Personality Development : ఆంజనేయుడి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు

Personality Development : హనుమంతుడి నుంచి ప్రతి ఒక్కరూ చాలా విషయాలు నేర్చుకోవాలి. ఒక పనిపై నిబద్ధతగా ఉండటమే కాకుండా.. మనల్ని నమ్మినవారికి కష్టం వస్తే ఎలా నిలబడాలో కూడా ఆంజనేయుడి నుంచి తీసుకోవాలి.

Published on: May 12, 2026, 10:04:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హనుమంతుడు కేవలం ఒక పురాణ పురుషుడు మాత్రమే కాదు, నేటి కాలానికి కూడా సరిపోయే అద్భుతమైన మేనేజ్‌మెంట్ పాఠాలకు, వ్యక్తిత్వ వికాసానికి (Personality Development) నిలువెత్తు నిదర్శనం. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, జీవిత సత్యాలు ఇక్కడ ఉన్నాయి.

హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు

అచంచలమైన భక్తి, అంకితభావం

హనుమంతుడు రామకార్యం పట్ల చూపిన అంకితభావం అద్భుతం. లంకలో సీతమ్మను వెతకడం నుంచి, లక్ష్మణుడి ప్రాణ రక్షణ కోసం సంజీవని పర్వతాన్ని మోసుకురావడం వరకు ఆయన ఎక్కడా అలసట చెందలేదు.

మనం చేసే పని చిన్నదైనా, పెద్దదైనా దాని పట్ల పరిపూర్ణమైన అంకితభావంతో ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం.

సమయస్ఫూర్తి, తెలివితేటలు

సముద్రాన్ని దాటేటప్పుడు సురస అనే రాక్షసి ఎదురైనప్పుడు, హనుమంతుడు తన రూపం పెంచి, చివరగా చిన్నగా మారి ఆమె నోటిలోకి వెళ్లి బయటకు వస్తాడు. ఇక్కడ ఆయన బలాన్ని కాకుండా తెలివితేటలను ఉపయోగించాడు.

ప్రతి సమస్యను శక్తితోనే పరిష్కరించలేం. కొన్నిసార్లు పరిస్థితులకు అనుగుణంగా మన వ్యూహాన్ని మార్చుకోవాలి. తెలివిగా వ్యవహరించాలి. అవతలివారిని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కూడా చేయాలి.

వినయం - అసలైన ఆభరణం

అపారమైన శక్తులు ఉన్నా, ఆంజనేయుడు ఎప్పుడూ తనను తాను కేవలం 'రామ సేవకుడి'గానే చెప్పుకున్నాడు. లంకలో రావణుడి ఎదుట నిలబడినప్పుడు కూడా ఆయన గర్వం ప్రదర్శించలేదు.

మనకు ఎంతటి అధికారం, సంపద వచ్చినా వినయం వీడకూడదు. అహంకారం లేని చోటే జ్ఞానం వృద్ధి చెందుతుంది. అంతేకాదు అందరికీ మీరు నచ్చుతారు.

కమ్యూనికేషన్ స్కిల్స్

హనుమంతుడు సీతమ్మతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా పదాలను ఎంచుకుంటాడు. రామలక్ష్మణులను మొదటిసారి కలిసినప్పుడు ఆయన మాట్లాడిన తీరు చూసి రాముడు ముగ్ధుడై, "ఈయన గొప్ప వ్యాకరణ వేత్త" అని కొనియాడతాడు.

ఎదుటివారి మనసు నొప్పించకుండా, స్పష్టంగా, మర్యాదగా మాట్లాడటం గొప్ప నాయకత్వ లక్షణం. ఇదే అందరినీ మీకు దగ్గరగా చేస్తుంది.

నాయకత్వం

వానర సైన్యంతో కలిసి పని చేసేటప్పుడు ఆయన అందరినీ ప్రోత్సహిస్తాడు. తాను గొప్పవాడినని కాకుండా, అందరినీ కలుపుకొనిపోతాడు. అందరం కలిసి పనిచేస్తేనే ముందుకుసాగుతాం అని భరోసా ఇస్తాడు.

ఒక గొప్ప విజయం వెనుక సమిష్టి కృషి ఉంటుంది. నలుగురిని కలుపుకొనిపోయేవారే నిజమైన నాయకులు అని హనుమంతుడి ద్వారా అర్థమవుతుంది..

హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద సత్యం ఏమిటంటే.. నమ్మకం, ప్రయత్నం తోడైతే అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఆయన తన శక్తులను ఇతరుల మేలు కోసం, ధర్మ రక్షణ కోసం ఉపయోగించాడు. మనం కూడా మన సామర్థ్యాన్ని సమాజ హితం కోసం ఉపయోగిస్తే మన జీవితం సార్థకమవుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More