పాడి పరిశ్రమ అంటే సాధారణంగా ఆవులు, గేదెల పెంపకం మాత్రమే గుర్తొస్తుంది. కానీ కాలం మారుతున్న కొద్దీ రైతులు, యువ పారిశ్రామికవేత్తలు వినూత్న మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇవి అధిక లాభాలను సైతం తెచ్చిపెడుతున్నాయి. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో మొట్టమొదటి గాడిద ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించారు. సంజీవ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలోని ‘డెయిరికా ఫామ్స్’ 12 గాడిదలతో ఈ కేంద్రాన్ని మొదలుపెట్టింది. త్వరలోనే వీటి సంఖ్యను 25కు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక్కడ ఉత్పత్తి చేసే గాడిద పాలను లీటరు రూ. 7,000 ధరకు విక్రయించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. చర్మ సంరక్షణ, సౌందర్య సాధనాలు, ఆరోగ్య ఉత్పత్తులను తయారు చేసే దేశీయ, అంతర్జాతీయ కంపెనీలకు ఈ పాలను సరఫరా చేయనున్నారు.
కిలో పాల పొడి రూ. 80 వేల వరకు.. ఎందుకంత డిమాండ్?

కండ్రోర్ గ్రామంలో నిర్వహించిన ‘డెయిరీ కాన్క్లేవ్ 2026’ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి రాజేశ్ ధర్మాణి ఈ కొత్త ఫామ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు కొత్త ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రైతులు సంప్రదాయ వ్యవసాయానికి తోడు భిన్నమైన ఆదాయ వనరులను అన్వేషించేందుకు ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
మార్కెట్లో సాధారణంగా లీటరు గాడిద పాలు రూ. 5,000 నుంచి రూ. 7,000 మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉంది. ద్రవ రూపంలోని పాల కంటే గాడిద పాల పొడి ధర మరింత ఎక్కువగా ఉంటుంది! నాణ్యతను బట్టి కిలో పాల పొడి రూ. 20,000 నుంచి ఏకంగా రూ. 80,000 వరకు పలుకుతోంది. ఖరీదైన కాస్మెటిక్స్, యాంటీ ఏజింగ్ క్రీములు, సబ్బుల తయారీలో గాడిద పాలను విరివిగా వాడటమే ఈ భారీ ధరకు కారణం.
గాడిత పాలతో ప్రయోజనాలెన్నో!
ఇక ఈ గాడిద పాలు తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. గాడిద పాలల్లో సజహమైన ఇసోజైమ్, లక్టోఫెర్రిన్, ఇమ్యునోగ్లోబ్యులిన్స్ వంటి బయోయాక్టివ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి మన ఇమ్యూన్ సిస్టెమ్ని బలంగా చేస్తాయి. ఆవు పాలతో పోల్చితే గాడిద పాలల్లో ఫ్యాట్, కొలొస్ట్రాల్లు తక్కువగా ఉంటాయి, విటమిన్ ఏ, డీ, ఈ బీ, కాల్షియం వంటివి మెండుగా ఉంటాయి.
అంతరించిపోతున్న 'స్పితి' జాతి సంరక్షణే లక్ష్యం
నివేదికల ప్రకారం.. డెయిరికా ఫామ్స్ ఇప్పటికే పాల ఉత్పత్తి, సేకరణ, విక్రయ వ్యాపారంలో చురుగ్గా కొనసాగుతోంది. భారతదేశంలో గాడిదల సంఖ్య వేగంగా తగ్గిపోతుండటాన్ని గమనించిన తర్వాతే ఈ వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందని సంస్థ సహ వ్యవస్థాపకురాలు సీరత్ తూర్ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన స్థానిక జాతి అయిన ‘స్పితి’ గాడిదలను పెంచి పోషించడంపై తాము ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆమె వివరించారు.
{{/usCountry}}నివేదికల ప్రకారం.. డెయిరికా ఫామ్స్ ఇప్పటికే పాల ఉత్పత్తి, సేకరణ, విక్రయ వ్యాపారంలో చురుగ్గా కొనసాగుతోంది. భారతదేశంలో గాడిదల సంఖ్య వేగంగా తగ్గిపోతుండటాన్ని గమనించిన తర్వాతే ఈ వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందని సంస్థ సహ వ్యవస్థాపకురాలు సీరత్ తూర్ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన స్థానిక జాతి అయిన ‘స్పితి’ గాడిదలను పెంచి పోషించడంపై తాము ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆమె వివరించారు.
{{/usCountry}}తమ సంస్థ ప్రస్తుతం ప్రతిరోజూ 2,700 లీటర్లకు పైగా పాలను సేకరిస్తోందని సంజీవ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. సొంత ఫామ్ నిర్వహించడమే కాకుండా, సమీప ప్రాంతాల్లోని పశుపోషకులతో కలిసి పనిచేస్తూ వారికి అండగా నిలుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గాడిదల పెంపకానికి రూ. 50 లక్షల వరకు ప్రభుత్వ సబ్సిడీ!
ఇలాంటి వినూత్న పశుసంవర్ధక కేంద్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం అందిస్తోంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ గతంలో విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పశువుల ప్రజనన కేంద్రాలను ప్రారంభించాలనుకునే వారికి గరిష్టంగా రూ. 50 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. గొర్రెలు, మేకలు, పందులు, ఒంటెలు, గుర్రాలతో పాటు గాడిదల ఫామ్‌ల ఏర్పాటుకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది.
ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 2,672.65 కోట్ల విలువైన 3,843 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటికి మంజూరైన మొత్తం సబ్సిడీ రూ. 1,233.69 కోట్లుగా ఉంది. ఆమోదం పొందిన ప్రాజెక్టులలో 2,014 కేంద్రాలకు కేంద్రం ఇప్పటికే మొదటి విడత సబ్సిడీ కింద రూ. 354.06 కోట్లు అందించింది. సరైన ప్రణాళిక, ప్రభుత్వ రాయితీలను వినియోగించుకుంటే గాడిదల పెంపకం లాంటి విభిన్న రంగాల్లోనూ అద్భుతమైన లాభాలు సాధించవచ్చని డెయిరికా ఫామ్స్ నిరూపిస్తోంది.
ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.