Android Auto : కారులో ఆండ్రాయిడ్ ఆటో వాడుతుంటారా? ఈ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోండి..
Gemini AI in Cars : కారులో ఆండ్రాయిడ్ ఆటో వినియోగించే వారికి అదిరే వార్త! గూగుల్ ఈ టెక్నాలజీలో క్రేజీ మార్పులు, అప్డేట్స్ చేస్తోంది. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
Android Auto Updates 2026 : ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 కోట్ల వాహనాల్లో వాడుతున్న ఆండ్రాయిడ్ ఆటో టెక్నాలజీని గూగుల్ అప్డేట్ చేస్తోంది. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు విప్లవాత్మక మార్పులు ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఆటో, గూగుల్ ఇన్-బిల్ట్ సిస్టమ్స్ కోసం సరికొత్త డిజైన్, నావిగేషన్, ఎంటర్టైన్మెంట్ ఫీచర్లను పరిచయం చేసింది. ఆ వివరాలు..

1. డిజైన్, ఇంటర్‌ఫేస్ మార్పులు..
గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆటోని సరికొత్త ‘మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్’ డిజైన్‌తో అప్‌గ్రేడ్ చేసింది. ఇది ఆధునిక స్మార్ట్‌ఫోన్ల తరహాలోనే అత్యంత ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, యూజర్లు తమ కారు డ్యాష్‌బోర్డ్‌ను పర్సనలైజ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.
డ్రైవర్లు ఇప్పుడు తమ స్క్రీన్‌పై విడ్జెట్‌లను తమకు నచ్చినట్లుగా అమర్చుకోవచ్చు. వాతావరణ అప్డేట్లు, ఇష్టమైన కాంటాక్ట్‌లు, పెంపుడు జంతువుల ఫోటోలు లేదా పెద్ద గడియారాన్ని విడ్జెట్‌లుగా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇంటికి చేరుకోగానే గ్యారేజ్ డోర్ ఓపెనర్ల వంటి షార్ట్‌కట్లను నేరుగా స్క్రీన్ పైనే ఉంచడం ద్వారా సౌకర్యవంతంగా ఉంటుంది. మిని కార్లలో ఉండే రౌండ్ స్క్రీన్ల నుంచి వైడ్ స్క్రీన్ల వరకు ఏ ఆకారంలో ఉన్న డిస్‌ప్లే కైనా ఈ సాఫ్ట్‌వేర్ చక్కగా సరిపోతుంది.
2. గూగుల్ మ్యాప్స్‌లో విప్లవాత్మక మార్పులు..
గత పదేళ్లలో గూగుల్ మ్యాప్స్‌లో జరగని అతిపెద్ద మార్పు ఇది. ‘ఇమ్మర్సివ్ నావిగేషన్’ ద్వారా డ్రైవింగ్ సులభతరం కానుంది.
3డీ వ్యూ: ఇప్పుడు మ్యాప్స్‌లో భవనాలు, ఓవర్‌పాస్‌లు, ట్రాఫిక్ సిగ్నల్స్, స్టాప్ సైన్లు, లేన్ గైడెన్స్ 3డీ శైలిలో అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి.
లైవ్ లేన్ గైడెన్స్: ఫ్రంట్ కెమెరా ఉన్న కార్లలో, రియల్ టైమ్‌లో ఏ లేన్‌లో వెళ్లాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనే వివరాలు నేరుగా స్క్రీన్‌పై కనిపిస్తాయి. క్లిష్టమైన మలుపులు ఉన్న చోట ఇది డ్రైవర్లకు రక్షణగా నిలుస్తుంది.
3. కారులోనే హై-రిజల్యూషన్ యూట్యూబ్..
ఎంటర్టైన్మెంట్ రంగంలో గూగుల్ మరో ముందడుగు వేసింది. ఈ ఏడాది చివరలో హై-రిజల్యూషన్ యూట్యూబ్ వీడియో సపోర్ట్ రాబోతోంది.
4కే/60ఎఫ్‌పీఎస్ ప్లేబ్యాక్: కారు పార్కింగ్‌లో ఉన్నప్పుడు లేదా ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫుల్ హెచ్డీ వీడియోలను 60ఎఫ్‌పీఎస్ వేగంతో చూడవచ్చు.
భద్రతా ఫీచర్: కారు కదలడం ప్రారంభించగానే వీడియో ఆటోమేటిక్‌గా ఆగిపోయి ఆడియో మాత్రమే ప్లే అవుతుంది.
డాల్బీ అట్మోస్: స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్ వంటి యాప్‌లలో డాల్బీ అట్మోస్ స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా చేర్చారు.
ఈ ఫీచర్లు మొదట బీఎండబ్ల్యూ, ఫోర్డ్, హ్యుందాయ్, కియా, మెర్సిడెస్ బెంజ్, రెనాల్ట్, వోల్వో వంటి బ్రాండ్లతో పాటు టాటా, మహీంద్రా కార్లలో అందుబాటులోకి రానున్నాయి.
4. జెమినీ ఏఐ సపోర్ట్..
గూగుల్ తన శక్తివంతమైన జెమినీ ఏఐని వాహనాల్లోకి లోతుగా అనుసంధానించింది.
హ్యాండ్స్-ఫ్రీ టాస్క్: ఆండ్రాయిడ్ ఆటోలో మీ మెసేజ్‌లు, ఈమెయిల్స్, క్యాలెండర్ నుంచి అడ్రస్‌లను గ్రహించి జెమిని నేరుగా గమ్యాన్ని సెట్ చేస్తుంది.
వెహికల్ అసిస్టెంట్: కారు డ్యాష్‌బోర్డ్‌లో ఏదైనా వార్నింగ్ లైట్ వెలిగితే అది ఎందుకో జెమినీని అడిగి తెలుసుకోవచ్చు. మీ కారు డిక్కీలో ఎంత ఖాళీ ఉంది? మీరు కొన్న వస్తువులు అందులో పడతాయా? వంటి వాహన సంబంధిత ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తుంది.
భవిష్యత్తులో జూమ్ వంటి మీటింగ్ యాప్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి!
ఈ అప్డేట్స్ అన్నీ 2026 ఏడాది పొడవునా వివిధ దశల్లో యూజర్లకు అందనున్నాయి. భారతీయ డ్రైవర్లకు, ముఖ్యంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఈ ఫీచర్లు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


