సాధారణంగా గుండె సంబంధిత సమస్యలు వృద్ధాప్యంలో వస్తాయని చాలామంది భావిస్తుంటారు. కానీ, మన 20 లేదా 30 ఏళ్ల వయసులో మనం అలవర్చుకునే జీవనశైలి, అలవాట్లు భవిష్యత్తులో గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుతం యువతలో నికోటిన్ వాడకం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇది కేవలం వ్యసనం మాత్రమే కాదు, నిశ్శబ్దంగా గుండెను దెబ్బతీసే ప్రమాదకరమైన అలవాటని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ భోజరాజ్ హెచ్చరిస్తున్నారు.

నేటి యువతలో నికోటిన్ వాడకం అనేది సిగరెట్ల రూపంలో కాకుండా, వివిధ ఫ్రూట్ ఫ్లేవర్లలో లభించే డిస్పోజబుల్ వేప్స్ రూపంలోకి మారిపోయింది. "ఇది చూడటానికి ఫ్యాన్సీగా ఉండటం, సులభంగా లభించడం వల్ల దీని వల్ల పెద్దగా నష్టం లేదని యువత భ్రమపడుతున్నారు. జిమ్ వెళ్లేటప్పుడు లేదా క్లాసుల మధ్యలో ఏదో సరదాగా వాడే అలవాటుగా ఇది మారిపోయింది," అని డాక్టర్ భోజరాజ్ పేర్కొన్నారు. కానీ, గుండెకు రుచులు లేదా ఫ్లేవర్లతో సంబంధం లేదని, అది కేవలం నికోటిన్ ప్రభావాన్ని మాత్రమే గుర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
గుండెపై పడుతున్న భారం
నికోటిన్ శరీరంలోకి చేరగానే గుండె వేగాన్ని నిమిషానికి 10 నుంచి 20 బీట్స్ వరకు పెంచుతుంది. ఇది రక్తపోటును కూడా గణనీయంగా పెంచుతుంది. యువకుల్లో ఈ మార్పులు వెంటనే పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ రోజులో ఎక్కువ సార్లు నికోటిన్ తీసుకోవడం వల్ల గుండె నిరంతరం ఒత్తిడికి గురవుతూనే ఉంటుంది. "చాలామంది వినియోగదారులు రోజంతా నికోటిన్ తీసుకుంటూ ఉండటం వల్ల వారి హృదయనాళ వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చే అవకాశమే ఉండటం లేదు," అని ఆయన వివరించారు.
నికోటిన్ వాడకం ఇప్పుడు హైస్కూల్ దశలోనే మొదలవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సగానికి పైగా వినియోగదారులు తమ టీనేజ్లోనే దీనికి బానిసలవుతున్నారు. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ముప్పు వయసుతో సంబంధం లేకుండా ముందుకు జరుగుతోంది. ఇది సామాజికంగా అంగీకరించబడిన అలవాటుగా మారిపోవడంతో, దీనివల్ల కలిగే అనారోగ్య ముప్పును ఎవరూ గుర్తించలేకపోతున్నారు.
{{/usCountry}}నికోటిన్ వాడకం ఇప్పుడు హైస్కూల్ దశలోనే మొదలవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సగానికి పైగా వినియోగదారులు తమ టీనేజ్లోనే దీనికి బానిసలవుతున్నారు. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ముప్పు వయసుతో సంబంధం లేకుండా ముందుకు జరుగుతోంది. ఇది సామాజికంగా అంగీకరించబడిన అలవాటుగా మారిపోవడంతో, దీనివల్ల కలిగే అనారోగ్య ముప్పును ఎవరూ గుర్తించలేకపోతున్నారు.
{{/usCountry}}నేడు కేవలం ఒక అలవాటుగా మొదలైన ఈ నికోటిన్ వాడకం, కాలక్రమేణా గుండె పనితీరులో శాశ్వత మార్పులకు దారితీస్తుంది. ఇది రక్తపోటు నియంత్రణ తప్పడానికి.... గుండె కొట్టుకునే వేగంలో అస్థిరతకు కారణమవుతుంది. ఈ అలవాటును ప్రారంభంలోనే గుర్తిస్తే తప్ప, భవిష్యత్తులో ప్రాణాంతక గుండె జబ్బులను నివారించడం కష్టమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.