ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ. 1,80,000 గరిష్ఠ స్థాయికి చేరింది. అప్పటితో పోలిస్తే ధరలు ఇప్పుడు సుమారు 30 నుంచి 31 శాతం వరకు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర సుమారు 3,650 డాలర్ల వద్ద కదలాడుతుండగా, క్రితం ట్రేడింగ్ సెషన్లో ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 1,26,000 వద్ద ముగిసింది.

బంగారం ధరలు పడిపోవడంతో ఇప్పటికే గోల్డ్ లోన్ తీసుకున్న వారిపై లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తి భారం పెరిగే అవకాశం ఉంది. తాకట్టు పెట్టిన నగలు, ఆభరణాల మార్కెట్ విలువ తగ్గినా, బాకీ ఉన్న అప్పు మొత్తం వాటంతట అదే తగ్గదు. దాంతో ఎల్టీవీ నిష్పత్తి పెరిగి, రుణ సంస్థలకు రిస్క్ పెరుగుతుంది. ఫలితంగా రుణగ్రహీతలపై అదనపు హామీ, అదనపు బంగారం లేదా పాక్షిక చెల్లింపు (పార్ట్-పేమెంట్) చేయాల్సిన పరిస్థితి రావచ్చు.
బంగారం ధరలు తగ్గితే గోల్డ్ లోన్లపై ఎందుకు ప్రభావం పడుతుంది?
ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ. 1,00,000 విలువైన బంగారం తాకట్టు పెట్టి 70 శాతం ఎల్టీవీ నిష్పత్తితో రూ. 70,000 అప్పు తీసుకున్నారని అనుకుందాం. ఆ తర్వాత బంగారం ధర 20 శాతం తగ్గితే, తాకట్టు బంగారం విలువ రూ. 80,000కు పడిపోతుంది. కానీ బకాయి అప్పు రూ. 70,000గానే ఉంటుంది. అప్పుడు ఎల్టీవీ నిష్పత్తి 87.5 శాతానికి పెరుగుతుంది.
ఇలా ధరలు తగ్గినప్పుడు రుణ సంస్థకు ఉండే భద్రతా కవచం తగ్గుతుంది. బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉన్న సమయంలో లోన్ తీసుకున్న వారికి ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
ఆర్బీఐ ఎల్టీవీ నిబంధనలు, నిపుణుల సూచనలు
2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, రుణ సంస్థలు లోన్ మొత్తాన్ని బట్టి దశలవారీ (టియర్డ్) ఎల్టీవీ నిబంధనలను పాటించాలి.
{{/usCountry}}2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, రుణ సంస్థలు లోన్ మొత్తాన్ని బట్టి దశలవారీ (టియర్డ్) ఎల్టీవీ నిబంధనలను పాటించాలి.
{{/usCountry}}బ్యాంక్‌బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి మింట్‌తో మాట్లాడుతూ, బంగారం ధరలు పడిపోయినప్పుడు నిర్దేశిత ఎల్టీవీ పరిమితి దాటితే రుణ సంస్థలు సరిదిద్దే చర్యలు తీసుకుంటాయని వివరించారు.
“బంగారం ధరలు తగ్గినప్పుడు లోన్ మొత్తం వాటితో పాటు మారదు కాబట్టి, ఉన్న గోల్డ్ లోన్లపై లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తి పెరుగుతుంది. రుణ కాలం మొత్తం నిర్దేశిత ఎల్టీవీని కొనసాగించాలని ఆర్బీఐ కోరుతుంది. అందుకే పరిమితిలోకి తీసుకురావడానికి రుణ సంస్థలు పాక్షిక చెల్లింపు లేదా అదనపు బంగారం అడగవచ్చు. ఎల్టీవీని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వడ్డీ క్రమం తప్పకుండా చెల్లిస్తూ, రుణ సంస్థ నుంచి వచ్చే సమాచారానికి వెంటనే స్పందిస్తే రుణగ్రహీతలు ముందుజాగ్రత్త పడవచ్చు. ఈఎంఐ ఆధారిత చెల్లింపు ఎంచుకోవడం కూడా ఎల్టీవీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది” అని ఆదిల్ శెట్టి స్పష్టం చేశారు.
గోల్డ్ లోన్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రుణ సంస్థలు ఇచ్చే వడ్డీ రేట్లను మాత్రమే చూసి గోల్డ్ లోన్ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ అంశాలు స్పష్టం చేస్తున్నాయి. రుణం తీర్చే విధానాన్ని అర్థం చేసుకోవడం, బకాయి మొత్తాన్ని జాగ్రత్తగా గమనించడం, తాకట్టు పెట్టిన బంగారం విలువలో మార్పులను ట్రాక్ చేయడం అవసరం.
ఏ రకమైన అప్పుకైనా క్రమం తప్పకుండా వడ్డీ కట్టడం, ప్రణాళిక ప్రకారం ఈఎంఐ చెల్లించడం ద్వారా బాకీ భారాన్ని సమర్థంగా నిర్వహించవచ్చు. అత్యవసర నిధుల కోసం గోల్డ్ లోన్ త్వరగా అందుబాటులో ఉన్నప్పటికీ, బంగారం ధరలు పడిపోతే లెక్కలు మారిపోతాయి. అందుకే లోన్ నిబంధనలపై స్పష్టత ఉంచుకోవడం, తగినంత భద్రతా నిల్వ ఉంచుకోవడం, గరిష్ఠ ఎల్టీవీ పరిమితి వరకు పూర్తిగా అప్పు సాగదీయకుండా ఉండటం వల్ల తర్వాత ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు.
(గమనిక: ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే, పెట్టుబడి సలహా కాదు. గోల్డ్ లోన్ నిబంధనలు, ఎల్టీవీ అవసరాలు, రుణ సంస్థల చర్యలు మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం రుణ ఒప్పందాన్ని పరిశీలించి, సంబంధిత రుణ సంస్థను సంప్రదించాలి.)
ABOUT THE AUTHOR
ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.