Oppo Find X9 Ultra : ఒప్పో నుంచి పవర్​ఫుల్ ఫ్లాగ్‌షిప్స్- 200ఎంపీ కెమెరా, 7000+ బ్యాటరీతో!

Oppo new smartphones : ఒప్పో నుంచి రెండు కొత్త స్మార్ట్​ఫోన్స్​ చైనాలో లాంచ్​ అయ్యాయి. అవి ఒప్పో ఫైండ్​ ఎక్స్​9 అల్ట్రా, ఫైండ్​ ఎక్స్9ఎస్​. భారీ బ్యాటరీ, కెమెరా ఫీచర్స్​తో వస్తున్న ఈ గ్యాడ్జెట్స్ ధరలు, ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి.

Published on: Apr 22, 2026, 11:20:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో తన ప్రతిష్టాత్మక 'ఫైండ్ ఎక్స్9' సిరీస్‌ను చైనా మార్కెట్​లో లేటెస్ట్​గా లాంచ్​ చేసింది. ఈ లైనప్‌లో అత్యంత శక్తివంతమైన ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రాతో పాటు ఫైండ్​ ఎక్స్​9ఎస్​ ఉన్నాయి. అదిరిపోయే కెమెరా సెటప్, భారీ బ్యాటరీ, సరికొత్త ప్రాసెసర్లతో వచ్చిన ఈ ఫోన్ల వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఒప్పో ఫైండ్ ఎక్స్​9 అల్ట్రా స్మార్ట్​ఫోన్​లో 4 రేర్ కెమెరాలు..
ఒప్పో ఫైండ్ ఎక్స్​9 అల్ట్రా స్మార్ట్​ఫోన్​లో 4 రేర్ కెమెరాలు..

ఒప్పో ఫైండ్ ఎక్స్​9 అల్ట్రా- ఫీచర్లు, ప్రత్యేకతలు..

ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా స్మార్ట్​ఫోన్ ఈ సిరీస్‌లోనే టాప్-ఎండ్ మోడల్. దీని స్పెసిఫికేషన్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

డిస్​ప్లే: 6.82- ఇంచ్ క్యూహెచ్​డీ+ ఫ్లెక్సిబుల్ అమోఎల్​ఈడీ స్క్రీన్. 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.

ప్రాసెసర్: క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్​డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తోంది. ఇది మల్టీ-టాస్కింగ్, గేమింగ్‌కు తిరుగులేని పర్ఫార్మెన్స్ ఇస్తుంది.

కెమెరా (క్వాడ్​ సెటప్): ఇందులో నాలుగు రేర్ కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ (ఓఐఎస్) కాగా, మరో 200ఎంపీ టెలిఫోటో లెన్స్, 50ఎంపీ అల్ట్రా-వైడ్, 50ఎంపీ అల్ట్రా-టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇది 10ఎక్స్ ఆప్టికల్ జూమ్, 120ఎక్స్ డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం 50ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: భారీ 7,050ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ. దీనికి తోడు 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

ధర: ఒప్పో ఫైండ్​ ఎక్స్​8 అల్ట్రా ప్రారంభ ధర 7,499 యువాన్​లుగా ఉంది. అంటే సుమారు రూ. 1,03,000. ర్యామ్- స్టోరేజ్​ బట్టి ధర రూ. 8,499 యువాన్ (సుమారు రూ. 1,17,000) వరకు కూడా వెళుతుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్ ప్రో: చిన్న ప్యాకెట్.. పెద్ద ధమాకా!

తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభవం కోరుకునే వారి కోసం ఒప్పో ఫైండ్​ ఎక్స్​9ఎస్ ప్రోని తీసుకొచ్చారు.

ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇందులోనూ 200ఎంపీ ప్రధాన కెమెరా, 200ఎంపీ పెరిస్కోప్ కెమెరా ఉండటం విశేషం.

6.32- ఇంచ్ డిస్​ప్లే, 7,025ఎంఏహెచ్ బ్యాటరీ, 80డబ్ల్యూ ఛార్జింగ్‌తో ఇది వస్తోంది.

ఈ ఒప్పో ఫైండ్​ ఎక్స్​9ఎస్​ ప్రారంభ ధర రూ. 5,299 యువాన్​లుగా ఉంది. అంటే సుమారు రూ. 73వేలు. హయ్యర్ వేరియంట్​ ధర 6,999 యువాన్​ల వరకు ఉంటుంది. అంటే సుమారు రూ. 96వేలు.

ఇండియా లాంచ్ ఎప్పుడు?

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు మే నెలలో భారత్‌లో విడుదల కానున్నాయి. ఇక్కడి ధరలు, ఆఫర్ల వివరాలను లాంచ్ సమయంలో ఒప్పో వెల్లడించనుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి ఫీచర్లు కేవలం కొన్ని వేరియంట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. Oppo Find X9 Ultra మెయిన్ కెమెరా సామర్థ్యం ఎంత?

దీనిలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

2. ఇందులో వాడిన బ్యాటరీ ప్రత్యేకత ఏంటి?

ఈ ఫోన్‌లో భారీ 7,050mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని వాడారు. ఇది 100W వేగవంతమైన ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

3. ఇండియాలో ఈ ఫోన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?

ఒప్పో అధికారిక సమాచారం ప్రకారం, Find X9 సిరీస్ మే 2026లో భారత మార్కెట్లో విడుదల కానుంది.

4. Find X9s Proలో ఏ ప్రాసెసర్ వాడారు?

Find X9s Pro మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 (MediaTek Dimensity 9500) చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More