తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో జనం దాహార్తిని తీర్చుకోవడానికి చల్లటి నీటి కోసం వెతుకుతున్నారు. శరీరాన్ని వేడి నుంచి కాపాడుకోవడానికి, శక్తిని తిరిగి పుంజుకోవడానికి నీరు తాగడం అత్యవసరం. అయితే, చల్లటి నీటి కోసం మన ముందు ఉన్న రెండు ప్రధాన ఎంపికలు.. ఆధునిక ఫ్రిజ్ వాటర్, రెండోది సంప్రదాయ మట్టి కుండ నీరు. వీటిలో ఏది మన ఆరోగ్యానికి శ్రేయస్కరం?

కేవలం చల్లదనం కోసమే అయితే ఫ్రిజ్ నీరు ఓకే అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలిక ఆరోగ్యం, జీర్ణక్రియను పరిగణనలోకి తీసుకుంటే మట్టి కుండ నీరే మేలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మట్టి కుండ: ప్రకృతి అందించిన 'నేచురల్ ఏసీ'
మట్టి కుండలో నీరు చల్లబడటం వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రక్రియ ఉంది. కుండకు ఉండే అతి సూక్ష్మమైన రంధ్రాల ద్వారా నీరు నెమ్మదిగా బయటకు వచ్చి ఆవిరవుతుంది. ఈ ఎవాపరేటివ్ కూలింగ్ ప్రక్రియ వల్ల కుండలోని నీరు సహజ సిద్ధంగా, తాగడానికి వీలైనంత చల్లగా మారుతుంది.
"మట్టి కుండలోని నీరు తాగడం వల్ల గొంతుకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఫ్రిజ్ నీళ్లు తాగినప్పుడు వచ్చే జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఇందులో ఉండవు," అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
మట్టి కుండ నీటితో లభించే అద్భుత ప్రయోజనాలు..
pH బ్యాలెన్స్: మట్టి సహజంగానే క్షార గుణాన్ని (ఆల్కలైన్) కలిగి ఉంటుంది. మనం తాగే నీటిలోని ఆమ్ల గుణాలను (ఎసిడిటీ) ఇది తటస్థీకరిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
ఖనిజాల నిధి: మట్టి కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి సహజ ఖనిజాలు నీటిలో చేరుతాయి. ఇది శరీర మెటబాలిజంను పెంచుతుంది.
రసాయనాలు లేని శుద్ధ జలం: ఫ్రిజ్‌లో నీటిని నిల్వ చేయడానికి మనం ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లను వాడుతుంటాం. వీటివల్ల బీపీఏ వంటి ప్రమాదకర రసాయనాలు శరీరంలోకి చేరే అవకాశం ఉంది. మట్టి కుండ వాడితే ఈ ముప్పు ఉండదు.
ఫ్రిజ్ నీళ్లతో పొంచి ఉన్న ముప్పు..
{{/usCountry}}రసాయనాలు లేని శుద్ధ జలం: ఫ్రిజ్‌లో నీటిని నిల్వ చేయడానికి మనం ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లను వాడుతుంటాం. వీటివల్ల బీపీఏ వంటి ప్రమాదకర రసాయనాలు శరీరంలోకి చేరే అవకాశం ఉంది. మట్టి కుండ వాడితే ఈ ముప్పు ఉండదు.
ఫ్రిజ్ నీళ్లతో పొంచి ఉన్న ముప్పు..
{{/usCountry}}చాలా చల్లగా ఉండే ఫ్రిజ్ నీటిని తాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ మందగించడమే కాకుండా, మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలు గడ్డకట్టి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ముఖ్యంగా ఎండలో నుంచి రాగానే నేరుగా ఫ్రిజ్ నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు వచ్చి 'థర్మల్ షాక్' తగిలే ప్రమాదం ఉంది. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరిచి తరచూ జలుబు, దగ్గు రావడానికి కారణమవుతుంది.
కుండను ఇలా శుభ్రం చేయండి..
మట్టి కుండలోని నీరు ఆరోగ్యంగా ఉండాలంటే దాని నిర్వహణ కూడా ముఖ్యం. కనీసం వారానికి ఒకసారి మృదువైన బ్రష్‌తో కుండను లోపల, బయట శుభ్రం చేయాలి. కడిగిన తర్వాత ఎండలో ఆరబెట్టడం వల్ల బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. పాత కుండల కంటే ప్రతి వేసవికి కొత్త కుండను కొనుగోలు చేయడం వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటుంది.
ఫ్రిజ్ నీరు తక్షణ ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, ఆరోగ్య పరంగా మట్టి కుండ నీరే అత్యుత్తమం. మన పూర్వీకులు అనుసరించిన ఈ సంప్రదాయ పద్ధతిని పాటిస్తే ఎండల నుంచి రక్షణ పొందడమే కాకుండా ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.