నవంబర్ 1న పసిడి, వెండి ప్రియులకు కోలుకోలేని షాక్ తగిలింది. దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. పసిడి పతనం ముగిసేలా కనిపించడం లేదు. గత అక్టోబర్ నెలలో ఆల్ టైమ్ వర్స్ట్ పెర్ఫార్మెన్స్ నమోదు చేసిన బంగారం, ఇప్పుడు 2025 డిసెంబర్ నాటి కనిష్ఠ స్థాయిలకు పడిపోయే దిశగా వేగంగా పయనిస్తోంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ అందించిన వివరాల ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.3,200 తగ్గి రూ.1,42,000కు చేరుకుంది. అంతక్రితం శుక్రవారం రోజున ఈ ధర రూ.1,45,200 వద్ద ముగిసింది. గత ఏడాది 2025 డిసెంబర్ 26న పసిడి ధర రూ.1,42,300 వద్ద ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే.
వెండి ధరల్లోనూ అదే తీరు

పసిడి బాటలోనే వెండి కూడా భారీగా కరిగిపోతోంది. 2026 జనవరిలో రికార్డు స్థాయి గరిష్ఠాలను తాకిన వెండి, ఆ తర్వాత ఊహించని రీతిలో పతనమవుతోంది. నవంబర్ 1న కిలో వెండి ధర రూ.4,200 మేర తగ్గి రూ.1,86,000కు దిగివచ్చిందని పీటీఐ నివేదిక తెలిపింది. శుక్రవారం నాడు కేజీ వెండి రూ.1,90,200 వద్ద ముగిసింది. ప్రస్తుతం కనిపిస్తున్న మార్కెట్ పోకడలు చూస్తుంటే వెండి ధరలు సైతం 2025 డిసెంబర్ స్థాయికి చేరేలా ఉన్నాయి.
పతనానికి కారణాలేంటి?
దేశీయ మార్కెట్‌లో పసిడి తగ్గడానికి అంతర్జాతీయ కమొడిటీ మార్కెట్ల బలహీనతే ప్రధాన కారణం. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 3,900 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇది 2025 అక్టోబర్ తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి.
"యూఎస్‌లో అంచనాల కంటే ఎక్కువగా నమోదైన ద్రవ్యోల్బణ గణాంకాలు, డిసెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు పెరగడంతో రాబడి లేని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది. పసిడి కన్నా వెండిపై అమ్మకాల ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంది. పారిశ్రామికంగా డిమాండ్ తగ్గడమే దీనికి కారణం" అని లెమన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ విశ్లేషించారు.
"ఇంధన ధరలు పెరగడం ద్రవ్యోల్బణ భయాలను పెంచగా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరి బంగారం, వెండి ధరలను మరింత కిందకు నెట్టింది" అని 360 వన్ అసెట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ రాహుల్ ఖేతావత్ పేర్కొన్నారు.
నవంబర్‌లో కోలుకునే అవకాశాలు ఉన్నాయా?
వచ్చే వారాల్లో పసిడి ధరలు ఒకే శ్రేణిలో ఊగిసలాడే అవకాశం ఉందే తప్ప భారీగా పుంజుకునే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
{{/usCountry}}వచ్చే వారాల్లో పసిడి ధరలు ఒకే శ్రేణిలో ఊగిసలాడే అవకాశం ఉందే తప్ప భారీగా పుంజుకునే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
{{/usCountry}}"బలపడుతున్న అమెరికన్ డాలర్, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, వడ్డీ రేట్ల పెంపు భయాలు పసిడి భారీగా కోలుకోకుండా అడ్డుకోవచ్చు" అని వైభవంగళ్ అనుకూలకర ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మౌర్య అభిప్రాయపడ్డారు.
ముడి చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, యూఎస్ ఫెడ్ నిర్ణయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల గమనాన్ని నిర్దేశించనున్నాయి.