'అమ్మో, ఈ షాపింగ్, మేకప్ అంతా నాకెందుకు! నేను మిగతా అమ్మాయిల్లాంటిదాన్ని కాదు. నేను అబ్బాయిలతో తిరగడానికే ఇష్టపడతాను. వాళ్లదే నిజమైన స్నేహం. కనీసం వాళ్ల దగ్గర అమ్మాయిల గొడవలు ఉండవు కదా.' ఇలాంటి మాటలు వినే ఉంటారు కదా. మీ కాలేజీ, ఆఫీసు, లేదా స్నేహితుల్లో ఎప్పుడైనా ఎవరైనా ఇలా అనడం విన్నారా? ఇన్‌స్టాగ్రామ్ లేదా యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇలాంటి రీల్‌ను చూశారా?

ఈ రోజుల్లో ఈ పదం ఇంటర్నెట్‌లో వేగంగా వ్యాపిస్తోంది, మీమ్ చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అసలు ఈ పిక్-మీ-గర్ల్ అంటే ఏమిటి? ఇది ఒక వ్యక్తిగత ఆప్షన్ ఆ? మరి జనాలకు ఎందుకు వీరిని ఈ కాలంలో వెరైటీగా చూడటం మెుదలుపెట్టారు.
పిక్-మీ-గర్ల్.. అంటే తాను అందరికన్నా భిన్నమైనదానినని, ఉత్తమమైనదానినని నిరూపించుకోవడానికి ప్రయత్నించే అమ్మాయి లేదా స్త్రీ. ఆమె ఎక్కువగా వాడే మాట ఏంటో తెలుసా.. నేను ఇతర అమ్మాయిల్లాంటిదాన్ని కాదు.
Pick me girl అనే పదానికి అర్థం, ఒక అమ్మాయి అబ్బాయిల దృష్టిని ఆకర్షించడానికి లేదా వారి మెప్పు పొందడానికి ఇతర అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడటం లేదా తాను మిగిలిన అమ్మాయిల కంటే చాలా భిన్నమైనదాన్ని అని నిరూపించుకోవడానికి ప్రయత్నించడం.
సాధారణంగా ఈ రకమైన అమ్మాయిలు అబ్బాయిల గ్రూపులో నేను మిగిలిన అమ్మాయిలలా కాదు (I'm not like other girls) అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అబ్బాయిల దగ్గర మంచి మార్కులు కొట్టేయడమే వీరి ప్రధాన ఉద్దేశం.
ఇతర అమ్మాయిలను విమర్శించడం
"అమ్మాయిలకు మేకప్ అంటే పిచ్చి, నాకు అసలు మేకప్ అంటేనే నచ్చదు" లేదా "అమ్మాయిలు ఎప్పుడూ డ్రామా చేస్తారు, అందుకే నాకు అబ్బాయిల ఫ్రెండ్షిప్ అంటేనే ఇష్టం" అని చెబుతుంటారు.
అబ్బాయిల అలవాట్లను ఇష్టపడటం
అబ్బాయిలు ఇష్టపడే వీడియో గేమ్స్, స్పోర్ట్స్ లేదా బైక్స్ గురించి తమకు అస్సలు తెలియకపోయినా, కేవలం వారిని ఆకట్టుకోవడానికి వాటిపై విపరీతమైన ఆసక్తి ఉన్నట్లు నటిస్తారు.
చాలా సింపుల్
{{/usCountry}}అబ్బాయిలు ఇష్టపడే వీడియో గేమ్స్, స్పోర్ట్స్ లేదా బైక్స్ గురించి తమకు అస్సలు తెలియకపోయినా, కేవలం వారిని ఆకట్టుకోవడానికి వాటిపై విపరీతమైన ఆసక్తి ఉన్నట్లు నటిస్తారు.
చాలా సింపుల్
{{/usCountry}}ఇతర అమ్మాయిలు ఖరీదైన బట్టలు, ఫ్యాషన్ వెంట పడతారని, తాను మాత్రం చాలా సాధారణంగా ఉంటానని పదే పదే ప్రదర్శిస్తారు. వేరే అమ్మాయిల్లా మేకప్‌లకు అంత ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదంటారు.
ఎందుకు ఇలా అంటారు?
సోషల్ మీడియాలో (Instagram, TikTok) ఈ పదం బాగా వైరల్ అయింది. ఎవరైనా అమ్మాయి అబ్బాయిల అటెన్షన్ కోసం తన సొంత జెండర్ తక్కువ చేసి చూపిస్తే, నెటిజన్లు ఆమెను 'Pick me girl' అని పిలుస్తారు.
ఉదాహరణకు ఒక 'పిక్-మీ-గర్ల్' ఉద్దేశపూర్వకంగా 'నాకు నిజంగా మేకప్ వేసుకోవడం లేదా షాపింగ్‌కు వెళ్లడం ఇష్టం లేదు," లేదా 'అమ్మాయిల స్నేహాలు చాలా నాటకీయంగా ఉంటాయి, అందుకే నాకు అబ్బాయి స్నేహితులు మాత్రమే ఉన్నారు' వంటి మాటలు చెబుతుంది. ఇతర మహిళల కంటే తాను కూల్‌గా లేదా తెలివైనదానిగా కనిపించడమే ఆమె ఉద్దేశం.
దీనిని అంతర్గత స్త్రీ ద్వేషం అని కూడా పలువురు అంటున్నారు. ఇతర స్త్రీల పట్ల పెంచుకునే ద్వేషం లేదా పక్షపాతంగా చెప్పవచ్చు. అమ్మాయిలందరూ ఒకేలా ఉంటారు, కేవలం గొడవలు సృష్టిస్తారు అనే భావన తప్పు.
ప్రతీదాన్నీ ట్రోల్ చేయడం సరికాదు
నాణానికి రెండు వైపులా ఉంటాయి. ఈ రోజుల్లో 'పిక్-మీ-గర్ల్' అనే పదం ఆన్‌లైన్‌లో కూడా దుర్వినియోగం అవుతోంది. ఒక అమ్మాయికి నిజంగా వీడియో గేమ్స్ ఆడటం ఇష్టమైతే, క్రీడల పట్ల మక్కువ ఉంటే, లేదా నిజంగా మేకప్ వేసుకోవడం ఇష్టం లేకపోతే, ఇంటర్నెట్‌లోని జనాలు ఆమెను 'పిక్-మీ-గర్ల్' అని పిలుస్తూ ట్రోల్ చేయడం మొదలుపెడతారు. ఇది కూడా అంతే తప్పు. వేర్వేరు అభిరుచులు కలిగి ఉండటం చెడ్డ విషయం కాదు. మీ అభిరుచులు ఇతరుల అభిరుచుల కంటే గొప్పవని భావించి వారిని కించపరచడమే చెడ్డ విషయం.
ప్రతి ఒక్కరినీ వారికి నచ్చినది చేయనివ్వడంలోనే నిజమైన స్వేచ్ఛ ఉంది. ఒక అమ్మాయికి హైహీల్స్ ఇష్టం కావచ్చు, మరొకరికి స్నీకర్స్ ఇష్టం కావచ్చు, రెండూ సరైనవే. తాము ప్రత్యేకమైనవారమని భావించడం కోసం మరొకరిని కించపరచడం లేదా అవమానించడం ఎప్పటికీ మీకు, సమాజానికి అస్సలు మంచిది కాదు.