ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, స్టార్టప్‌లు.. ఇలా అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ నగరం దూసుకుపోతోంది. కొత్త ఉద్యోగాలు, సరికొత్త అవకాశాలతో యువత ఇటువైపు పెద్ద ఎత్తున తరలివస్తోంది. ఇదంతా ఆర్థిక వ్యవస్థకు ఎంతో శుభపరిణామమే. కానీ, ప్రతిరోజూ ఆసుపత్రి ఓపీడీలో మేం చూస్తున్న మరో చేదు నిజం ఏమిటంటే.. వర్క్ కల్చర్‌లో ఉన్న తీవ్రమైన ఒత్తిడి, అనుసరిస్తున్న జీవనశైలి కారణంగా వారి ఆరోగ్యం దెబ్బతింటోంది.

ఉద్యోగుల్లో వచ్చే బీపీ, డయాబెటిస్, అధిక బరువు, ఫ్యాటీ లివర్, హై కొలెస్ట్రాల్, నిద్రలేమి, గుండె జబ్బులు వంటి సమస్యలేవీ రాత్రికి రాత్రే ఊడిపడవు. ఇవన్నీ దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల పాటు శరీరంలో నిశ్శబ్దంగా పెరుగుతూ వస్తాయి. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం, వేళాపాళా లేని ఆహారం, వ్యాయామం లేకపోవడం, మితిమీరిన మానసిక ఒత్తిడి, రోజుకు 5-6 గంటలు కూడా నిద్రపోకపోవడం వంటి అలవాట్లే ఈ జబ్బులను వేగంగా కొనితెస్తున్నాయి.
అయితే, ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి కొంపలు మునిగిపోయే జీవనశైలి మార్పులేమీ అవసరం లేదు. ఉద్యోగంలో, ఇంట్లో మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే కొండంత ఆరోగ్యాన్ని ఇస్తాయి.
ఉద్యోగులు పాటించాల్సిన 5 సూత్రాలు
- నిరంతరం కూర్చోవద్దు: డెస్క్ జాబ్ అంటే 8 గంటలూ కుర్చీకే అతుక్కుపోవాలని కాదు. ప్రతి 30 నుంచి 60 నిమిషాలకొకసారి లేచి నుంచోవడం, రెండు నిమిషాలు నడవడం లేదా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం అలవాటు చేసుకోండి. ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు నడుస్తూ మాట్లాడండి. లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడండి. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి.
- ఆహారంపై దృష్టి పెట్టండి: హైదరాబాద్ ఆహార రుచులు అద్భుతంగా ఉంటాయి. కానీ, రోజూ బిర్యానీలు, వేపుళ్లు, తీపి పానీయాలు, వెండింగ్ మెషిన్లలో దొరికే బిస్కెట్లు తింటే కొవ్వు వేగంగా పేరుకుపోతుంది. మీ ప్లేట్‌లో సగం కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. పప్పు ధాన్యాలు, గుడ్లు, చికెన్ లేదా చేపల రూపంలో ప్రొటీన్ తీసుకోండి. పాలిష్ పట్టని చిరుధాన్యాలు, బ్రౌన్ రైస్, ఓట్స్ ద్వారా పీచు పదార్థం లభిస్తుంది. డెస్క్ దగ్గర నీటి సీసాతో పాటు వేయించిన శనగలు, పండ్లు లేదా పల్లీలు ఉంచుకోవడం మంచిది.
- నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు: నిద్ర అనేది ఏదో విలాసవంతమైన విషయం కాదు, శరీరానికి అత్యంత అవసరమైన ప్రక్రియ. ప్రతి ఒక్కరూ రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. రాత్రింబవళ్ళు పనిచేస్తూ, తెల్లవారుజామున 2 గంటల వరకు స్మార్ట్‌ఫోన్లలో స్క్రోలింగ్ చేయడం వల్ల బీపీ, షుగర్ స్థాయిలు పెరిగి, మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది.
- ఆరోగ్య సూచీలను తెలుసుకోండి: శరీరం పైకి పూర్తి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ లోపల అధిక రక్తపోటు లేదా డయాబెటిస్ ఉండే అవకాశం ఉంది. వయస్సు, కుటుంబ ఆరోగ్య చరిత్ర ఆధారంగా క్రమం తప్పకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, బరువు పరీక్షలు చేయించుకోవాలి.
