Relationship Tips : మీ భాగస్వామితో గొడవ సమయంలో ఈ 4 విషయాలు అనకండి.. మటాష్!
Relationship Tips : భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంటే.. ఒక్కోసారి ఫ్లోలో ఏం అంటారో తెలియని పరిస్థితి. మాటలు వదిలిపెట్టిన తర్వాత అయ్యో అనకుండా ఉండాల్సిందే అని బాధపడుతుంటారు. భాగస్వామితో గొడవ సమయంలో అనకూడని 4 విషయాలు ఉన్నాయి.
అందరూ చెప్పుకొనే సామెత ఒకటి ఉంది.. మాట, తూట బయటకు వచ్చాయంటే.. మళ్లీ వెనక్కు తీసుకోలేం. అందుకే ఏ బంధంలోనైనా.. గొడవలు జరుగుతుంటే.. మీరు అనే మాటలే గొడవను పెద్దగా చేస్తాయి. ఒక సంబంధంలో ఉండటం ఎంత బాగుంటుందో.. దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ప్రేమగా మాట్లాడే ఒక్క మాట.. సంబంధాన్ని బలపరుస్తుంది.

కానీ మనం చెప్పే ఒక తప్పుడు మాట అన్నింటినీ నాశనం చేసేస్తుంది. భాగస్వామితో ఏం మాట్లాడాలి అనే విషయాన్ని మనసులో నెమరువేసుకుంటారు. ఇలా చెప్పాలి, ఇలా అనాలి అని చాలా మంది అనుకుంటారు. ఇదంతా పక్కనపెడితే.. ఏం అనకూడదో కూడా క్లారిటీ ఉండాలి. ఒకరు మనతో ఉన్నప్పుడు.. మన గురించి టాప్ టూ బాటమ్ అన్ని తెలుసు అనుకుంటాం. మనల్ని పూర్తిగా అర్థం చేసుకున్నారని ఫీల్ అయిపోతాం. కానీ కోపంలో లేదా చిరాకులో అనే కొన్ని మాటలు సంబంధం పునాదులను కదిలిస్తాయ్. లైఫ్ లాంగ్ మీ ఫేస్ చూస్తే.. ఆ మాటలే గుర్తుకువచ్చేలా చేస్తాయ్. అందుకే గొడవ సమయంలో మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ మాటలు వద్దు
గొడవ జరుగుతుంటే.. చాలా మందికి తెలియకుండా అనే మాట ఏంటో తెలుసా? 'నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నీతో అనవసరంగా ప్రేమలో ఉన్నాను. నీతో సంబంధం పెట్టుకున్నందుకు చింతిస్తున్నాను.' ఇలాంటి మాటలు అవతలివారిని దారుణంగా బాధపెడతాయి. గొడవ ఎంత పెద్దదైనా సరే ఈ మాటలు ఎప్పుడూ అనకూడదు. అది కేవలం ఒక మాట మాత్రమే కాదు, అది మొత్తం సంబంధాన్నే ప్రమాదంలో పడేస్తుంది. ఒక్కసారి అన్నాక మాటను వెనక్కి తీసుకోవడం అసాధ్యం.
ఆర్థిక పరిస్థితిపై
మీ భాగస్వామి ఆర్థిక పరిస్థితిని ఎగతాళి చేయవద్దు. ఒకరి డబ్బు లేదా నేపథ్యం గురించి జోకులు వేయడం లేదా ఎగతాళి చేయడం చాలా తప్పు. డబ్బు విషయాలు చాలా వ్యక్తిగతమైనవి, అది ఒకరి అస్థిత్వాన్ని కూడా చెబుతుంది. అవతలివారిని తక్కువ చేసేలా.. ఒక ఆయుధంలా ఆ మాటను ఉపయోగించడం రిలేషన్‌షిప్‌కు డేంజర్.
అవమానించొద్దు
మీ భాగస్వామి కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను అవమానించడం మంచిది కాదు. వారికి దగ్గరైన వారితో మీకు సమస్య ఉండవచ్చు, అది ఎవరి తప్పో తర్వాత సంగతి. కానీ మీ భాగస్వామికి దగ్గరైనవారి గురించి చెడుగా మాట్లాడకూడదు. భార్యాభర్తల మధ్య సాధారణంగా వచ్చేది ఇలాంటి మాటలే. మీ అమ్మవాళ్లు.. ఇలా.. వాళ్లతో నాకు అస్సలు పడదులాంటి మాటలు ఆపేయండి.
బలహీనతలతో ఆడుకోవద్దు
మీ భాగస్వామి బలహీనతలను ఎగతాళి చేయడం మానుకోండి. మీ భాగస్వామి ఏదైనా విషయంలో అభద్రతా భావంతో ఉంటే, దాని గురించి జోకులు చేయడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ క్రమంగా సంబంధంలో దూరాన్ని సృష్టించగలది ఇదే. నీకు ఆ పని చేయడం రాదు, నీతో అస్సలు చేతకాదు.. లాంటి మాటలు చాలా నష్టం కలిగిస్తాయి.
ప్రేమ అంటే సుఖంలో మాత్రమే నవ్వుతూ మాట్లాడటం కాదు.. ఏడ్చే సమయంలో ధైర్యం చెప్పి కన్నీటిని తుడవాడం. కష్ట సమయాల్లో ఒకరి భావాలను మరొకరు గౌరవించుకోవాలి. ప్రతి సంబంధంలోనూ గొడవలు కామన్.. కానీ ఆ సమయంలో మనం మాట్లాడే మాటలు అవతలివారి మనసులో గుర్తుండిపోతాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


