Ind vs Nz Toss: అల్టిమేట్ ఫైట్.. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ ఫైనల్.. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్.. సేమ్ టీమ్

Ind vs Nz Toss: కోట్లాది భారతీయులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ టైమ్ వచ్చేసింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టైటిల్ పోరు ఉత్కంఠ పెంచేస్తోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. 

Published on: Mar 8, 2026, 18:36:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 ప్రపంచకప్ లో ఆఖరి పోరాటం. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్. ఉత్కంఠతో ఊపేస్తూ, క్రికెట్ లవర్స్ కు అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ అందించే మెగా పోరు వచ్చేసింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది.

టీ20 ప్రపంచకప్ ఫైనల్
టీ20 ప్రపంచకప్ ఫైనల్

సేమ్ టీమ్

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరుగుతున్న ఈ తుదిపోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేేయనుంది. సేమ్ టీమ్ తో ఇండియా ఆడుతోంది. అంటే అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి టీమ్ లో ప్లేస్ నిలబెట్టుకున్నారు.

టీ20 ప్రపంచకప్ ఫైనల్

కోట్లాది ఇండియన్ ఫ్యాన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఈ రోజు (మార్చి 8) టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ తలపడుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన భారత్ వరుసగా రెండో సారి టైటిల్ ముద్దాడి హిస్టరీ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ అందుకోవాలని న్యూజిలాండ్ చూస్తోంది.

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని లక్ష మందికి పైగా ఆడియన్స్ సమక్షంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఢీ కొడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన ఫస్ట్ టీమ్ గా ఇండియా నిలుస్తుంది. అలాగే కప్ దక్కించుకున్న ఫస్ట్ హోస్ట్ నేషన్ గా కూడా రికార్డు నమోదు చేస్తుంది. ఈ టీ20 ప్రపంచకప్ కు శ్రీలంకతో కలిసి ఇండియా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.

ఫస్ట్ టైమ్

మరోవైపు టీ20 ప్రపంచకప్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దనే లక్ష్యంతో న్యూజిలాండ్ ఉంది. ఆ టీమ్ ఇప్పటివరకూ ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేదు. టీ20, వన్డేల్లో కలిపి ఒక్కసారి కూడా విశ్వవిజేతగా నిలవలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టైటిల్ పోరులో ఇండియాను ఓడించి హిస్టరీ క్రియేట్ చేయాలని కివీస్ పట్టుదలతో ఉంది.

వీళ్లపైనే హోప్స్

న్యూజిలాండ్ తో ఫైనల్లో ఇండియా హోప్స్ మొత్తం సంజు శాంసన్, బుమ్రా పైనే ఉన్నాయి. ఈ టీ20 ప్రపంచకప్ లో లేటుగా టీమ్ లోకి వచ్చినా శాంసన్ బ్యాట్ తో అదరగొడుతున్నాడు. టీమ్ ఫైనల్ చేరడంలో అతనిదే కీలక పాత్ర. మరోవైపు బంతితో బుమ్రా నిలకడగా సత్తాచాటుతున్నాడు. ఎంతో ప్రెషర్ లో సెమీస్ లో ఇంగ్లాండ్ పై అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

ఇలా ఫైనల్

చాలా ఉత్కంఠగా సాగిన సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఇండియా గెలిచింది. మరో సెమీస్ లో దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తు చేసింది. కివీస్ టీమ్ లో ఓపెనర్లు అలెన్, సీఫర్ట్ డేంజరస్ గా మారారు. వీళ్లను వీలైనంత త్వరగా ఔట్ చేస్తే ఇండియన్ విజయ అవకాశాలు బెటర్ గా మారుతాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More