...
...
Next Story

Child fatigue signs : మీ పిల్లలు ఎప్పడూ నీరసంగానే ఉంటున్నారా? ఇవి మిస్ అయితే ప్రమాదం!

పిల్లల్లో కనిపించే సాధారణ అలసటను వయసు పెరిగే లక్షణంగా కొట్టిపారేయకూడదు. తగినంత నిద్రపోయినా నిస్సత్తువగా ఉంటుంటే, ఐరన్ లోపం, స్లీప్ అప్నియా, స్క్రీన్ టైమ్ వంటి 7 ముఖ్యమైన కారణాలను తల్లిదండ్రులు తప్పక గమనించాలి.

Published on: Aug 23, 2026, 07:30:21 IST
Advertisement

పిల్లలు బడి నుంచి రాగానే సోఫాలో వాలిపోవడం, హోంవర్క్ మీద శ్రద్ధ పెట్టలేకపోవడం వంటివి తరచూ కనిపిస్తుంటాయి. బిజీ షెడ్యూల్, ఎక్కువ స్క్రీన్ టైమ్ లేదా వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే శారీరక మార్పులు అనుకుని తల్లిదండ్రులు వీటిని లైట్ తీసుకుంటుంటారు. అయితే పిల్లల్లో అప్పుడప్పుడు అలసట కనిపించడం సాధారణమే. కానీ, వారాల తరబడి వారు నిస్సత్తువగా ఉంటుంటే మాత్రం కచ్చితంగా శ్రద్ధ పెట్టాల్సిందే అని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఈ దీర్ఘకాలిక అలసట వారి ఏకాగ్రతను, మూడ్‌ను, చదువును దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.

పిలల్లో ఈ 7 సంకేతాలు గమనించారా?
పిలల్లో ఈ 7 సంకేతాలు గమనించారా?

అలసట అనేది కేవలం తాత్కాలిక సమస్య కాకుండా ఒక సరళిగా మారుతున్నప్పుడు తల్లిదండ్రులు విస్మరించకూడని కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇక్కడ తెలుసుకోండి..

1. నిద్రపోయినా తీరని అలసట..

పిల్లలు గంటల కొద్దీ నిద్రపోయినా, అది సరిపోయినట్లు కాదు. రాత్రిపూట తొమ్మిది గంటలు పడుకున్నా సరే, ఉదయం లేచేసరికి నీరసంగానే ఉంటున్నారంటే ఏదో సమస్య ఉన్నట్టే. రాత్రిపూట గురక పెట్టడం, నోటితో శ్వాస తీసుకోవడం, పదే పదే మెలకువ రావడం వల్ల గాఢ నిద్రకు భంగం కలుగుతుంది. దీనివల్ల శరీరానికి తగిన విశ్రాంతి దొరకదు.

2. ఐరన్ లోపం (అనీమియాకు ముందు దశ)..

కారణం తెలియకుండా పిల్లలు అలసటగా ఉండటానికి ప్రధాన కారణం రక్తంలో ఐరన్ మోతాదు తగ్గడమే. శరీరంలో ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి ఐరన్ అవసరం. పూర్తిగా రక్తహీనత (అనీమియా) ఏర్పడకపోయినా, స్వల్పంగా ఐరన్ తగ్గినా పిల్లల్లో తీవ్రమైన అలసట, చిరాకు వస్తాయి. ఎదుగుదల వేళల్లో, ఆహారం సరిగ్గా తినని పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్త పరీక్ష ద్వారా దీన్ని సులభంగా గుర్తించవచ్చు.

3. గురకను తేలికగా తీసుకోకూడు..

పిల్లల్లో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్యను చాలా మంది గుర్తించలేకపోతున్నారు. ఇది కేవలం అలసటలా కాకుండా అతిగా అల్లరి చేయడం, ఏకాగ్రత లోపించడం లాంటి ప్రవర్తనా సమస్యలుగా బయటపడుతుంది. రాత్రిపూట పెద్దగా గురక పెట్టడం, శ్వాస ఆగిపోయినట్లు అనిపించడం జరిగితే మెదడుకు పదే పదే ఇబ్బంది కలుగుతుంది.

4. రాత్రివేళల్లో వెంటాడే స్క్రీన్ టైమ్..

పిల్లల్లో హైపోథైరాయిడిజం లక్షణాలు అంత తేలికగా బయటపడవు. అలసటతో పాటు ఎదుగుదల మందగించడం, బరువు పెరగడం, మలబద్ధకం లేదా చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాలి. వీటికి సంబంధించిన రక్త పరీక్ష చేయించడం మంచిది.

6. శారీరక కారణాలు లేని ఒత్తిడి..

అలసట అనేది కేవలం శరీరానికే కాదు, మనసుకి కూడా రావొచ్చు. పెద్దలలాగే పిల్లలు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటారు. కానీ దాన్ని వ్యక్తపరచలేక అలసట రూపంలో బయటపెడతారు. పిల్లల్లో ప్రవర్తనా మార్పులు, దేని పట్ల ఆసక్తి చూపకపోవడం వంటివి కనిపిస్తే సున్నితంగా వారి మనసు విప్పే ప్రయత్నం చేయాలి.

7. మధ్యాహ్నం నాటికి శక్తి నశిపోవడం..

ఉదయం అల్పాహారం మానేయడం, జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపుతప్పుతాయి. దీనివల్ల వారు త్వరగా శక్తిని కోల్పోయి నీరసపడతారు. ఎదుగుతున్న పిల్లలకు పౌష్టికాహారం, తగినన్ని నీళ్లు సమయానికి అందడం చాలా ముఖ్యం.

ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?

అప్పుడప్పుడు ఉండే అలసట గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ రెండు మూడు వారాల కంటే ఎక్కువగా నీరసం కొనసాగినా, ముఖం పాలిపోయినా, బరువు తగ్గినా లేదా మూడ్‌లో మార్పులు వచ్చినా వైద్యులను సంప్రదించాలి. చాలా సందర్భాలలో చిన్న రక్త పరీక్షతో సమస్య ఏమిటో సులభంగా తెలుసుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON