బిగుతుగా ఉండే దుస్తులు, సరైన సైజు లేని బ్రాలు ధరిస్తే రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) బారిన పడే ప్రమాదం ఉందనే వార్తలు తరచూ సోషల్ మీడియా వేదికలపై చక్కర్లు కొడుతుంటాయి. రోజంతా బిగుతైన బ్రా వేసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి క్యాన్సర్‌కు దారితీస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని వైద్య నిపుణులు తేల్చి చెప్తున్నారు.
సైంటిఫిక్ ఆధారాలు లేవు

ముంబైలోని ఎంఓసీ క్యాన్సర్ కేర్ వైద్యురాలు డాక్టర్ సీమా జగ్యాసీ ప్రకారం, బిగుతైన బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. "లింఫాటిక్ వ్యవస్థ అనేది బ్రా బిగుతుగా ఉన్నంత మాత్రాన మూసుకుపోయే డ్రైనేజీ పైపు కాదు" అని ఆమె స్పష్టం చేశారు.
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ కూడా బ్రా వినియోగానికి, రొమ్ము క్యాన్సర్ ముప్పునకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. 1,500 మందికి పైగా మహిళలపై 2014లో నిర్వహించిన సుదీర్ఘ అధ్యయనంలోనూ బ్రా ధరించడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరగదని నిర్ధారణ అయింది.
భారతీయ మహిళల్లో రొమ్ము క్యాన్సర్
భారతీయ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు చిన్న వయస్సులోనే ఎక్కువగా కనిపిస్తుండటంతో ఈ విషయంలో సరైన అవగాహన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్‌ఆర్) పేర్కొంది. భారత్‌లో నమోదవుతున్న కేసుల్లో 45 నుంచి 50 ఏళ్ల వయస్సు గల మహిళలే ఎక్కువగా ఉంటున్నారని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
రొమ్ము క్యాన్సర్‌కు అసలైన కారణాలేంటి?
బ్రా బిగుతు కాకుండా, రొమ్ము క్యాన్సర్‌కు ప్రధానంగా దోహదపడే అంశాలను డాక్టర్ సీమా వెల్లడించారు.
- పెరుగుతున్న వయస్సు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటం
- బీఆర్‌సీఏ1 (BRCA1), బీఆర్‌సీఏ2 (BRCA2) వంటి జన్యు మార్పులు
- హార్మోన్ల సమతుల్యత లోపాలు, పునరుత్పత్తి సంబంధిత అంశాలు
- అధిక శరీర బరువు, ఆల్కహాల్ సేవనం, శారీరక శ్రమ లేకపోవడం
- రేడియేషన్‌కు గురికావడం
- వయస్సు పెరగడం.. ఇవన్నీ రొమ్ము క్యాన్సర్‌కు అత్యంత ముఖ్యమైన ముప్పు కారకాలని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ స్పష్టం చేసింది.
బిగుతైన బ్రాల వల్ల కలిగే సమస్యలివే
బ్రా వల్ల క్యాన్సర్ రాకపోయినప్పటికీ, సరైన సైజు లేని బ్రాలు ధరించడం వల్ల ఇతర శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి.
- చర్మంపై ఒత్తిడి గుర్తులు పడటం, చికాకు, మంట కలగడం
- రొమ్ముల్లో నొప్పి, అసౌకర్యం ఏర్పడటం (పెద్ద రొమ్ములు, సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువ)
- గర్భధారణ, పాలిచ్చే సమయం, నెలసరి రోజుల్లో రొమ్ము పరిమాణంలో మార్పులు వచ్చినప్పుడు బిగుతు బ్రాలు మరింత అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
అపోహలు వద్దు.. అవగాహన ముఖ్యం
{{/usCountry}}బ్రా వల్ల క్యాన్సర్ రాకపోయినప్పటికీ, సరైన సైజు లేని బ్రాలు ధరించడం వల్ల ఇతర శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి.
- చర్మంపై ఒత్తిడి గుర్తులు పడటం, చికాకు, మంట కలగడం
- రొమ్ముల్లో నొప్పి, అసౌకర్యం ఏర్పడటం (పెద్ద రొమ్ములు, సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువ)
- గర్భధారణ, పాలిచ్చే సమయం, నెలసరి రోజుల్లో రొమ్ము పరిమాణంలో మార్పులు వచ్చినప్పుడు బిగుతు బ్రాలు మరింత అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
అపోహలు వద్దు.. అవగాహన ముఖ్యం
{{/usCountry}}బ్రా, డియోడరెంట్లు క్యాన్సర్‌కు కారణమవుతాయనే అపోహలను నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాల వల్ల మహిళలు అసలైన ఆరోగ్య సంరక్షణను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రొమ్ములో కొత్తగా గడ్డలు రావడం, నిపుల్స్ నుంచి ద్రవాలు కారడం, నిపుల్స్ లోపలికి మళ్లడం, రొమ్ము పరిమాణం లేదా ఆకారంలో ఆకస్మిక మార్పులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
"బిగుతైన బ్రా వల్ల అసౌకర్యం కలగొచ్చు. అంతమాత్రాన అది క్యాన్సర్‌కు దారితీయదు. తప్పుడు ప్రచారాలను పక్కనపెట్టి, నిజమైన ముప్పు కారకాలను గుర్తించి, క్రమం తప్పకుండా హెల్త్ స్క్రీనింగ్ చేయించుకోవడమే రొమ్ము ఆరోగ్యానికి రక్షణ" అని డాక్టర్ సీమా స్పష్టం చేశారు.