Electric bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ తొలి ఎలక్ట్రిక్​ బైక్​ కొనాలా? ఇవి తెలుసుకోండి..

Royal Enfield Flying Flea C6 : సిటీ రైడింగ్‌కు అనుగుణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6' ఎలక్ట్రిక్​ బైక్​ అందుబాటులోకి వచ్చింది. దీని బరువు కేవలం 124 కేజీలు మాత్రమే. మీరు ఈ ఈ-బైక్​ కొనాలని ప్లాన్​ చేస్తుంటే, మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ చూసేయండి..

Published on: Apr 12, 2026, 12:20:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Royal Enfield electric bike : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ప్రయాణం మొదలైంది. పట్టణ ప్రాంత వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన రాయల్​ ఎన్​ఫీల్డ్​ తొలి ఎలక్ట్రిక్​ బైక్ 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6' ఇటీవలే లాంచ్​ అయ్యింది. మీరు ఈ ఈ-బైక్​ని కొనాలని ప్లాన్​ చేస్తుంటే.. రెట్రో డిజైన్, ఆధునిక ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన ఈ ఫ్లయింగ్​ ఫ్లీ సీ6కి సంబంధించిన 5 కీలక విషయాలను ఇక్కడ చూసేయండి..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఫ్లయింగ్​ ఫ్లీ సీ6
రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఫ్లయింగ్​ ఫ్లీ సీ6

రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఫ్లయింగ్​ ఫ్లీ సీ6- ధర, బ్యాటర్​ సబ్​స్క్రిప్షన్..

ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.79 లక్షలుగా నిర్ణయించారు. అయితే, కంపెనీ ప్రవేశపెట్టిన 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) మోడల్ కింద దీనిని కేవలం రూ. 1.99 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. ఏప్రిల్ 10 నుంచి బుకింగ్స్ ప్రారంభం కాగా, మే 2026 చివరి నాటికి డెలివరీలు మొదలవుతాయి.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఫ్లయింగ్​ ఫ్లీ సీ6- లైట్​ వెయిట్​ బైక్..

ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ అల్యూమినియం ఫ్రేమ్‌తో తయారైంది. దీని బరువు కేవలం 124 కేజీలు మాత్రమే. రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలోనే ఇది అత్యంత తేలికైన మోటార్‌సైకిల్ కావడం విశేషం. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో బైక్‌ను హ్యాండిల్ చేయడం చాలా సులభమవుతుంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఫ్లయింగ్​ ఫ్లీ సీ6- పవర్, పర్ఫార్మెన్స్..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఫ్లయింగ్​ ఫ్లీ సీ6లో అమర్చిన పీఎంస్ మోటార్ 20.6 బీహెచ్​పీ పవర్, 60 ఎన్​ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

వేగం: కేవలం 3.7 సెకన్లలోనే 0 నుంచి 60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కిమీ.

రేంజ్: 3.91 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా ఒకసారి ఛార్జ్ చేస్తే 154 కిమీ (ఐడీసీ రేంజ్) ప్రయాణించవచ్చు. రోజువారీ ఆఫీస్ అవసరాలకు ఇది సరిగ్గా సరిపోతుంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఫ్లయింగ్​ ఫ్లీ సీ6- ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం..

ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ల అవసరం లేకుండానే ఇంట్లో ఉండే సాధారణ సాకెట్ల ద్వారా ఈ ఎలక్ట్రిక్​ బైక్​ని ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 65 నిమిషాల్లోనే బ్యాటరీని 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఫ్లయింగ్​ ఫ్లీ సీ6- అధునాతన ఫీచర్లు..

టెక్నాలజీ పరంగా కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ ముందుంది. ఇందులో 3.5 ఇంచ్ రౌండ్ టీఎఫ్​టీ టచ్‌స్క్రీన్ ఉంది. దీనికి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నేవిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అలాగే సిటీ, రెయిన్, హైవే, స్పోర్ట్, కస్టమ్ అనే 5 రైడింగ్ మోడ్స్ ఇందులో ఇచ్చారు. భద్రత కోసం లీన్-సెన్సిటివ్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థలను అమర్చారు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 బ్యాటరీ రేంజ్ ఎంత?

ఈ బైక్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 154 కిలోమీటర్ల (ఐడీసీ క్లెయిమ్డ్) రేంజ్‌ను ఇస్తుంది.

2. బీఏఏఎస్ మోడల్ అంటే ఏంటి?

బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ (బీఏఏఎస్) అంటే బైక్ కొనేటప్పుడు బ్యాటరీ ధరను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల బైక్ కొనుగోలు ధర తగ్గుతుంది. బ్యాటరీ వినియోగానికి గాను ప్రతి నెల నిర్ణీత అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

3. ఈ బైక్ బరువు ఎంత?

ఇది కేవలం 124 కేజీల బరువు మాత్రమే ఉంటుంది. సాధారణ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లతో పోలిస్తే ఇది చాలా తేలికైనది.

4. ఛార్జింగ్ కు ఎంత సమయం పడుతుంది?

కంపెనీ అందించిన ఆన్‌బోర్డ్ ఛార్జర్ ద్వారా 20-80 శాతం ఛార్జింగ్ అవ్వడానికి సుమారు 65 నిమిషాల సమయం పడుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More