చరిత్రను చదవడం వేరు, ఆ చరిత్రను తిరగరాయడం వేరు! కొందరు పుట్టుకతోనే హీరోలు అవుతారు, మరికొందరు తమ కఠిన శ్రమతో, అంకితభావంతో తరాలను ఏలే మహా సామ్రాజ్యాన్నే సృష్టిస్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గగనాన దశాబ్దాలుగా ఎప్పటికీ వాడని ఒకే ఒక చందమామ.. మనందరి సూపర్ స్టార్ మహేష్ బాబు! ఇవాళ మన ప్రిన్స్, మన సూపర్ స్టార్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను ఇక్కడ చూసేద్దాము..
బాలనటుడు టు సూపర్ స్టార్- వాట్ ఏ జర్నీ..

చిరుప్రాయంలోనే బాలనటుడిగా కెమెరా ముందుకు వచ్చి, తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆ అబ్బాయి.. 'రాజకుమారుడు' సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ గడప తొక్కిన క్షణం తెలుగు సినిమా రూపురేఖలే మారిపోయాయి! అప్పట్నుంచి ఇప్పటివరకు ఆయన ప్రయాణం కేవలం బాక్సాఫీస్ రికార్డులతో ముడిపడిపోలేదు.. అది కోట్లాది మంది యువతకు ఒక నిత్య స్పూర్తి పాఠం!
తెరపై ఆయన కనిపిస్తే చాలు.. థియేటర్లలో ఈలలు, కేకలతో మోత మోగిపోతుంది. 'మురారి'లో ఆ చిలిపి నవ్వు చూసి కరిగిపోని మనసంటూ ఉంటుందా? 'ఒక్కడు'లో ఆ కత్తిలాంటి మేనిరిజమ్ చూసి గూస్‌బంప్స్ రాని కుర్రాడు ఉంటాడా? ఇక 'పోకిరి'తో బాక్సాఫీస్ రికార్డుల సునామీ సృష్టించి, టాలీవుడ్ స్థాయిని దేశవ్యాప్తంగా మారుమోగేలా చేశారు మహేష్ బాబు. గ్లామర్ పరంగా గ్రీకు వీరుడిలా కనిపిస్తూనే, యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్‌ను షాక్ ఇవ్వడం ఒక్క మహేష్‌కే చెల్లింది!
అయితే, కేవలం కమర్షియల్ మాస్ ఇమేజ్‌తో ఆగిపోలేదు ఆయన ప్రయాణం. ఒక హీరోగా సమాజం పట్ల తనకు కూడా బాధ్యత ఉందని గట్టిగా నమ్మి నిరూపించారు. 'శ్రీమంతుడు' చిత్రంతో ఒక ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి, రియల్ లైఫ్‌లోనూ బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని ఆచరించి చూపించారు. 'మహర్షి' సినిమాతో వ్యవసాయం గొప్పతనాన్ని, రైతన్న కష్టాన్ని వెండితెరపై ఆవిష్కరించి ప్రతి ఒక్కరిని కదిలించారు. సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాకూడదు, సమాజంలో మార్పు తెచ్చేలా ఉండాలని పరితపించే కొద్దిమంది హీరోల్లో మహేష్ బాబు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.
ఇక తెరవెనుక ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎటువంటి వివాదాలకు తావునివ్వకుండా, అత్యంత ప్రశాంతంగా, పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్‌గా ఉండే ఆయన స్వభావం ఎవరినైనా కట్టిపడేస్తుంది. కెరీర్లో ఎన్ని విజయాలు వచ్చినా, పరాజయాలు ఎదురైనా ఏనాడూ అహంకారానికి పోలేదు. అదే సమయంలో 'మహేష్ బాబు ఫౌండేషన్' ద్వారా గుండె జబ్బులతో బాధపడుతున్న వందలాది మంది పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించి, వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఎవరికీ చెప్పుకోకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ లైఫ్‌లోనూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.
{{/usCountry}}ఇక తెరవెనుక ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎటువంటి వివాదాలకు తావునివ్వకుండా, అత్యంత ప్రశాంతంగా, పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్‌గా ఉండే ఆయన స్వభావం ఎవరినైనా కట్టిపడేస్తుంది. కెరీర్లో ఎన్ని విజయాలు వచ్చినా, పరాజయాలు ఎదురైనా ఏనాడూ అహంకారానికి పోలేదు. అదే సమయంలో 'మహేష్ బాబు ఫౌండేషన్' ద్వారా గుండె జబ్బులతో బాధపడుతున్న వందలాది మంది పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించి, వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఎవరికీ చెప్పుకోకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ లైఫ్‌లోనూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.
{{/usCountry}}సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అన్న గర్వం మహేష్ బాబులో ఒక్కసారి కూడా కనిపించలేదు. అందుకే, ఈ శ్రీమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి పెద్ద జీవన పాఠం.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి, కష్టపడే తత్త్వాన్ని ఎప్పటికీ వదలకూడదు. ఆయన క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మన కెరీర్‌కు ఎప్పుడూ ఒక దిక్సూచిలా నిలుస్తాయి. గ్లామర్ అనేది ఒక వయసుతో ఆగిపోవచ్చు, కానీ ఆ వ్యక్తిత్వం, ఆ నడవడిక ఎప్పటికీ అలాగే ఉంటాయి.
టాలీవుడ్ గర్వించదగ్గ సూపర్ స్టార్‌కు.. హ్యాపీ బర్త్ డే! యు ఆర్ ఆల్వేస్ ఆన్ ఇన్స్పిరేషన్!