హనుమాన్ జయంతి స్పెషల్: ఈ 11 పనులు చేస్తే మీ ఇంటిపై ఆంజనేయుడి చలువ.. కష్టాలన్నీ పటాపంచల్!

Hanuman Jayanthi 2026: వైశాఖ బహుళ దశమి, పూర్వాభాద్ర నక్షత్రం కలసి వచ్చిన ఈరోజు హనుమాన్ జయంతి. ఈ పవిత్ర పర్వదినాన స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు చేయాల్సిన ఆ 11 ముఖ్యమైన పనులు మీకోసం. ఈరోజు హనుమాన్ జయంతి వేళ కచ్చితంగా ఇవి పాటించండి.

Published on: May 12, 2026, 07:20:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతీ ఏటా రెండుసార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. ఒకటి ఏప్రిల్ నెలలో రాగా, మరొకటి మే 12 అనగా ఈరోజు వచ్చింది. వైశాఖ బహుళ దశమి, పూర్వాభాద్ర నక్షత్రం ఉండడంతో హనుమాన్ జయంతిని ఈరోజు జరుపుకోవాలని పండితులు తెలిపారు. అయితే ఈ శుభప్రదమైన హనుమాన్ జయంతి నాడు ఈ పదింటిని కచ్చితంగా పాటించేటట్టు చూసుకోండి. ఈ పది పాటించడం వలన హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతోషంగా ఉండవచ్చు. కష్టాల నుంచి సులువుగా బయటపడొచ్చు.

హనుమాన్ జయంతి స్పెషల్: ఈ 11 పనులు చేస్తే మీ ఇంటిపై ఆంజనేయుడి చలువ.. కష్టాలన్నీ పటాపంచల్! (pinterest)
హనుమాన్ జయంతి స్పెషల్: ఈ 11 పనులు చేస్తే మీ ఇంటిపై ఆంజనేయుడి చలువ.. కష్టాలన్నీ పటాపంచల్! (pinterest)

ఈరోజు హనుమాన్ జయంతి వేళ కచ్చితంగా ఈ పది పాటించండి.. ఇక హనుమాన్ దయతో సంతోషంగా ఉండొచ్చు

1.బ్రహ్మ ముహూర్తంలో స్నానం

హనుమాన్ జయంతి నాడు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తం సమయంలో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పవిత్రతతో రోజును మొదలు పెట్టండి.

2.హనుమంతుడికి సింధూరం

హనుమంతుడికి సింధూరం అంటే మహా ప్రీతి. ఆలయంలో లేదా ఇంట్లో హనుమంతుడి విగ్రహానికి కచ్చితంగా సింధూరాన్ని సమర్పించండి.

3.హనుమాన్ చాలీసా పారాయణం

హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసాను భక్తితో చదవండి. భయాలు, అడ్డంకులు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు. హనుమాన్ చాలీసా చదవడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు.

4.శ్రీరామ నామ జపం

హనుమంతుడు శ్రీరాముని భక్తుడు కనుక శ్రీరామ నామాన్ని జపించండి. మనసు ప్రశాంతంగా మారుతుంది. సంతోషంగా ఉండవచ్చు. హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు కూడా లభిస్తాయి.

5.ఉపవాసం

హనుమాన్ జయంతి నాడు చాలా మంది ఉపవాసం చేస్తారు. పాలు, పండ్లు మాత్రమే తీసుకుని భక్తితో ఉపవాసం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది.

6.బెల్లం, వడమాల

హనుమంతుడికి ఈ రెండు చాలా ఇష్టం. వీటిని హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి. స్వామివారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది.

7.హనుమంతుని ఆలయానికి వెళ్లండి

హనుమాన్ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆలయంలో భజనల్లో పాల్గొనండి.

8.సుందరకాండ పారాయణం

హనుమాన్ జయంతి నాడు సుందరకాండను చదవడం వలన ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆనందంగా కూడా ఉండవచ్చు.

9.దానం

ఈరోజు హనుమాన్ జయంతి వేళ దానాలు చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. ఆహారం, పండ్లు, బట్టలు వంటివి దానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది.

10.కోతులకు ఆహారం

హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భావిస్తారు. ఈరోజు కోతులకు అరటిపండ్లు లేదా ఇతర ఆహార పదార్థాలను పెడితే శుభ ఫలితాలను చూడొచ్చు.

11.సాయంత్రం దీపారాధన

హనుమాన్ జయంతి నాడు సాయంత్రం పూట కూడా దీపారాధన చేయండి. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఈరోజు ప్రశాంతంగా ఉండి మంచి మాటలు మాట్లాడేలా చూసుకోండి. కోపం, అసూయ లాంటి భావాలను దూరంగా ఉంచండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More