...
...
...
Next StoryDown Arrow

Health test : ప్రస్తుత బాడీతో మీరు ఎంత కాలం బతికుండగలరు? ఈ సింపుల్​ ‘టెస్ట్’తో అంచనా!

30 Second Chair Stand Test : ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు జీవించాలంటే కేవలం డైట్, నిద్ర మాత్రమే సరిపోవు.. శరీరంలో కండరాల బలం కూడా అంతే ముఖ్యం. కేవలం 30 సెకన్ల పాటు చేసే ఒక చిన్న కుర్చీ పరీక్ష ద్వారా మీ శారీరక దృఢత్వాన్ని, ఆయుష్షును అంచనా వేయవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.

Published on: May 15, 2026 02:01 pm IST
Advertisement

Healthy lifestyle : సాధారణంగా సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితం అనగానే మనమంతా మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన నిద్ర లేదా హెల్త్ చెకప్‌ల గురించే ఆలోచిస్తాము. కానీ, మీరు ఒక కుర్చీలోంచి 30 సెకన్ల పాటు ఎన్నిసార్లు లేచి కూర్చోగలరనే చిన్న పరీక్ష.. మీ ఆరోగ్యం, ఆయుష్షు గురించి ఎన్నో కీలక విషయాలను చెబుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు!

5,000 మంది మహిళలపై పరిశోధన..

మీరు ఎంత ఫిట్​గా ఉన్నారు?

ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లోని 'యూనివర్సిటీ ఎట్ బఫెలో' పరిశోధకులు 63 నుంచి 99 ఏళ్ల మధ్య వయసున్న 5,000 మందికి పైగా మహిళలపై ఒక ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. ఇందులో వారి చేతి పట్టు (Grip Strength), లోయర్-బాడీ (నడుము కింది భాగం) బలాన్ని పరీక్షించారు. ఈ పరిశోధనలో శారీరకంగా మంచి దృఢత్వం, కండరాల బలం ఉన్న మహిళల్లో.. తర్వాతి ఎనిమిదేళ్ల కాలంలో మరణించే ప్రమాదం చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. వారి రోజువారీ వ్యాయామాలు, ఫ్యాట్ లెవల్స్ ఎలా ఉన్నప్పటికీ, కేవలం కండరాల బలం మాత్రమే వారిని ఎక్కువ కాలం జీవించేలా చేసిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

వయసు పైబడుతున్న కొద్దీ శరీరంలో కండరాల బలం తగ్గడం అనేది కేవలం ఫిట్‌నెస్ సమస్య మాత్రమే కాదు, అది మీ సంపూర్ణ ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి ఒక సంకేతం అని దీని ద్వారా తేలింది.

భారతదేశంలో ఈ పరిశోధన ఫలితాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్' నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో లక్షలాది మంది వృద్ధ మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గడం వల్ల వీరు త్వరగా అలసిపోవడం, కిందపడటం, ఎముకలు విరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అందువల్ల స్వతంత్రంగా, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి కండరాల బలం ఎంతో అవసరం.

అసలేంటి ఈ 30-సెకన్ల కుర్చీ పరీక్ష?

ఈ పరీక్ష అందరికీ సురక్షితమే అయినప్పటికీ, ఇప్పటికే కీళ్ల నొప్పులు, తీవ్రమైన మోకాళ్ల సమస్యలు, ఆర్థరైటిస్, లేదా ఇటీవల సర్జరీలు అయినవారు వైద్యుల సలహా లేకుండా దీనిని ప్రయత్నించవద్దు. అలాగే 40 ఏళ్లు పైబడిన వారు లేదా నిలబడేటప్పుడు కాస్త కళ్లు తిరిగినట్లు అనిపించే వారు పక్కన ఎవరైనా సహాయకులను ఉంచుకోవడం మంచిది.

కండరాల బలాన్ని పెంచుకోవడం ఎలా?

వృద్ధాప్యంలో కండరాలను కాపాడుకోవడానికి భారీ వర్కౌట్లు అవసరం లేదు. ప్రతిరోజూ కాసేపు నడవడం, యోగా, లైట్ రెసిస్టెన్స్ వ్యాయామాలు, స్క్వాట్స్ (బాడీ వెయిట్ వ్యాయామాలు) చేయడం, ఆహారంలో పప్పులు, గుడ్లు, పనీర్ వంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ద్వారా కండరాల బలాన్ని పెంచుకోవచ్చు.

గుర్తుంచుకోండి, ఈ పరీక్ష మీ ఆయుష్షును ఖచ్చితంగా లెక్కగట్టేది కాదు.. కానీ మీ శారీరక ఆరోగ్యం క్షీణిస్తోందని హెచ్చరించే ఒక అలారమ్ లాంటిది!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Subscribe Now!