ఐటీ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్​గా! నెలకు రూ. 60వేలు సంపాదిస్తున్న మహిళ..

Viral Video : ఒక మహిళా ఆటో డ్రైవర్​కి సంబంధించిన ఒక రీల్ ఇప్పుడు వైరల్​గా మారుతోంది. ఐటీ ఉగ్యోగాన్ని వదిలేసి, ఆమె ఆటో డ్రైవర్​ అవ్వడం విశేషం. అంతేకాదు, ఆమె ఇప్పుడు నెలకు రూ. 60వేల కన్నా ఎక్కువే సంపాదిస్తోంది.

Published on: May 30, 2026, 15:58:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ జీతాలు, ఏసీ రూముల్లో కొలువులు ఎందరికో కల. కానీ, అదే ఐటీ రంగానికి చెందిన ఒక మహిళ.. ఆఫీస్ ఒత్తిడి, నిరంతర పని గంటలను భరించలేక తన ఐటీ కెరీర్‌కు స్వస్తి పలికింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆమె రోడ్డుపై ఆటో రిక్షా నడపడం ప్రారంభించింది. తన సొంత షెడ్యూల్ ప్రకారం పని చేసుకుంటూ, ప్రస్తుతం ఆమె నెలకు సుమారు రూ. 60,000 సంపాదిస్తోంది. కార్పొరేట్ లైఫ్ కంటే ఇప్పుడే ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నానని ఆమె చెబుతున్న వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. సాంప్రదాయ కెరీర్‌ను వదిలి, మనశ్శాంతిని ఇచ్చే వృత్తిని ఎంచుకున్న ఆమె ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఐటీ ఉద్యోగం వదిలి ఆటో డ్రైవర్​గా మారిన మహిళ..
ఐటీ ఉద్యోగం వదిలి ఆటో డ్రైవర్​గా మారిన మహిళ..

కంప్యూటర్ స్క్రీన్ల ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొంది.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన రీల్​ని ఇక్కడ చూడండి :

కార్పొరేట్ ఉద్యోగాల్లో ఉండే డెడ్‌లైన్లు, బాస్‌ల ఒత్తిడి కంటే.. స్వతంత్రంగా బతకడంలోనే ఎక్కువ ఆనందం ఉందనే విషయానికి ఈ ఐటీ మహిళా ఆటో డ్రైవర్ కథ ఒక చక్కని ఉదాహరణగా నిలిచింది.

వైరల్ రీల్‌పై వచ్చిన టాప్ నెటిజన్ కామెంట్లు, నెమరువేసుకున్న కథనాలు ఇక్కడ చూద్దాము..

1. కార్పొరేట్ నరకంపై ఐటీ ఉద్యోగుల ఆవేదన

ఆమె ఆటో నడుపుతున్న వీడియో చూసిన ఒక ఐటీ ఉద్యోగి తన మనసులోని బాధను వెళ్లగక్కాడు.

"నేను 18 ఏళ్లుగా ఐటీ ఫీల్డ్‌లోనే ఉన్నాను. ఒక ఈమెయిల్‌తో ముగిసిపోయే చిన్న విషయానికి కూడా గంటల తరబడి ఎండ్-లెస్ మీటింగులు పెడతారు. ‘క్విక్ కాల్’ అంటూ పిలిచి గంటలు గంటలు సాగదీస్తారు. అర్ధరాత్రి వచ్చే ప్రొడక్షన్ ఇష్యూలు సరేసరి. ఇవన్నీ భరిస్తూ బతకడానికి ఎంత ఓపిక, మానసిక స్థిరత్వం కావాలో నాకు తెలుసు," అంటూ ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాడు.

2. సంపాదన, మనశ్శాంతిపై చర్చ..

మరో నెటిజన్ స్పందిస్తూ.. "ఆమె ఐటీ ఉద్యోగం చేసేటప్పుడే మంచి ప్యాకేజీ సంపాదించి ఉంటుంది. కచ్చితంగా ఆమె అకౌంట్లో రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకుని ఉంటుంది. అందుకే ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ నిర్ణయం తీసుకోగలిగింది," అని కామెంట్ చేశాడు.

మూడొవ యూజర్ ఆమె సరళమైన జీవితాన్ని మెచ్చుకుంటూ.. "చివరికి మనిషికి కావాల్సింది కోట్లు కాదు, ‘పీస్ ఆఫ్ మైండ్’. ఆమె తనకు నచ్చినట్టు ప్రశాంతంగా జీవిస్తోంది, ఆమె భవిష్యత్తు బాగుండాలి," అని ఆకాంక్షించాడు.

యూపీ ఆటో డ్రైవర్ సంచలన కథ..

ఈ కామెంట్ల మధ్య ఒక యూజర్ ఉత్తరప్రదేశ్​కి చెందిన ఒక ఆటో డ్రైవర్ తన సక్సెస్ స్టోరీని షేర్ చేశాడు:

ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలేసి ఆటో నడపడం ప్రారంభించాడు. గడిచిన 15 ఏళ్లలో అతను ఆటో సంపాదనతో తన వ్యాపారాన్ని ఎంతగా విస్తరించాడంటే.. ప్రస్తుతం అతను 5 భారీ భారత్ ట్రక్కులకు యజమాని అయ్యాడు.

అంతేకాదు, అతని ఆస్తి విలువ దాదాపు రూ. 5 కోట్లకు చేరింది. అంత ఆస్తి ఉన్నప్పటికీ, అతను ఇప్పటికీ ఉదయాన్నే లేచి తన పాత ఆటోను నడుపుతూనే ఉంటాడు. అతని నిరాడంబరతను చూసి ఒక టీవీ యాంకర్ సైతం నోరెళ్లబెట్టాడని ఆ యూజర్ గుర్తుచేశాడు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More