస్తుంది, అలర్ట్‌లు పంపుతుంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్‌తోనూ ఇది పనిచేస్తుంది.
బడ్జెట్, స్మార్ట్ అవసరాలకు తగిన మోడళ్లు..
రోజువారీ వినియోగానికి తక్కువ ధరలో ఎయిర్ ప్యూరిఫయర్ కోరుకునే కుటుంబాలకు యురేకా ఫోర్బ్స్ ఏరోగార్డ్ ఏపీ 400జీ ఒక ఎంపిక. వాషబుల్ ప్రీ-ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్ట్రేషన్, హెచ్13 హెపా ఫిల్టర్ కలయికతో దుమ్ము, గాలిలోని కణాలు, సాధారణ అలెర్జీ కారకాలను ఇది పట్టుకుంటుంది. 400 చదరపు అడుగుల వరకు గదులకు సరిపోతుంది. 360 డిగ్రీల ఎయిర్ ఇన్‌టేక్, డిజిటల్ పీఎం2.5 డిస్ప్లే, ఆటోమేటిక్ ఆపరేషన్, అరోమా డిఫ్యూజర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
{{/usCountry}}రోజువారీ వినియోగానికి తక్కువ ధరలో ఎయిర్ ప్యూరిఫయర్ కోరుకునే కుటుంబాలకు యురేకా ఫోర్బ్స్ ఏరోగార్డ్ ఏపీ 400జీ ఒక ఎంపిక. వాషబుల్ ప్రీ-ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్ట్రేషన్, హెచ్13 హెపా ఫిల్టర్ కలయికతో దుమ్ము, గాలిలోని కణాలు, సాధారణ అలెర్జీ కారకాలను ఇది పట్టుకుంటుంది. 400 చదరపు అడుగుల వరకు గదులకు సరిపోతుంది. 360 డిగ్రీల ఎయిర్ ఇన్‌టేక్, డిజిటల్ పీఎం2.5 డిస్ప్లే, ఆటోమేటిక్ ఆపరేషన్, అరోమా డిఫ్యూజర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
{{/usCountry}}కనెక్టెడ్ హోమ్ సౌలభ్యం కోరుకునే వారి కోసం షావోమీ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్ 4 లైట్ రూపొందించారు. గంటకు 360 ఘనపు మీటర్ల సీఏడీఆర్ సామర్థ్యంతో 462 చదరపు అడుగుల వరకు ఉన్న బెడ్‌రూమ్‌లు, లివింగ్ స్పేస్‌లకు ఇది సరిపోతుంది. మల్టీ-లేయర్ ఫిల్ట్రేషన్ వ్యవస్థ గాలిలోని కణాలను వడకడుతుంది. షావోమీ హోమ్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చు; వాయిస్ అసిస్టెంట్‌లకు కూడా మద్దతు ఇస్తుంది.
రోజువారీ, మల్టీ-స్టేజ్ ఫిల్ట్రేషన్ కోసం ఫిలిప్స్, హనీవెల్..
సాధారణ రోజువారీ అవసరాలకు ఫిలిప్స్ 1000 సిరీస్ ఏసీ1711 సరళమైన పరిష్కారం అందిస్తుంది. ప్రీ-ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్, హెపా నానోప్రొటెక్ట్ టెక్నాలజీతో కూడిన త్రీ-లేయర్ ఫిల్ట్రేషన్ వ్యవస్థ దుమ్ము, ఇతర కణాలను తొలగిస్తుంది. గంటకు 300 ఘనపు మీటర్ల సీఏడీఆర్‌తో 390 చదరపు అడుగుల వరకు గదులకు సరిపోతుంది; ఆటోమేటిక్ సెన్సింగ్, నిశ్శబ్దంగా పనిచేసే స్లీప్ మోడ్ కూడా ఉన్నాయి.
సాధారణ ఫిల్ట్రేషన్ కోరుకునే వారికి హనీవెల్ ఎయిర్ టచ్ వీ5 మరో ఆప్షన్. సూక్ష్మ కణాలు, దుమ్ము, ఇతర కాలుష్య కారకాలను ఎదుర్కొనేలా దీన్ని రూపొందించారు. వై-ఫై కనెక్టివిటీ, యాప్ నియంత్రణలు, ఎయిర్-క్వాలిటీ ఇండికేటర్ ఉండటంతో రోజువారీ వాడకానికి అనుకూలంగా ఉంటుంది.
టాప్- 5 ఎయిర్ ప్యూరిఫయర్స్.. ఏది కొనాలి?
ఈ జాబితాలో అధునాతన ఫిల్ట్రేషన్, సమగ్ర గాలి నాణ్యత పర్యవేక్షణ కలయికతో బూన్ ఎయిర్‌వానా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్ ప్రత్యేకంగా నిలుస్తోంది. డ్యూయల్ హెచ్13 హెపా ఫిల్టర్లు, అట్మోస్కాన్ టెక్నాలజీ, ఎనిమిది పారామీటర్లను గమనించే సామర్థ్యం ఇంటి వాతావరణంపై స్పష్టత ఇస్తాయి. సాధారణ వడపోతకు మించి తెలివైన సమాచారం కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. చివరిగా ఏ మోడల్ తీసుకోవాలనేది గది పరిమాణం, ఫిల్ట్రేషన్ అవసరం, బడ్జెట్, దీర్ఘకాల నిర్వహణ ఖర్చులపై ఆధారపడి ఉంటుంది.
ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.