Hardik Pandya : హార్దిక్ పాండ్యా ‘హనుమాన్ చాలీసా’ సీక్రెట్ ఇది! ఫెరారీలో..
Hardik Pandya : టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫెరారీలో హనుమాన్ చాలీసా వింటానని చెప్పుకొచ్చారు. పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడంలో హానుమాన్ చాలీసాకు మించిన పాట మరొకటి లేదని వివరించారు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆయన విలాసవంతమైన జీవనశైలి! కోట్లాది రూపాయల విలువైన ఫెరారీ, లంబోర్గిని కార్లు.. చేతికి కోట్లు పలికే వాచీలు.. శరీరం నిండా టాటూలు.. ఇదీ బయట ప్రపంచానికి కనిపించే పాండ్యా. అయితే, ఈ గ్లామరస్ లైఫ్ వెనుక హార్దిక్ పాండ్యాలో డివోషనల్ యాంగిల్ కూడా ఉందని మీకు తెలుసా?

విలాసవంతమైన కారులో.. పవిత్రమైన హనుమాన్ చాలీసా!
ఇటీవల ఒక కార్యక్రమంలో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌తో కలిసి పాల్గొన్న హార్దిక్ పాండ్యా, తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. అది విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
"నా దగ్గర ఫెరారీ కారు ఉన్నప్పటికీ.. నేను ప్రయాణంలో హనుమాన్ చాలీసానే వింటాను. దేవుడు నా పట్ల చాలా కరుణ చూపాడు. ఏ పాట ఇవ్వలేని పాజిటివ్ ఎనర్జీని హనుమాన్ చాలీసా ఇస్తుందని నేను బలంగా నమ్ముతాను. ఈ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు," అని హార్దిక్ పేర్కొన్నారు.
ఆయన ఈ మాట అనగానే హాల్ అంతా 'జై శ్రీరామ్' నినాదాలతో మారుమోగిపోయింది.
హార్దిక్ పాండ్యా చెప్పిన ఫెరారీ కారు గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
వివాదాలు.. విమర్శలు.. మలుపులు..
హార్దిక్ పాండ్యా కెరీర్ ఎప్పుడూ పూలబాటలా సాగలేదు. గతంలో 'కాఫీ విత్ కరణ్' షోలో చేసిన వ్యాఖ్యల వల్ల నిషేధాన్ని ఎదుర్కోవడం నుంచి, టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత తన గర్ల్‌ఫ్రెండ్‌తో పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్ ప్రదర్శించి విమర్శల పాలవ్వడం వరకు ఆయన చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లో వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ సమయంలో జాతీయ జెండాను అగౌరవపరిచారంటూ పుణెకు చెందిన ఒక లాయర్ ఆయనపై కేసు కూడా వేశారు.
ఐపీఎల్ సవాళ్లు - రోహిత్ శర్మ వారసత్వం..
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు! రోహిత్ శర్మను తొలగించి పాండ్యాకు బాధ్యతలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. 2024 సీజన్‌లో స్టేడియంలో ప్రేక్షకులు ఆయన్ని హేళన చేశారు. ఆ సీజన్‌లో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడం ఆయనపై ఒత్తిడిని మరింత పెంచింది.
అయితే, 2024 టీ20 వరల్డ్ కప్ విజయంలో హార్దిక్ పోషించిన కీలక పాత్రతో అభిమానుల మనసు మళ్లీ గెలుచుకోగలిగారు. గత ఏడాది ఐపీఎల్‌లో ముంబై ప్లే-ఆఫ్స్ చేరడంతో జట్టు మళ్లీ గాడిలో పడింది.
వచ్చే ఐపీఎల్ సీజన్ హార్దిక్‌కు చాలా కీలకం. ముంబై ఇండియన్స్‌కు ట్రోఫీని అందించి తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