- మానసిక ఆరోగ్యాన్ని సీరియస్‌గా తీసుకోండి: తీవ్రమైన ఒత్తిడి, చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, నిరాశ, సరిగా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలను కార్పొరేట్ లైఫ్‌లో భాగమని సరిపెట్టుకోవద్దు. అవసరమైనప్పుడు మానసిక నిపుణుల సాయం కోరడం బాధ్యతాయుతమైన చర్యే తప్ప బలహీనత కానే కాదు.
యాజమాన్యాలు ఏం చేయాలి?
ఏడాదికి ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. సంస్థలు తమ ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి.
- స్క్రీనింగ్ పరీక్షల్లో ఎవరికైనా బీపీ, షుగర్ ఉన్నట్లు తేలితే వారు వైద్యుడిని సంప్రదించేలా ప్రోత్సహించాలి.
- ఆఫీసుల్లో ఉద్యోగులు నడవడానికి అనువైన స్థలాలు, మెట్లు అందుబాటులో ఉంచాలి. కూర్చునే కుర్చీలు, డెస్క్‌లు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలి.
- క్యాంటీన్లలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలి. మైదా, తీపి పానీయాలు, జంక్ ఫుడ్‌ను తగ్గించాలి.
- షిఫ్ట్ వేళల్లో స్పష్టత, సమతుల్యమైన పనిభారం ఉండేలా చూస్తే ఉద్యోగులు తగినంత నిద్రపోవడానికి, ఒత్తిడి తగ్గడానికి వీలవుతుంది.
- హెల్త్ చెకప్ లేదా మెడికల్ లీవ్ తీసుకునే ఉద్యోగులను అంకితభావం లేనివారిగా చూడకుండా, నివారణ ఆరోగ్య రక్షణను ఆఫీస్ సంస్కృతిలో భాగం చేయాలి.
ముందస్తు జాగ్రత్తే అసలైన పెట్టుబడి
{{/usCountry}}ఏడాదికి ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. సంస్థలు తమ ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి.
- స్క్రీనింగ్ పరీక్షల్లో ఎవరికైనా బీపీ, షుగర్ ఉన్నట్లు తేలితే వారు వైద్యుడిని సంప్రదించేలా ప్రోత్సహించాలి.
- ఆఫీసుల్లో ఉద్యోగులు నడవడానికి అనువైన స్థలాలు, మెట్లు అందుబాటులో ఉంచాలి. కూర్చునే కుర్చీలు, డెస్క్‌లు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలి.
- క్యాంటీన్లలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలి. మైదా, తీపి పానీయాలు, జంక్ ఫుడ్‌ను తగ్గించాలి.
- షిఫ్ట్ వేళల్లో స్పష్టత, సమతుల్యమైన పనిభారం ఉండేలా చూస్తే ఉద్యోగులు తగినంత నిద్రపోవడానికి, ఒత్తిడి తగ్గడానికి వీలవుతుంది.
- హెల్త్ చెకప్ లేదా మెడికల్ లీవ్ తీసుకునే ఉద్యోగులను అంకితభావం లేనివారిగా చూడకుండా, నివారణ ఆరోగ్య రక్షణను ఆఫీస్ సంస్కృతిలో భాగం చేయాలి.
ముందస్తు జాగ్రత్తే అసలైన పెట్టుబడి
{{/usCountry}}కార్పొరేట్ ఆఫీసులను ఆసుపత్రులుగా మార్చడం లేదా ఉద్యోగులను అనారోగ్య భయాలతో భయపెట్టడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఆరోగ్యకరమైన ఎంపికను అత్యంత సులువైన ఎంపికగా మార్చడమే లక్ష్యం. హైదరాబాద్ నగర తదుపరి వృద్ధి కేవలం ఇక్కడి ప్రాజెక్టులు, ఉత్పాదకతపైనే కాక, పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తినడం, హాయిగా నిద్రపోవడం, ఒత్తిడిని జయించడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం, మద్యం పరిమితం చేయడం, వ్యాక్సిన్లు వేయించుకోవడం, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. యాజమాన్యాలు కూడా ఆరోగ్యకరమైన అలవాట్లను ఆఫీసు వాతావరణంలో సులభతరం చేయాలి. తక్కువ లీవ్‌లు ఇచ్చే సంస్థ కంటే, ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా కెరీర్‌ను నిర్మించుకునే ఆఫీసే అసలైన ఆరోగ్యకరమైన పనిప్రాంతం అని గుర్తించాలి.
- డాక్టర్ వంశీ వి,
కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్,
గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ (ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్),
ఎల్బీనగర్, హైదరాబాద్.