బెంగళూరులోని త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఆహార నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) విభాగానికి చెందిన అధికారులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 30 బృందాలుగా ఏర్పడి నగరవ్యాప్తంగా 26 ప్రముఖ హోటళ్లపై మెరుపు దాడులు నిర్వహించగా, దాదాపు 132 కిలోల కుళ్లిపోయిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి.
యూబీ సిటీ కిచెన్ సీజ్..

ఈ తనిఖీల్లో ప్రధానంగా యూబీ సిటీలోని 16వ అంతస్తులో ఉన్న 'స్కై లాంజ్' (Skyee Lounge) అక్రమాలు వెలుగుచూశాయి. అక్కడ నిల్వ ఉంచిన మాంసానికి ఫంగస్ పట్టి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో అధికారులు ఆ కిచెన్‌ను తక్షణమే మూసివేశారు. పది రోజుల క్రితమే గడువు ముగిసిన పాలు, పెరుగును కూడా వంటల్లో వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అలాగే యూబీ సిటీలోని 'హోటల్ స్కై' నుంచి 45 కిలోల కుళ్లిన చికెన్/బీఫ్, 6 కిలోల వెజ్ కట్లెట్లు, 15 లీటర్ల వాడేసిన వంటనూనెను స్వాధీనం చేసుకుని పడేశారు. 'రాయల్ చైన్ హోటల్' నుంచి 50 కిలోల బాతు మాంసం, 5 కిలోల చేపలను జప్తు చేశారు. 'మద్రాస్ కిచెన్', 'టెస్కాన్ హోటల్', 'సాంచెజ్ హోటల్' ల నుంచి కూడా కిలోల కొద్దీ నాసిరకం పచ్చి బఠానీలు, పుట్టగొడుగులు, చేపలు, టకోస్, కేకులను స్వాధీనం చేసుకున్నారు.
35 రకాల శాంపిల్స్ ల్యాబ్‌కు.. కఠిన చర్యలు తథ్యం
తనిఖీల సందర్భంగా అధికారులు హోటళ్ల నుంచి 35 రకాల ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. టీ పొడి, చికెన్, మటన్, చేపలు, మసాలా దినుసులు, పాలు, టమాటో సాస్ వంటి పదార్థాలు ఇందులో ఉన్నాయి. FSSAI లేబులింగ్ నిబంధనలను పాటించకపోవడం, ఎక్స్‌పైరీ పూర్తయిన పదార్థాలను వాడటం, శాకాహార-మాంసాహారాలను ఒకే చోట కలిపి నిల్వ చేయడం వంటి అనేక ఉల్లంఘనలను అధికారులు ఎత్తిచూపారు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 కింద సంబంధిత హోటళ్ల నిర్వాహకులకు (FBOs) నోటీసులు జారీ చేశామని, విచారణాధికారి ముందు న్యాయపరమైన చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.
ప్రజల ఫిర్యాదులతో కదిలిన యంత్రాంగం
{{/usCountry}}ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 కింద సంబంధిత హోటళ్ల నిర్వాహకులకు (FBOs) నోటీసులు జారీ చేశామని, విచారణాధికారి ముందు న్యాయపరమైన చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.
ప్రజల ఫిర్యాదులతో కదిలిన యంత్రాంగం
{{/usCountry}}సామాజిక మాధ్యమాల్లో హోటళ్ల అపరిశుభ్రతపై, నాసిరకం ఆహారంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గోబీ మంచూరియా, కబాబ్‌లలో హానికరమైన కృత్రిమ రంగులు వాడుతున్నారనే అంశంపై భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి. ఖాదర్ ఆదేశాల మేరకు ఈ విస్తృత తనిఖీలు చేపట్టారు. గతేడాది కూడా 'ఆపరేషన్ ఈట్ రైట్' పేరిట ఇటువంటి దాడులే నిర్వహించి పలు హోటళ్లకు జరిమానాలు విధించారు.