...
...
Next Story

Happy Hanuman Jayanti: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

Happy Hanuman Jayanti : హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడ పొందుపరిచిన శక్తిమంతమైన శ్లోకాలు, మంత్రాలు పరిశీలించి మీ బంధుమిత్రులకు పంపండి.

Published on: May 12, 2026 08:23 AM IST
Advertisement

హనుమాన్ జయంతి అనేది హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. హనుమంతుడికి ఆంజనేయుడు, మారుతి, హనుమ, వాయుపుత్రుడు, అంజనీసుతుడు, బజరంగీ, కేసరీనందన, పవన తనయ వంటి అనేక పేర్లు ఉన్నాయి. అయితే హనుమంతుడు శ్రీరామ బంటుగా, రామదూతగా ప్రసిద్ధి. హిందూ పురాణాల ప్రకారం, హనుమంతుడు శ్రీరామునికి అత్యంత గొప్ప భక్తుడు, తన గుండెల నిండా శ్రీసీతారాములను నిండుగా దాచుకున్న దాసుడు. శ్రీరాముని పట్ల హనుమకు ఉన్న అచంచలమైన భక్తిని ఆయన భక్తులు సైతం ఆరాధిస్తారు.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

హనుమాన్ జయంతి హనుమంతుని సద్గుణాలను తెలియజేసే ప్రాముఖ్యతను కలిగి ఉంది. హనుమంతుడు ధైర్యం, విధేయత, విశ్వాసం, నమ్మకం, భక్తి, నిస్వార్థత, చురుకుతనం, తెలివి వంటి గొప్ప గుణాలను కలిగి ఉన్నాడు.

హనుమాన్ జయంతి రోజున భక్తులు హనుమంతునికి విశేషమైన పూజలు చేస్తారు, హనుమాన్ చాలీసా పఠిస్తారు, రామనామ జపం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున మీరు కూడా హనుమద్నామ స్మరణలో తరించేందుకు, మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఇక్కడ అందిస్తున్నాం..

గ్రహదోష నివారణకు:

మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!

శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

ఆరోగ్యానికి:

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!

ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

వివాహ ప్రాప్తికి:

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!

వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

సంతాన ప్రాప్తికి:

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!

సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

ఉద్యోగ ప్రాప్తికి:

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON