Heart Health Risk : చిన్నవయసులోనే గుండెకు ముప్పు...! నికోటిన్ వాడకంపై కార్డియాలజిస్ట్ హెచ్చరిక!

Nicotine Heart Health Risk : యువతలో పెరుగుతున్న నికోటిన్ అలవాటు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫ్రూట్ ఫ్లేవర్లు, డిస్పోజబుల్ వేప్స్ వల్ల ఇది హానికరం కాదని భ్రమ పడుతున్నారని.... కానీ ఇది బీపీని పెంచి గుండెపై ఒత్తిడి తెస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published on: Apr 26, 2026, 17:50:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా గుండె సంబంధిత సమస్యలు వృద్ధాప్యంలో వస్తాయని చాలామంది భావిస్తుంటారు. కానీ, మన 20 లేదా 30 ఏళ్ల వయసులో మనం అలవర్చుకునే జీవనశైలి, అలవాట్లు భవిష్యత్తులో గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుతం యువతలో నికోటిన్ వాడకం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇది కేవలం వ్యసనం మాత్రమే కాదు, నిశ్శబ్దంగా గుండెను దెబ్బతీసే ప్రమాదకరమైన అలవాటని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ భోజరాజ్ హెచ్చరిస్తున్నారు.

చిన్నవయసులోనే గుండెకు ముప్పు...! నికోటిన్ వాడకంపై కార్డియాలజిస్ట్ హెచ్చరిక! (Pexel)
చిన్నవయసులోనే గుండెకు ముప్పు...! నికోటిన్ వాడకంపై కార్డియాలజిస్ట్ హెచ్చరిక! (Pexel)

నేటి యువతలో నికోటిన్ వాడకం అనేది సిగరెట్ల రూపంలో కాకుండా, వివిధ ఫ్రూట్ ఫ్లేవర్లలో లభించే డిస్పోజబుల్ వేప్స్ రూపంలోకి మారిపోయింది. "ఇది చూడటానికి ఫ్యాన్సీగా ఉండటం, సులభంగా లభించడం వల్ల దీని వల్ల పెద్దగా నష్టం లేదని యువత భ్రమపడుతున్నారు. జిమ్ వెళ్లేటప్పుడు లేదా క్లాసుల మధ్యలో ఏదో సరదాగా వాడే అలవాటుగా ఇది మారిపోయింది," అని డాక్టర్ భోజరాజ్ పేర్కొన్నారు. కానీ, గుండెకు రుచులు లేదా ఫ్లేవర్లతో సంబంధం లేదని, అది కేవలం నికోటిన్ ప్రభావాన్ని మాత్రమే గుర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

గుండెపై పడుతున్న భారం

నికోటిన్ శరీరంలోకి చేరగానే గుండె వేగాన్ని నిమిషానికి 10 నుంచి 20 బీట్స్ వరకు పెంచుతుంది. ఇది రక్తపోటును కూడా గణనీయంగా పెంచుతుంది. యువకుల్లో ఈ మార్పులు వెంటనే పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ రోజులో ఎక్కువ సార్లు నికోటిన్ తీసుకోవడం వల్ల గుండె నిరంతరం ఒత్తిడికి గురవుతూనే ఉంటుంది. "చాలామంది వినియోగదారులు రోజంతా నికోటిన్ తీసుకుంటూ ఉండటం వల్ల వారి హృదయనాళ వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చే అవకాశమే ఉండటం లేదు," అని ఆయన వివరించారు.

నికోటిన్ వాడకం ఇప్పుడు హైస్కూల్ దశలోనే మొదలవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సగానికి పైగా వినియోగదారులు తమ టీనేజ్‌లోనే దీనికి బానిసలవుతున్నారు. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ముప్పు వయసుతో సంబంధం లేకుండా ముందుకు జరుగుతోంది. ఇది సామాజికంగా అంగీకరించబడిన అలవాటుగా మారిపోవడంతో, దీనివల్ల కలిగే అనారోగ్య ముప్పును ఎవరూ గుర్తించలేకపోతున్నారు.

నేడు కేవలం ఒక అలవాటుగా మొదలైన ఈ నికోటిన్ వాడకం, కాలక్రమేణా గుండె పనితీరులో శాశ్వత మార్పులకు దారితీస్తుంది. ఇది రక్తపోటు నియంత్రణ తప్పడానికి.... గుండె కొట్టుకునే వేగంలో అస్థిరతకు కారణమవుతుంది. ఈ అలవాటును ప్రారంభంలోనే గుర్తిస్తే తప్ప, భవిష్యత్తులో ప్రాణాంతక గుండె జబ్బులను నివారించడం కష్టమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యపరమైన సలహాల కోసం ఎల్లప్పుడూ నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More