టాప్ స్పీడ్.. 250 కేఎంపీహెచ్, 3.8 సెకన్లలోనే 0-100! కొడుక్కి పాండ్యా ఇచ్చిన లగ్జరీ ఎస్యూవీ హైలైట్స్..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నటి నటాషా స్టాంకోవిచ్ విడిపోయినప్పటికీ, తమ కుమారుడు అగస్త్య సంతోషం కోసం కలిసి అడుగులు వేస్తున్నారు. ముంబైలో తన కుమారుడు, మాజీ భార్యకు హార్దిక్ ఒక విలాసవంతమైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా అందించాడు. ఈ లగ్జరీ ఎస్యూవీ విశేషాలు..
ల్యాండ్ రోవర్ డిఫెండర్.. ఈ లగ్జరీ ఎస్యూవీ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా! తన కుమారుడికి పాండ్యా ఈ రూ. 2.59 కోట్లు విలువ చేసే లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇవ్వడం, దానిని అతని మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ తీసుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో హార్డిక్ పాండ్యా గిఫ్ట్‌గా ఇచ్చిన ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
ల్యాండ్ రోవర్ డిఫెండర్- హార్దింక్ పాండ్యా ఖరీదైన గిఫ్ట్..
"మిస్టర్ హార్దిక్ పాండ్యా తన డిఫెండర్ కొనుగోలు కోసం మరోసారి నవనీత్ మోటార్స్‌ను ఎంచుకున్నారు. ఇది నమ్మకంతో కూడిన బంధం. ముంబైలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ డెలివరీ అయ్యింది. దీనిని అగస్త్య పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌లకు అందజేశాం. నాయకత్వం వహించే వారి కోసం ఇది ప్రత్యేకం," అని సదరు డీలర్షిప్షోరూం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ కార్యక్రమంలో చిన్నారి అగస్త్య ఆ నలుపు రంగు ఎస్‌యూవీని కుతూహలంగా పరిశీలిస్తుండగా, నటాషా స్టాంకోవిచ్ డీలర్‌షిప్ సిబ్బంది నుంచి గిఫ్ట్ హాంపర్‌ను స్వీకరించారు.
విడిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు ఇలాంటి మైలురాళ్లను పంచుకోవడం చర్చనీయాంశమైంది.
Tata Avinya EV : టాటా నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ- అవిన్య ఈవీ లాంచ్ ఎప్పుడంటే..
ల్యాండ్ రోవర్ డిఫెండర్ - ప్రత్యేకతలు:
ల్యాండ్ రోవర్ డిఫెండర్ తన వారసత్వానికి పేరుగాంచినప్పటికీ, ఆధునిక వెర్షన్లు అత్యాధునిక పనితీరును కలిగి ఉన్నాయి. వినియోగదారులు ఇందులో 2.0-లీటర్, 3.0-లీటర్ పెట్రోల్ ఇంజన్లతో పాటు 3.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
పవర్ ఫుల్ వేరియంట్: అత్యంత శక్తివంతమైన 'డిఫెండర్ ఆక్టా' వేరియంట్ బీఎండబ్ల్యూ నుంచి సేకరించిన 4.4-లీటర్ ట్విన్-టర్బో వీ8 మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 635 హెచ్‌పీ పవర్, 750 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.8 సెకన్లలోనే 0-100 కేఎంపీహెచ్ అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ.
ల్యాండ్ రోవర్ డిఫెండర్- ధరలు..
ప్రీమియం ఫీచర్లకు తగ్గట్టే ఈ లగ్జరీ ఎస్యూవీ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధరలు కూడా ఉన్నాయి. స్టాండర్డ్ వెర్షన్ ధరలు రూ. 1.26 కోట్ల నుంచి ప్రారంభం కాగా, టాప్ ఎండ్ 'ఆక్టా' వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.59 కోట్లుగా ఉంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్- ఇంటీరియర్, ఫీచర్లు..
డిఫెండర్ లోపలి భాగం విలాసానికి నిలయం అనే చెప్పుకోవాలి.
10- ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్.
మెరిడియన్ ప్రీమియం ఆడియో సిస్టమ్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు.
ల్యాండ్ రోవర్ డిఫెండర్- భద్రత..
సేఫ్టీ విషయంలో ఈ లగ్జరీ ఎస్‌యూవీకి తిరుగులేదు. 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, పార్కింగ్ సెన్సార్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లెదర్ అప్‌హోలిస్ట్రీ, రబ్బర్ ఫ్లోరింగ్‌తో దీని ఇంటీరియర్ ఎంతో దృఢంగా ఉంటుంది.
ప్రశ్నలు- సమాధానాలు:-
ప్రశ్న- . డిఫెండర్ 'ఆక్టా' వేరియంట్ ప్రత్యేకత ఏమిటి?
సమాధానం- డిఫెండర్ ఆక్టా అనేది ఈ సిరీస్‌లోనే అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన మోడల్. ఇందులో బీఎండబ్ల్యూ నుంచి సేకరించిన 4.4-లీటర్ వీ8 ఇంజన్‌ను అమర్చారు. ఇది కేవలం 3.8 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని ప్రత్యేకమైన '6డీ డైనమిక్స్' సస్పెన్షన్ టెక్నాలజీ వల్ల ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ రెండింటిలోనూ అద్భుతమైన నియంత్రణ ఉంటుంది.
ప్రశ్న- డిఫెండర్ కారు ఆఫ్-రోడింగ్ సామర్థ్యం ఎలా ఉంటుంది?
సమాధానం- ప్రపంచంలోని అత్యుత్తమ ఆఫ్-రోడర్లలో డిఫెండర్ ఒకటి. ఇది 900 ఎంఎం లోతు ఉన్న నీటిలో కూడా సులభంగా ప్రయాణించగలదు. ఇందులో ఉన్న ‘టెర్రైన్ రెస్పాన్స్’ సిస్టమ్ వల్ల ఇసుక, బురద, మంచు, రాళ్లపై ప్రయాణించేటప్పుడు కారు దానంతటదే సెట్టింగ్స్‌ను మార్చుకుంటుంది. దీని 'క్లియర్ సైట్ గ్రౌండ్ వ్యూ' కెమెరా ద్వారా కారు కింద ఉన్న భూభాగం ఎలా ఉందో కూడా డ్రైవర్ స్క్రీన్‌పై చూడవచ్చు.

E-Paper












