Study abroad : అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు- చదువుకు ప్లాన్ చేసే ముందు ఈ కొత్త వీసా రూల్స్ తెలుసుకోండి..
Student Visa Rules 2026 : విదేశాల్లో చదువుకోవాలనే కలలు కనే భారతీయ విద్యార్థులకు కీలక సమాచారం. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ వీసా నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిని తెలుసుకోవడం చాలా అవసరం. ఆ వివరాలు మీకోసం..
ఒకప్పుడు విదేశీ విద్య అంటే కేవలం అడ్మిషన్ పొందడమే లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలా దేశాలు కేవలం విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడం కంటే, తమ దేశ ఆర్థిక వ్యవస్థకు, శ్రామిక శక్తికి ఉపయోగపడే నైపుణ్యం గల వారిని ఎంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. దీనివల్ల 2026 కొత్త వీసా నిబంధనలు మునుపటి కంటే కఠినంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు ఈ 2026లో కనిపించిన స్టూడెంట్ వీసా మార్పులను ఇక్కడ తెలుసుకోండి..

2026 కొత్త నిబంధనలు: ప్రధాన మార్పులు..
కొత్త నిబంధనల ప్రకారం, భారతీయ విద్యార్థులు ఆర్థికంగా, విద్యాపరంగా, కెరీర్ ప్లానింగ్ విషయంలో మరింత పక్కాగా ఉండాలి. లేకపోతే స్టూడెంట్ వీసా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
ఠినమైన ఆర్థిక నిబంధనలు: విద్యార్థులు పార్ట్-టైమ్ ఉద్యోగాలపై ఆధారపడకుండా, తమ చదువు, జీవన వ్యయాలను స్వయంగా భరించగలమని నిరూపించాలి. ఇందుకోసం చూపించాల్సిన కనీస నిధుల మొత్తాన్నిపెంచారు.
భాషా ప్రావీణ్యం: ఐఈఎల్టీఎస్ లేదా పీటీఈ వంటి పరీక్షల్లో మునుపటి కంటే ఎక్కువ స్కోర్లు సాధించడం ఇప్పుడు తప్పనిసరి.
జెన్యూన్ స్టూడెంట్ నిబంధన: మీరు ఎంచుకున్న కోర్సు మీ గత విద్యా నేపథ్యానికి, భవిష్యత్తు కెరీర్ లక్ష్యాలకు సరిపోతుందో లేదో వీసా అధికారులు నిశితంగా పరిశీలిస్తారు. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోతే వీసా రావడం కష్టం.
దేశాల వారీగా కొత్త వీసా అప్‌డేట్స్..
వివిధ దేశాలు తమ ఆర్థిక, సామాజిక అవసరాలకు అనుగుణంగా నిబంధనలను సవరించాయి. ఆ వివరాలు కింద పట్టికలో చూడవచ్చు:
| దేశం | చూపించాల్సిన ఫైనాన్షియల్స్ | కీలక మార్పు |
|---|---|---|
| ఆస్ట్రేలియా | AUD 29,710 (ఏడాదికి) | వీసా ఫీజు పెంపు, జెన్యూన్ స్టూడెంట్ రూల్ అమలు. |
| కెనడా | CAD 22,895 | SDS ఫాస్ట్ ట్రాక్ రద్దు, స్టడీ పర్మిట్లపై పరిమితి. |
| యూకే | పెరిగిన ఫీజులు | డిపెండెంట్లకు పరిమితులు, భాషా ప్రావీణ్యంపై కఠినం. |
| అమెరికా | వీసా ఇంటెగ్రిటీ ఫీజు | ఇంటర్వ్యూలో కఠినమైన ప్రశ్నలు, స్టెమ్ విద్యార్థులకు ప్రాధాన్యత. |
| జర్మనీ | EUR 11,904 (బ్లాక్డ్ అకౌంట్) | చదువు తర్వాత ఉద్యోగ వేట కోసం 'ఆపర్చునిటీ కార్డ్'. |
| న్యూజిలాండ్ | NZD 20,000 (ఏడాదికి) | వీసా ప్రక్రియ సరళతరం, కానీ నిధుల అవసరం పెంపు. |
స్టూడెంట్ వీసా- ముఖ్యమైన దేశాల హైలైట్స్:
ఆస్ట్రేలియా: పాత విధానాన్ని రద్దు చేసి 'జెన్యూన్ స్టూడెంట్' రూల్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం మీరు నిజంగా చదువుకోవడానికే వస్తున్నారా లేదా అనే దానికి బలమైన ఆధారాలు చూపాలి.
కెనడా: గతంలో ఉన్న ఎస్‌డీఎస్ విధానం రద్దు కావడంతో వీసా ప్రక్రియ ఇప్పుడు మరింత సమయం తీసుకోవచ్చు. చదువుకోవడానికి వచ్చే వారి సంఖ్యపై కూడా ప్రభుత్వం పరిమితులు విధించింది.
బ్రిటన్ (యూకే): చదువు పూర్తయిన తర్వాత ఇచ్చే వర్క్ పర్మిట్ కాల పరిమితిని తగ్గించాలని యోచిస్తోంది. అలాగే చాలా కేటగిరీల్లో కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లడంపై ఆంక్షలు విధించింది.
అమెరికా: వీసా ఇంటెగ్రిటీ ఫీజును కొత్తగా చేర్చింది. అయితే, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాల్లో చదివే వారికి చదువు తర్వాత మంచి అవకాశాలను కల్పిస్తోంది.
పైన పేర్కొన్న మార్పులు 2024 నుంచి 2026 మధ్య వచ్చినవి.
పక్కా ప్రణాళికే విజయం!
2026 కొత్త వీసా నిబంధనలు సవాలుగా అనిపించినప్పటికీ, సరైన సమాచారం ముందస్తు తయారీ ఉన్న విద్యార్థులకు విదేశీ విద్య అనేది అసాధ్యమేమీ కాదు. కేవలం విమానం ఎక్కి వెళ్లడం కాదు, అక్కడ నిలదొక్కుకునే ఆర్థిక సత్తా, విద్యా ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రపంచ దేశాలు ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


