Heatwave Headache Relief : వేసవి వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదే పరిస్థితులు ఉన్నాయి. వడగాల్పుల పట్ల ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎండలు ముదురుతున్న కొద్దీ కేవలం వడదెబ్బ మాత్రమే కాదు…. తీవ్రమైన మైగ్రేన్ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో వేసవి మైగ్రేన్‌లను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా నివారించాలనే అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం. మైగ్రేన్ అంటే కేవలం ఒక సాధారణ తలనొప్పి మాత్రమే కాదు, అది ఒక తీవ్రమైన నాడీ సంబంధిత రుగ్మత అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మెదడులోని నాడీ వ్యవస్థ తీవ్రంగా స్పందిస్తుంది. కాన్పూర్‌లోని రీజెన్సీ హెల్త్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ రూపాలి మెహ్రోత్రా దీని గురించి వివరిస్తూ.. మెదడు యొక్క థర్మోరెగ్యులేషన్ ప్రక్రియే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. "బాహ్య ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, శరీరం ఆ వేడిని తగ్గించుకోవడానికి మెదడులోని రక్త నాళాలను విస్తరింపజేస్తుంది. దీనినే వాసోడైలేషన్ (Vasodilation) అంటారు. మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో… ఈ ప్రక్రియ మెదడులోని సున్నితమైన నరాల చివరలను ప్రేరేపిస్తుంది, ఫలితంగా భరించలేని నొప్పి మొదలవుతుంది" అని ఆమె వివరించారు.
వేసవిలో మైగ్రేన్ రావడానికి 'డీహైడ్రేషన్' ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. శరీరంలో ఉండాల్సిన నీటి మట్టం కేవలం 2 శాతం తగ్గినా…. అది మెదడు కణజాలంపై ఒత్తిడి పెంచుతుంది. మెదడు కణజాలం పుర్రె భాగం నుంచి స్వల్పంగా వెనక్కి లాగబడటం వల్ల నొప్పి గ్రాహకాలు యాక్టివేట్ అవుతాయి. దీనికి తోడు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఉండే తీవ్రమైన సూర్యరశ్మి నేరుగా కంటిపై పడటం వల్ల కూడా మెదడులోని విజువల్ కార్టెక్స్ అతిగా ప్రేరేపితమై మైగ్రేన్ దాడికి దారితీస్తుంది. దీంతో నిద్రలేమి సమస్య ఏర్పడటంతో పాటు ఇతర సమస్యలు వస్తుంటాయి.
చాలామంది సాధారణ తలనొప్పిని మైగ్రేన్ అని తప్పుగా భావిస్తుంటారు. మైగ్రేన్ వచ్చే ముందు అలసట, మూడ్ స్వింగ్స్, మెడ పట్టేయడం వంటి లక్షణాలు 12 నుండి 24 గంటల ముందే కనిపిస్తాయి. దీనిని 'ప్రోడ్రోమ్' అంటారు. నొప్పి సాధారణంగా తలకి ఒక పక్కన మాత్రమే వస్తుంది. అదే నిర్జలీకరణ వల్ల వచ్చే తలనొప్పి అయితే తల మొత్తం భారంగా అనిపిస్తుంది, నీరు తాగితే తగ్గుతుంది. కానీ మైగ్రేన్ వచ్చినప్పుడు కేవలం నీరు తాగితే సరిపోదు అని డాక్టర్ మెహ్రోత్రా వివరించారు.
{{/usCountry}}చాలామంది సాధారణ తలనొప్పిని మైగ్రేన్ అని తప్పుగా భావిస్తుంటారు. మైగ్రేన్ వచ్చే ముందు అలసట, మూడ్ స్వింగ్స్, మెడ పట్టేయడం వంటి లక్షణాలు 12 నుండి 24 గంటల ముందే కనిపిస్తాయి. దీనిని 'ప్రోడ్రోమ్' అంటారు. నొప్పి సాధారణంగా తలకి ఒక పక్కన మాత్రమే వస్తుంది. అదే నిర్జలీకరణ వల్ల వచ్చే తలనొప్పి అయితే తల మొత్తం భారంగా అనిపిస్తుంది, నీరు తాగితే తగ్గుతుంది. కానీ మైగ్రేన్ వచ్చినప్పుడు కేవలం నీరు తాగితే సరిపోదు అని డాక్టర్ మెహ్రోత్రా వివరించారు.
{{/usCountry}}మైగ్రేన్ సమస్య వచ్చినప్పుడు రోగిని మొదట చల్లని, చీకటిగా ఉండే నిశ్శబ్ద గదిలో ఉంచాలని డాక్టర్ మెహ్రోత్రా సూచిస్తున్నారు. ఎలక్ట్రోలైట్స్ కలిపిన నీటిని అందించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. "ప్రారంభ దశలోనే రిప్టాన్స్ వంటి మందులు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే నాప్రోక్సెన్ సోడియం వంటి ఎన్ఎస్ఏఐడి (NSAIDs) మందులు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి" అని ఆమె పేర్కొన్నారు.
- ప్రతిరోజూ కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి.
- పగటిపూట ఎండలో తిరగడం తగ్గించుకోవాలి.
- భోజనాన్ని ఎప్పుడూ స్కిప్ చేయకూడదు.
- పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి.
- యువీ ప్రొటెక్షన్ ఉన్న సన్ గ్లాసెస్ మరియు వదులైన దుస్తులు ధరించాలి.
తలనొప్పితో పాటు జ్వరం రావడం, మెడ బిగదీసుకుపోవడం, గందరగోళంగా అనిపించడం లేదా అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడం వంటివి జరిగితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇవి సాధారణ మైగ్రేన్ లక్షణాలు కాకపోవచ్చు… ఇతర తీవ్రమైన సమస్యలకు సంకేతాలు కావొచ్చని డాక్టర్డాక్టర్ రూపాలి మెహ్రోత్రా వివరించారు. .