సూర్యుడు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. బయటకు వెళ్లాలంటే.. వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రోజురోజుకీ వేడి పెరుగుతుండటంతో ఉదయం 9 గంటలకే సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అయితే చాలా మంది ఆఫీసులకు వెళ్లేవారి, అత్యవసర పనుల మీద బయటకు వెళ్లేవారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక గిగ్‌వర్కర్ల పరిస్థితి దారుణం. బస్సుల్లో వెళ్లినా ఎండకు తట్టుకోలేకపోతున్నాం. ఇక ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మండుటెండలో బైక్ నడుపుతూ.. ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకోవడం చెప్పలేని బాధ.

ఇంతటి తీవ్రమైన వేడిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. డీహైడ్రేషన్, తీవ్రమైన అలసట, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అందువల్ల ఎండలో బైక్ నడుపుతున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి.
అన్నిటికంటే ముందు శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడం ఉత్తమం. బైక్ నడుపుతున్నప్పుడు పొట్టి చేతుల చొక్కాలకు బదులుగా ఫుల్ హ్యాండ్స్ ఉన్నా చొక్కాలు, కాటన్ దుస్తులు ధరించడం వల్ల చర్మాన్ని సూర్యకిరణాల నుండి రక్షించుకోవచ్చు. దీనివల్ల మీ చేతులు నల్లబడకుండా ఉంటాయి. మీ శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది.
హెల్మెట్ ధరించినప్పుడు చెమట మీ జుట్టుకు, ముఖానికి హాని కలిగించవచ్చు. దీనిని నివారించడానికి మీ తల చుట్టూ ఒక పలుచని స్కార్ఫ్ లేదా చేతి రుమాలు కట్టుకుని, దానిపై హెల్మెట్ ధరించడం వల్ల అది చెమటను పీల్చుకుని, మీ ముఖాన్ని, మెడను చల్లబరుస్తుంది. జుట్టు కూడా పాడు అవ్వదు.
ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు శరీరం డీహైడ్రేట్ అవ్వడం సాధారణం. మీతో ఎల్లప్పుడూ ఒక నీటి సీసాను తీసుకెళ్లడం మంచిది. ప్రయాణ సమయంలో క్రమం తప్పకుండా నీరు తాగడం మిమ్మల్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. అదేవిధంగా ఖాళీ కడుపుతో ఎండలో బైక్ నడపడం మానుకోవాలి. తేలికపాటి భోజనం చేయడం అలసట, నీరసాన్ని నివారిస్తుంది. ఖాళీ కడుపుతో ప్రయాణించడం వల్ల ఎండ ప్రభావం పెరిగి, తల తిరగడం లేదా వడదెబ్బ తగలవచ్చు.
హెల్మెట్ తలను రక్షించినప్పటికీ.. కళ్ళను కాపాడుకోవడానికి నాణ్యమైన సన్ గ్లాసెస్ పెట్టుకోవడం ముఖ్యం. యూవీ కిరణాలను నిరోధించే కళ్ళద్దాలను ఉపయోగించడం వల్ల కళ్ళు చల్లబడతాయి, ప్రత్యక్ష సూర్యరశ్మి నుండి రక్షణ దొరుకుతుంది. మీరు ఎక్కువసేపు ట్రాఫిక్‌లో ఉండాల్సి వస్తే బైక్ ఇంజిన్‌ను ఆపివేయడం మంచిది. దీనివల్ల వాహనం నుండి వెలువడే వేడి తగ్గుతుంది.
{{/usCountry}}హెల్మెట్ తలను రక్షించినప్పటికీ.. కళ్ళను కాపాడుకోవడానికి నాణ్యమైన సన్ గ్లాసెస్ పెట్టుకోవడం ముఖ్యం. యూవీ కిరణాలను నిరోధించే కళ్ళద్దాలను ఉపయోగించడం వల్ల కళ్ళు చల్లబడతాయి, ప్రత్యక్ష సూర్యరశ్మి నుండి రక్షణ దొరుకుతుంది. మీరు ఎక్కువసేపు ట్రాఫిక్‌లో ఉండాల్సి వస్తే బైక్ ఇంజిన్‌ను ఆపివేయడం మంచిది. దీనివల్ల వాహనం నుండి వెలువడే వేడి తగ్గుతుంది.
{{/usCountry}}ఎక్కువ ప్రయాణాలు చేసేవారు తమ బైక్‌లను నిరంతరాయంగా నడపకూడదు. చెట్ల నీడలో లేదా ఏకాంత ప్రదేశాలలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. ఎక్కువ సేపు ఎండలో నిరంతరాయంగా ప్రయాణించడం శరీరానికి మంచిది కాదు. బయటకు వెళ్లే ముందు చర్మానికి సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల ఎండదెబ్బ నుండి రక్షణ లభిస్తుంది. చర్మ క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది.
ప్రయాణిస్తున్నప్పుడు మీకు తలనొప్పి, వాంతులు, అధికంగా చెమట పట్టడం లేదా కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వాహనాన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి. ఇవి వడదెబ్బ ప్రారంభ సంకేతాలు అని గుర్తుంచుకోండి. నిర్లక్ష్యం చేయవద్దు, అనవసరంగా ఎండకు గురికాకుండా ఉండాలి. వేసవిలో బైక్ మీద వెళ్లేటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమదం కావొచ్చు.