మైగ్రేన్ అనగానే చాలామంది దానిని కేవలం ఒక తీవ్రమైన తలనొప్పిగానే భావిస్తుంటారు. కానీ ఇది తలనొప్పికి మాత్రమే పరిమితం కాదు. ఇదొక సంక్లిష్టమైన నాడీ వ్యవస్థ (న్యూరోలాజికల్) రుగ్మత! తలలో ఒకవైపు భరించలేని నొప్పితో పాటు గుండె తీవ్రంగా కొట్టుకున్నట్లు అనిపించడం, వాంతులు రావడం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం వంటివి మైగ్రేన్ ప్రధాన లక్షణాలు. అప్పుడప్పుడు వచ్చే మైగ్రేన్‌ను మందులు, జీవనశైలి మార్పులతో నియంత్రించవచ్చు.కానీ నొప్పి తరచూ వస్తున్నా లేదా రోజురోజుకూ పెరుగుతున్నా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మైగ్రేన్ ఎందుకు వస్తుంది? దాని ముప్పు సంకేతాలు ఏంటి? అనే విషయాలపై ఆరోగ్య నిపుణులు కీలక విషయాలను పంచుకున్నారు.
మైగ్రేన్ అటాక్‌కి దారితీసే ప్రధాన కారణాలు..
మన నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అంశాలే మైగ్రేన్ నొప్పిని తీవ్రతరం చేస్తాయని డాక్టర్ బత్రా తెలిపారు. ముఖ్యంగా:
- నిద్రలేమి, డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం)
- వేళకు ఆహారం తీసుకోకపోవడం, సమయం దాటాక తినడం
- తీవ్రమైన మానసిక ఒత్తిడి, హార్మోన్ల హెచ్చుతగ్గులు
- గంటల తరబడి స్క్రీన్ (ఫోన్/ల్యాప్‌టాప్) చూడటం
వీటితో పాటు ప్రాసెస్ చేసిన మాంసం, నిల్వ ఉంచిన చీజ్, మద్యం, పరిమితికి మించి కాఫీ తాగడం కూడా కొందరిలో మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి.
చిట్కా: మైగ్రేన్ అటాక్‌ని అంచనా వేయడానికి ఒక "డైరీ" నిర్వహించడం మంచిది. తలనొప్పి ఎప్పుడు వస్తుంది, దాని తీవ్రత ఎంత, ఎంతసేపు ఉంటుంది, ఆ సమయంలో మీరు తీసుకున్న ఆహారం, నిద్ర వేళలు, ఒత్తిడి స్థాయిలను నమోదు చేసుకోవడం ద్వారా మీకు ఏ అంశాల వల్ల నొప్పి వస్తుందో గుర్తించవచ్చు. ఇది వైద్యులకు సరైన చికిత్స అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
జీవనశైలి మార్పులతో చెక్ పెట్టండి!
రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మైగ్రేన్ తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు:
- తగినంత నీరు తాగడం, వేళకు భోజనం చేయడం.
- రోజుకి 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం.
అయితే, వైద్యుల సలహా లేకుండా తరచూ పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణ మందులు) వాడకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నొప్పి మాత్రలను పరిమితికి మించి వాడితే 'మెడికేషన్-ఓవర్ యూజ్ హెడేక్స్' (మందుల వల్ల వచ్చే తలనొప్పి) సమస్య వచ్చి, మైగ్రేన్ మరింత తరచుగా, తీవ్రంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
అత్యవసర వైద్య సాయం ఎప్పుడు లభించాలి?
{{/usCountry}}అయితే, వైద్యుల సలహా లేకుండా తరచూ పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణ మందులు) వాడకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నొప్పి మాత్రలను పరిమితికి మించి వాడితే 'మెడికేషన్-ఓవర్ యూజ్ హెడేక్స్' (మందుల వల్ల వచ్చే తలనొప్పి) సమస్య వచ్చి, మైగ్రేన్ మరింత తరచుగా, తీవ్రంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
అత్యవసర వైద్య సాయం ఎప్పుడు లభించాలి?
{{/usCountry}}సాధారణంగా మైగ్రేన్ ప్రాణంతకం కానప్పటికీ, కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే అత్యవసర వైద్య చికిత్స పొందాలి:
- అకస్మాత్తుగా, ఊహించని రీతిలో తీవ్రమైన తలనొప్పి రావడం
- కాళ్లు లేదా చేతుల్లో బలహీనత, గందరగోళం చెందడం
- మాట్లాడటంలో ఇబ్బంది లేదా చూపు మసకబారడం
- తలనొప్పితో పాటు జ్వరం, ఫిట్స్ (మూర్ఛ) రావడం
- తలకు ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత తలనొప్పి ప్రారంభమవడం
ఈ లక్షణాలు కేవలం మైగ్రేన్ కాకుండా ఇతర తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. కాబట్టి వీటిని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
ఎంఆర్‌ఐ లేదా సీటీ స్కాన్ ఎప్పుడు అవసరం?
తరచూ మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు సరైన మూల కారణాన్ని తెలుసుకోవడానికి నిపుణులైన వైద్యుడిని సంప్రదించాలి. మెదడుకు సంబంధించిన ఇతర తీవ్ర రుగ్మతలను మినహాయించడానికి కొందరిలో మాత్రమే ఎంఆర్‌ఐ లేదా సీటీ స్కాన్ వంటి పరీక్షలను వైద్యులు సిఫార్సు చేస్తారు. అయితే మైగ్రేన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పరీక్షలు అవసరం లేదని డాక్టర్ బత్రా స్పష్టం చేశారు.
ముఖ్యంగా:
తలనొప్పి హఠాత్తుగా, తీవ్రమైన పేలుడులా మొదలైనా
రోజురోజుకూ నొప్పి తీవ్రత పెరుగుతూ ఉన్నా
50 ఏళ్లు దాటిన తర్వాత మొదటిసారి తలనొప్పి సమస్య ఎదురైనా
తక్షణమే న్యూరోలాజికల్ పరీక్షలు చేయించుకోవాలి.
ప్రస్తుతం అధునాతన నివారణ మందులు, కొత్త ‘సీజీఆర్‌పీ ఇన్హిబిటర్స్’, జీవనశైలి మార్పుల ద్వారా మైగ్రేన్ మేనేజ్‌మెంట్ ఎంతో సులభతరమైంది. ముందస్తు నిర్ధారణ ద్వారా తీవ్ర సమస్యల నుంచి బయటపడటమే కాకుండా అనవసరమైన ఆసుపత్రి పరీక్షల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు.