...
...
Next Story

అమెరికన్లు మద్యం తాగడం లేదు… సరికొత్త చారిత్రక కనిష్ఠానికి కుటుంబ ఖర్చులు

అమెరికాలో కుటుంబాల మొత్తం బడ్జెట్‌లో మద్యానికి కేటాయించే వాటా చారిత్రక కనిష్ఠానికి పడిపోయింది. 2025లో ప్రతి ఇల్లు సగటున 630 డాలర్లు మాత్రమే ఖర్చు చేసినట్లు యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధే ఈ మార్పునకు కారణమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Published on: Oct 30, 2026, 08:32:23 IST
Advertisement

అమెరికాలో ప్రజల జీవనశైలిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. పౌరులు మద్యం సేవించే అలవాటుకు క్రమంగా దూరమవుతున్నారు. అక్కడ కుటుంబాలు తమ వార్షిక బడ్జెట్‌లో మద్యపానానికి కేటాయించే వ్యయం ఆల్‌టైమ్ రికార్డు కనిష్ఠానికి పడిపోయింది.

అమెరికన్లు మద్యం తాగడం లేదు… సరికొత్త చారిత్రక కనిష్ఠానికి కుటుంబ ఖర్చులు
అమెరికన్లు మద్యం తాగడం లేదు… సరికొత్త చారిత్రక కనిష్ఠానికి కుటుంబ ఖర్చులు

అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్ఎస్) గురువారం విడుదల చేసిన వార్షిక వినియోగదారుల ఖర్చుల సర్వే ప్రకారం.. 2025లో అమెరికన్ కుటుంబాల సగటు మొత్తం వ్యయంలో మద్యపాన వాటా కేవలం 0.77 శాతానికి పరిమితమైంది. ఇది ఒక్కో కుటుంబానికి సగటున 630 డాలర్లు మాత్రమే. 1984లో ఈ తరహా డేటా సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అతితక్కువ స్థాయి. 2020 కోవిడ్ లాక్‌డౌన్ల సమయంలో నమోదైన 0.78 శాతం రికార్డు కంటే ఇది మరింత కిందకు పడిపోయింది.

ఆరోగ్యంపై శ్రద్ధ.. మార్గదర్శకాల ప్రభావం

కరోనా మహమ్మారి ముగిసినప్పటి నుంచి మద్యం అమ్మకాలు తీవ్ర మందగమనం ఎదుర్కొంటున్నాయి. వినియోగదారుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన పెరగడమే ఇందుకు కారణం. మద్యం తాగడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై ప్రజారోగ్య సంస్థలు ఇస్తున్న నూతన హెచ్చరికలు కూడా కస్టమర్ల ఆలోచనా విధానాన్ని మార్చేశాయి.

ఈ విషయాన్ని ప్రముఖ గాలప్ సర్వే ఫలితాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. అమెరికాలో మద్యం సేవిస్తున్న వారి నిష్పత్తి గత ఏడాది రికార్డు స్థాయిలో 54 శాతానికి పడిపోగా, ఈ ఏడాది (2026) కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. 2026లో వారానికి సగటున తాగే మద్యం పరిమాణంలో కొద్దిపాటి పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గత కొన్నేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువగానే ఉంది.

మార్కెట్లో భారీగా పడిపోయిన షేర్లు

లిక్కర్ అమ్మకాలు క్షీణించడంతో ఆయా కంపెనీలపై పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోతున్నారు. గత ఐదేళ్ల కాలంలో ప్రముఖ మద్యం దిగ్గజాలైన డియాజియో పీఎల్సీ, బ్రౌన్-ఫార్మన్ కార్పొరేషన్ షేర్లు 50 శాతానికి పైగా క్షీణించాయి. మరోవైపు బీర్ తయారీ రంగానికి చెందిన కాన్‌స్టెల్లేషన్ బ్రాండ్స్ షేర్లు 40 శాతం, మోల్సన్ కూర్స్ బెవరేజ్ కంపెనీ షేర్లు 11 శాతం దాకా నష్టపోయాయి.

కొత్త వ్యూహాల్లో మద్యం కంపెనీలు

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON