మండే వేసవిలో ఈ కూల్ కూల్ ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేయండి.. చిల్ అయిపోవచ్చు!
వేసవి సమయంలో మీ కుటుంబంతో కలిసి చల్లని ప్రదేశాలకు వెళ్లానుకుంటున్నారా? కూల్ కూల్‌గా ఉండే ప్రదేశాలు చాలా వరకు మీకోసం ఎదురుచూస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళ్లడానికి టూర్లు ప్లాన్ చేస్తున్నారు. తేమ, మండే ఎండ నుండి తప్పించుకోవడానికి తెలుగు పర్యాటకులు ఇప్పుడు కూల్ ప్రాంతాల కోసం చూస్తున్నారు. చల్లని ప్రాంతాల్లో ప్రశాంతతను కూడా పొందవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం, తక్కువ జనాలు, ప్రకృతికి దగ్గరగా సమయం గడిపే అవకాశం కల్పించే అంతర్జాతీయ గమ్యస్థానాల కోసం జనాలు ఇప్పుడు చూస్తున్నారు.

న్యూజిలాండ్ క్వీన్స్‌టౌన్‌లో 5 నుంచి 15 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉంటాయి. ీ చల్లని వాతావరణంలో సరస్సు నడకలు, ద్రాక్షతోటల పర్యటనలు, హెలికాప్టర్ ప్రయాణాలను ఆస్వాదించవచ్చు .
మలేషియాలోని కామెరాన్ హైలాండ్స్‌కు భారతీయులు వెళ్తుంటారు. ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రత 15 నుంచి 25 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడి పచ్చని తేయాకు తోటలు, స్ట్రాబెర్రీ పంట, పొగమంచుతో కూడిన బాటలు ఒక స్వర్గంలా కనిపిస్తాయి.
ఇండోనేషియాలోని ఉబుద్ బీచ్‌లతో పాటు, ఉబుద్‌లోని పచ్చని లోయలు 20 నుంచి 26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలతో ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. ఈ ప్రదేశం పొలాలు, అడవులతో అందంగా ఉంటుంది.
థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయి పర్వతాల నడుమ నెలకొని ఉన్నది. పర్యాటకులకు 22 32 డిగ్రీల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇది కాకుండా.. మీరు ఇక్కడ పురాతన దేవాలయాలు, జాతీయ పార్కులు, ఏనుగుల సంరక్షణ కేంద్రాలను సందర్శించవచ్చు.
ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో ఈ సమయంలో 8 నుంచి 17 డిగ్రీల ఉష్ణోగ్రతతో శీతాకాలంలాగా ఉంటుంది. అడవులు, వారసత్వ నగరాలతో నిండిన ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
వియత్నాంలోని డా లాట్ నగరంలో ఉష్ణోగ్రత 16 నుంచి 24 డిగ్రీలు ఉంటుంది. ఇది పైన్ అడవులు, అందమైన సరస్సులు, ఫ్రెంచ్ వలసరాజ్యాల నిర్మాణ శైలితో అద్భుతంగా ఉంటుంది.
జపాన్‌లోని హోక్కైడో ద్వీపంలో ప్రకృతిలో గడపవచ్చు. అంతేకాకుండా 8 నుంచి 17 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఈ ప్రాంతంలో అందమైన పూల తోటలు, జాతీయ పార్కులు, బీచ్ నగరాలు ఉన్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


